ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆకర్షణలు - ప్రలోభాలు

ఆకాశంలో  ఒక   గ్రద్ద   ఆహారం కోసం    చూస్తుండగా  ఒక  నక్క   ఎరలతో   నిండిన   బండి లాగుతూ వెళ్తోందట...పైనుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యిమని   ఆ నక్క  ముందు వాలి,     ఆ ఎరలు కావాలని నక్కను అడిగిందట. అప్పుడు ఆ నక్క తప్పకుండా ఇస్తాను. కానీ కొంత  వెల   అవుతుంది   అన్నదట. దానికి ఆ గ్రద్ద ఏమివ్వాలీ, ఎంతవ్వాలి అని అడిగితే, నీ రెండు   ఈకలు   ఇస్తే, నేను  ఒక ఎరను   ఇస్తాను అని నక్క అన్నదట.గ్రద్ద  తన రెండు   ఈకలు   పీకి ఇచ్చిందట.నక్క వాటిని తీసుకుని ఒక ఎరను   తీసి ఇచ్చిందట.దాన్ని తింటూ ఆహ ఎంత రుచిగా ఉంది.మళ్ళి ఇంకొకటి తిందాం"అని మళ్ళీ నక్క దగ్గరకు వచ్చిందట.అలా రుచి మరిగి మళ్ళీ మళ్ళీ తన ఈకలనిచ్చి ఎరలను కొంటూ వచ్చిందట ఆ గ్రద్ద. చివరికి ఆ గ్రద్ద ఈకలన్నీ అయిపోయాయి.అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్విందట.గ్రద్ద తేరుకొని, నిజం తెలుసుకొనే లోగ తన ఈకలన్ని ఊడి, పైకి ఎగరలేకపోయింది. నక్కఅమాంతం గ్రద్ద పైబడి చీల్చి తినేసింది. విచక్షణ కోల్పోయిశక్తినంతాఅమ్ముకుని, దేవుడిచ్చిన ఎగిరే శక్తిని కోల్పోయి చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద.


 సరిగ్గా మన జీవితంలో కూడా, మనల్ని ఆకర్షించి, ప్రలోభపెట్టి మనకు తాత్కాలిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మన పాలిట విషప్రాయాలై మన జీవితాలను విషాదంలో ముంచేస్తాయి. ఆకర్షణల ప్రలోభాల కారణంగా మన దృష్టి మరల్చబడుతుంది. మనిషి యొక్క లక్ష్యాన్ని, ఏకాగ్రతను,భగ్నం చేసే  పరిస్థితులు, ప్రలోభాలు అడుగడుగునా ఎదురవుతూనే  ఉంటాయి, ఒక వ్యక్తి తన ముందున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఆకర్షణలు,

ప్రలోభాల రూపంలో ఎదురవుతుంటాయి, ఎదుర్కోని తీరాల్సి వస్తుంది...

అప్పుడే మనిషి భగవంతుడు ఇచ్చిన యుక్తయుక్థ విచక్షణాజ్ఞానాన్ని ఉపయోగించి ఆకర్షణలకు, ప్రలోభాలకు లోనుకాకుండా దూరంగా ఉంటూ
జీవితాన్ని సార్ధక్యం చేసుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట