ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నిరీక్షణ


నీతి శాస్త్రాలు కోపాన్ని ప్రథమ శత్రువుగా చెప్పాయి

గీతాకారుడూ ఆ విషయాన్నే బోధించాడు. కామంతో క్రోధం జంట కలిసి ఉంటుంది
కామం తీరనప్పుడు కోపం విజృంభిస్తుంది. పర్యవసానంగా జరగరానివెన్నో జరిగిపోతాయి.

ప్రపంచ వ్యవహారాల్లో ఒక్కోసారి కొందరు మన సహనానికి పరీక్ష పెడతారు. మన సంస్కారాన్ని అనుసరించి ప్రతిస్పందన ఉంటుంది. అవతలి వారి స్థాయి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనకంటే పైస్థాయివారి ముందు ఉగ్గబట్టుకుని మరీ అసహనాన్ని అణిచిపెడతాం. సమానుల ముందు కాస్త బయటపడతాం. దిగువ స్థాయివారి పట్ల అరుదుగా సహనం చూపుతాం.

 ఇలా సహనాన్ని మూడు స్థాయుల్లో విభిన్నంగా వ్యక్తపరుస్తాం.

మనలో చాలామందికి నిరీక్షణ పెద్ద పరీక్షగా అనిపిస్తుంది. ఎక్కువ సహనం చూపాల్సిన సందర్భాల్లో నిరీక్షణ ఒకటి.

నిండు సభలో, పెద్దల సమక్షంలో ద్రౌపదిని దుర్యోధనుడు, అతడి సోదరుడు దుశ్శాసనుడు ఘోరంగా అవమానించినప్పుడు- పాండవులు మహాబలశాలురు అయినప్పటికీ... సహనం చూపారు.

సహనంతోనే అరణ్య, అజ్ఞాత వాసాలు చేశారు. ఫలితంగా దైవం వారికి తోడ్పడింది. మహాభారతాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, అనేక జీవన సత్యాలు మనకు గోచరిస్తాయి. అందుకే అది పంచమ వేదంగా గౌరవం పొందింది.

ధర్మరాజును సహనశీలత్వానికి నిలువెత్తు నిదర్శనంగా చెబుతారు. 

అలాగని సహనాన్ని చేతగానితనంగా తలపోయకూడదు.

 శ్రీకృష్ణరాయబారంలో అజాత శత్రువైన ధర్మరాజు శక్తిగురించి వివరిస్తూ ‘ఆయన అలిగితే సప్త సముద్రాలు ఏకమవుతాయి’ అని హెచ్చరిస్తాడు.

ఎప్పుడూ సహనం చూపేవారిలో ఆగ్రహం రగలకుండా వ్యవహరించాలి. లేకపోతే విపరిణామాలు తప్పవు.

మన చదువులన్నీ ‘అ, ఆ’లతోనే ఆరంభమవుతాయి. ఆధ్యాత్మిక సాధనలూ అంతే.

 ఒకేసారి శిఖరస్థాయికి చేరాలని ఆరాటపడటం తగదు. మెట్లెక్కుతూ ఎత్తుకువెళ్లగలం, రెక్కలు కట్టుకుని పక్షిలా ఎగిరిపోలేం. సహనంలోనే విజయం దాగి ఉంటుందనేది విలువైన జీవిత సత్యం.

ఎక్కువ సహనం కలిగినవారు సునాయాసంగా లక్ష్యాలను సాధించగలరు. ఏ మాత్రం సహనం లేనివాళ్లకు అడుగడుగునా ఆశాభంగాలు, అపజయాలు తప్పవు.

మొక్క పాతిన మర్నాడే చెట్టు అయిపోదు. కాయలు కాయదు. చదువు పూర్తికాగానే మెడలో పూలహారం వేసి ఎవరూ ఉద్యోగం ఇవ్వరు.

సమస్యలు లేని మనిషే ఉండడు. అవతార పురుషులు సైతం కష్టాలు అనుభవించారు. కానీ, ధైర్యంగా ఎదుర్కొని, లోకానికి మార్గదర్శకులయ్యారు.

ఆత్మవిశ్వాసంతో కృషిచేస్తే ఏదీ అసాధ్యం కాదు. కృషికి సహనం తోడైతే ఆ వ్యక్తికి ఎదురు లేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట