ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఒక వీరుని చరిత్రకు సంబంధించిన ఒకపేజీ అర్ధాంతరంగా కనుమరుగైనరోజు


సుభాష్ చంద్రబోస్ ...ఈ పేరు తెలియని భారతీయుడుండడేమో...ఆ పేరు వినబడగానే ఏదో మనసులో ఒక ఆరాధభావన.. ఆయన మతాలకతీతుడు, కులవర్గాలకు అతీతుడు..ఈ దేశంలో జన్మించి విదేశీయుల బానిసత్వం నుండి ఈ దేశానికి విముక్తి కలిగించాలని పోరాటం చేస్తూ కనుమరుగైపోయిన ఒక గొప్ప స్వాతంత్రసమరయోధుడు ఈ నేతాజీ!!!

     జనవరి 23,1897లో కటక్ లో ఒక సంపన్నకుటుంబంలో జన్మించిన బోస్ అక్కడే విద్యాభ్యాసం చేశారు.తండ్రి జానకీనాథ్ గొప్పలాయర్ ..మరియ అతివాద భావాలు గల కాంగ్రీస్ నాయకుడు. 1920 లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షలో నాల్గవర్యాంక్ రాగా ఇంగ్లీషులో ఆల్ ఇంగ్లండ్ స్తాయిలో ప్రథముడుగా నిలిచాడు. అయితే 1921 ఏప్రెల్ లో సివిల్ సర్వీస్ కి రిజైన్ చేసి భారతస్వాతంత్రోద్యమంలోనికి ప్రవేశించారు..భారత జాతీయకాంగ్రీసు లో యువజన అధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషించారు.చిత్తరంజన్ దాస్ గారితో కలిసి బెంగాల్ ఉద్యమం నడిపేరు. హిందీలో అతని ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగించేవి.అనతికాలంలో మంచివక్తగా, ఆకర్షణీయమైన నాయకుడిగా ఎదిగేరు. 1937 డిశంబరు 26 న ఎమిలీషెంకల్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు..

  అయితే స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్న తీరుపట్ల బోస్ అసంతృప్తిగా వుండేవారు.గాంధీగారితో సిద్దాంతపరమైన విభేదాలు కూడా వుండేవి..అహింసతో పాటు సాయుధపోరాటం కూడా వుండాలని అభిప్రాయపడేవాళ్ళు,. అదీగాగ కొందరు కుల,మత వర్గభేదాలతో ఆంగ్లేయులకు దగ్గరై వారికి విధేయులుగా మారి ఉద్యమం ను నీరుకార్చుతుండటం కూడా బోస్ కు నచ్చేది కాదు. 1938 లో గాంధీకి వ్యతిరేఖంగా జాతీయకాంగ్రీసు అధ్యక్ష ఎన్నికలలో నిలుచొని మన పట్టాభి గారిపై అఖండ విజయం సాధించాడు. పట్టాభి తరపున ప్రచారం చేసిన గాంధీజీ పట్టాభి ఓటమి తన ఓటమిగా అంగీకరించిగా, బోస్ తన పదవికి రాజనామా చేసి పార్వార్డ్ బ్లాక్ ను స్థాపించాడు.జాతీయప్రణాళికాకమిటీని ఏర్పరిచారు.

    అయితే 1939లో రెండవ ప్రపంచయుద్దం ప్రారంభమవగా,నాటి ఇండియన్ గౌవర్నర్ జనరల్ లిన్ లిత్ గో ఇక్కడ కాంగ్రీస్ నాయకులెవరినీ సంప్రదించకుండానే భారతీయులు ఇంగ్లండ్ తరుపున పోరాడుతున్నట్లు ప్రకటించాడు. గాందీ,నెహ్రూ, అంబేద్కర్ లాంటి నాయకులు ఆయనను సమర్థించగా,బోస్ తీవ్రంగా వ్యతిరేఖించాడు.దానికి ప్రతిచర్యగా బోస్ ను జైల్ లో పెట్టేరు. అక్కడ 7రోజులు నిరాహారదీక్షచేయగా ఆయన జైలు నుండి విడుదల చేసి గృహనిర్భంధంలో పెట్టింది.


   రెండవప్రపంచయుద్దంలో ఇంగ్లండ్ కు వ్యతిరేఖంగా పోరాడుతున్న జర్మనీ,జపాన్ లాగా మనమూ ఇంగ్లండ్ పై సాయుధ పోరాటం చేయాలని, సొంత సైనికశక్తిని,విదేశీ వ్యవహారాల శాఖ ను ఏర్పాటు చేసుకోవాలని వాదించేవాడు..ఇది ఇతర నాయకులకు నచ్చలేదు.

