ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు. 

తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు.

ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు.

నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిటి ? దీని సంగతేమో తేల్చుకొందామని పుర్రెలను మెడలో వేసుకొని తిరిగే శివుడిని అడిగాలని

నేరుగా కైలాసానికి వెళ్ళి శివుడితో చూసారా ! ముక్కంటి  ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందని బ్రహ్మ వ్రాశాడు. ఇదేం చోద్యం, కారణమేమిటో చెప్పండంటూ విన్నవించాడు. అందుకా జటాధారి నారదా! ఈ పుర్రె ధూమకేత మహరాజుది. వీడి ఆగడాలు ఎక్కువైతే విష్ణువు వీడితల సుదర్శచక్రంతో ఖండించాడు.కపాలలాలను నేను మెడలో వేసుకొన్నంత మాత్రాన నాకు అన్ని తెలిసివుండాలనే రూలేమి లేదు.కాబట్టి నువ్ తిన్నగా వైకుంఠానికి వెళ్ళి ధూమకేతు మహారాజును సంహరించిన విష్ణుదేవుడినే అడుగు ఆయన నీకు సరైన జవాబు చెప్పగలడని సమాధానం ఇచ్చాడు. 

శివుడికేం తెలియదంటూ గొణుక్కుంటూ వైకుంఠం దారిబట్టాడు నారదుడు. వైకుంఠంలో దేవదేవుణికి నమస్కరించి నారాయణ నారాయణ అంటూ గానం చేశాడు. చూశావా పద్మనాభ ఈ పుర్రెకు కాళ్ళులేవు, ప్రాణంలేదు. కదలదు మెదలదు ఇది ముల్లోకాలను తిరుగుతుందట. మా నాన్నకు వయసుఎక్కువైతున్న కొద్ది చాదస్తం కూడా ఎక్కుమైంది.ఏదిబడితే అది వ్రాసేస్తున్నాడంటూ ఓ కంప్లైంట్  ఫైల్ చేశాడు.

అందుకా గోవిందుడు నారదా! బ్రహ్మరాతకు తిరుగులేదు. జరిగితీరుతుంది కూడా. అయినా నారదా! ఇదిగో ఇటు చూడు నాకు దుష్టుల సంహరమే తెలుసు అంతేకాని ఇలా పుర్రెలను చదవడం కారణాలు వెతకడం నాకు తెలియదయ్యా! అయినా నాకేం వేరేపనేమి లేదనుకొన్నావా ? వెళ్ళువయ్యా వెళ్ళు ఆ పిచ్చిగీతలేవో వ్రాసిన మీ తండ్రినే అడుగు, ఇదిగో నీ పుర్రెను నువ్వే తీసుకుపో అంటూ చేతిలో పెట్టాడు.

సరే సరే మా నాన్నతోనే తేల్చుకొంటాలే. నువ్ ఏదో పనోడివి అన్ని తెలుసునోడివనుకొని నీ దగ్గరకొచ్చానంటూ రుసరుసలాడుతూ సత్యలోకం వైపు కదిలాడు నారదుడు.

సత్యలోకంలో బ్రహ్మ నాలుగు తలలతో ఆలోచిస్తూ చతుర్భుజాలతో బాలపుర్రెల మీద ఎవో గీతలు వ్రాసుకొంటున్నాడు. నారదుడు నాన్న నాన్నోయ్ అంటూ పిలిచాడు. ఆయనేదో ఆయన దోరణిలోనే వున్నాడు. నారదుడుకి విసుగొచ్చింది, నాన్నోయ్యంటూ ముల్లోకాలు వినబడేలా గట్టిగా అరిచాడు. బ్రహ్మ తలపైకెత్తి ఏమిటన్నట్టు చూచాడు.

నారదుడు ధూమకేతమహరాజు యొక్క పుర్రెను బ్రహ్మ టెబుల్ పైకి విసిరికొట్టి ఏమిటి నాన్న నువ్ వ్రాసేది, నీలో చాదస్తం పెరిగిపోతోంది.ఏది సాధ్యం ఏది అసాధ్యమనే ఆలోచనలు లేకుండా ఘంటముంది కదాని ఏదంటే ఆది వ్రాసేస్తున్నావు. చూడు ఈ పుర్రె మీద ఏం వ్రాసావో, వ్రాసేముందు ఆలోచించాక్కర లేదా!  కాళ్ళు,కండ్లు ప్రాణం లేని కపాలమేమిటి ముల్లోకాలను చుట్టడమేమిటంటూ ధబాయించి అడిగాడు.

అందుకు బ్రహ్మదేవుడు నాయన విధిలిఖితాన్ని ఎవరూ తప్పించలేరు. చివరకు నేను వ్రాసిన వ్రాతలు తుడపటానికి నా వల్లకూడా కాదు. నేను వ్రాసిందేమి పొల్లుపోదు.

ఇక ఆ కపాలం సంగతంటావా నువ్వే ఆ గీతలు ఎందుకున్నాయో తెలుసుకోటానికి పుర్రెను చేత్తోపట్టుకొని మొదట కైలాసానికి, ఆ తరువాత వైకుంఠానికి చివరికి నా దగ్గరకు అంటే సత్యలోకానికి తీసుకువచ్చావ్.అంటే నేను వ్రాసిన రాతలను నిజం చేస్తూ ఈ పుర్రెను నువ్వే మూడు లోకాలను తిప్పినావంటూ సమాధానం ఇవ్వగానే 

నారదుడు సారీ నాన్నా అంటూ అమ్మ సరస్వతమ్మచాటుకు చేరి ముఖం కనబడకుండా అమ్మ చీరచెంగుతో తలను కప్పేసుకొన్నాడు సిగ్గుతో.


Credits: .జి.బి.విశ్వనాథ.. అనంతపురం. 

కామెంట్‌లు

  1. చాలా బాగుంది. అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది. బ్రహ్మ కి కూడా table ఉందా?

    రిప్లయితొలగించు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