1941 జనవరి 19 తన మేనళ్ళుడు శశిరకుమాతో కలిసి ఒక పఠాన్ వేషంలో గృహనిర్భందం నుండి తప్పించుకొని పెషావర్ పారిపోయాడు.అక్కడ అక్భర్ షా,మహ్మద్ షా,భగత్ రాం తల్వార్ లతో పరిచయం అయింది.1941 జనవరి 26 న గడ్దం పెంచుకొని ,మూగచెవిడి వాడిగా నటిస్తూ మియా అక్భర్ ,ఆగాఖాన్ సహాయంతో కాబూల్ చేరాడు. అక్కడ నుండి ఇంగ్లండ్ కు శతృవైన రష్యా సహాయం కోరాలనే ఆలోచనలతో రష్యాలో అడుగుబెట్టేరు. అయితే రష్యా సహాయనిరాకరణ చేసింది.రష్యా సైన్యం అతనిని జర్మన్ రాయబారి షూలెన్ బర్గ్ కు అప్పగించింది.ఆయన అతనిని బెర్లిన్ పంపాడు. ఇది తెలుసుకున్న బ్రిటన్ బోస్ బెర్లిన్ చేరే లోపల ఆయనను హతమార్చమని ఒక రహస్య గూఢాచారిదళాన్ని ఏర్పాటు చేసింది. అయినా వారికి ఏమార్చి బెర్లిన్ చేరాడు.హిట్లర్ తో సమావేశమయిన తర్వాత అక్కడ వున్న భారత యుద్ధఖైదీలు,రబ్బరుతోటల కూలీలు 4500 మందితో ఇండియన్ లెజియన్ ఏర్పాటుచేశారు. ఈ సైనికదళం హిట్లర్ తో సమానంగా బోస్ ను గౌరవించేవాళ్ళు. 1941 నుండి 1943 దాకా అక్కడే వున్న బోస్ బ్రిటన్ గూఢాచారిదళాన్ని కన్నుకప్పుతూ జర్మన్ జలాంతర్గామి u 180 లో ప్రయాణించి దాని నుండి జపాన్ జలాంతర్గామి I 29 లోకి మారి 1943 సెప్టంబర్ లో సింగపూర్ కి చేరాడు.సింగపూర్ లో అజాద్ హింద్ ప్రభుత్వాన్ని నెలకొల్పేడు. దీనికి సొంత కరెన్సీ,తపాలాబిళ్ళలు,న్యాయ మరియు పౌరనియమాలు రూపొందించుకొనే అధికారం దక్కింది. ఈ ప్రభుత్వాన్ని జర్మనీ,ఇటలీ,క్రొయేషియా,థాయ్ లాండ్ ,గుర్తించాయి.ఇటీవల పరిశోధనల మూలంగా రష్యా ,USA లు కూడా అమోదించినట్లు తెలిసింది. అజాద్ హింద్ ఫౌజ్ సేనతో బోస్ ఎన్నో ఉత్తేజిత ప్రసంగాలు చేసేవాడు.""మీ రక్తాన్ని ధారపోయండి-మీకు స్వాతంత్రం ఇస్తాను" అని భావోద్రికంగా అనేవాడు..ఎందరో దేశభక్త యువకులు దానిలో సైనికులుగా చేరుటకు ఉవిళ్ళూరేవారు..నేతాజీ పర్యవేక్షణలో అఖండ విజయాలు సాధిస్తూ బర్మా వరకు వచ్చిన సేన ,బెంగాల్ లోనికి ప్రవేశించేందుకు సమాయత్తమయ్యే సమయంలో జపాన్ అమెరికా పెరల్ హార్బర్ మీద బాంబులు వేసింది. హిట్లర్ రష్యా మీద దాడికి దిగేడు..దీనితో అమెరికా,రష్యాలు యుద్దరంగంలో దిగడం జర్మనీ,జపాన్ ఓడిపోవడం , సుభాష్ చంద్ర బోస్ కు సహాయం ఆగిపోవడం జరిగింది. ఈ క్రమంలో సింగపూర్ నుండి తైవాన్ వెళ్ళేందుకు విమానం ఎక్కగా ఆ విమానం ప్రమాదం గురైందని ఆ ప్రమాదంలో ఆయన మరణించారని కథనం...ఒక వీరుని చరిత్ర మరుగునపడిపోయింది...

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

శివతత్వం - పాము, అగ్ని, భూతపిశాచాలు

శివశంకరన్ కంచి మఠానికి చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు. ”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అ