ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయమూర్తిగారు ఇదేం తీర్పు, ఇలా వుందేమిటి!

అపరాధ పరిశోధన అనే డిటెక్టివ్ పక్షపత్రికో మాసపత్రికో ఒకటుండేది. తెలివైనదొంగలు, దొరకని హంతకులు, క్లూలు, తప్పించుకోవడాలు, పట్టుకోవడం, కారాగారంలో రహస్యంగా సోరంగాలు త్రవ్వటం, అంతకంటే తెలివిగా పోలీసులకంటే  ముందుగా డిటెక్టివ్ లు రంగప్రవేశం చేయడం, మారువేషాలలో తిరగటం, క్యాడిలాక్, ఫ్యాంటియాక్ కార్లలో తిరగటం, బిక్షగాడిలా మారడం చివరకు నిందితులను పట్టుకోవడం ఇలా రకరకాల కథలుండేవి.చదువుతుంటే ఎంతో థ్రిల్లింగ్ గా ఆశక్తిగా వుండేది. అందులో నేను చదివిన,నాకు గుర్తున్న, నాకు నచ్చిన జడ్జిగారి అద్భుతమైన తీర్పుకథ ఒక్కటి. కథపేరు కాని, రచయిత పేరు కాని గుర్తులేవు. దాదాపుగా ఈ కథ కూడా 40 సంవత్సరాల క్రిందటిదే....రంగారావును  హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.పక్కింట్లో సుశీలను పట్టపగలు మధ్యాహ్నం 2 గంటలకు రంగారావే హత్యచేసినట్లు పోలీసులు బలమైన సాక్ష్యాలు తయారుచేసారు.రంగారావు వాడే చేతిరుమాల, కళ్ళజోడు, చెప్పులు మొదలైన కీలక ఆధారాలను నేరస్థలంలో సేకరించారు. వీటితోపాటు సుశీల హత్యకు వాడినకత్తి, సుశీలరక్తం మరకలంటుకొని వున్న రంగారావు బట్టలను పోలీసులు రంగారావు ఇంట్లోనే స్వాధీనపరచుకొన్నారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగారావే హంతకుడని బల్లగుద్ది మరీ వాదించాడు. పోలీసులు కూడా రంగారావే హంతకుడని వాజ్ఞ్మూలం ఇచ్చేశారు.ఎవిడెన్స్ లను, సర్క్మ్టేన్షనల్ ఏవిడన్స్ , సాక్షుల వాజ్ఞ్మూలాలు మొదలైనవన్ని రంగారావుకు వ్యతిరేకంగా వుండటంతో డిఫెన్స్ లాయర్ శాస్త్రి కళ్ళు తేలేశాడు.

 నేను నిర్ధోషినని రంగారావు ఎంత మొత్తుకొన్న అది అరణ్యరోదనే అయింది. రంగారావుకు శిక్ష తప్పదని భార్య, కుటుంబసభ్యులు గొల్లుమన్నారు.

,తీర్పు రోజున బెంచిమీద జడ్జి చక్రపాణి గంభీరంగా ఎదో వ్రాసుకొంటున్నాడు. కోర్టుహాలంతా ఎలాంటి శిక్షపడుతోందోననే ఉత్కంఠతో వుంది. నాకిక ఉరిశిక్ష తప్పదని రంగారావు పళ్ళబిగువున ఏడుస్తున్నాడు.

జిడ్జి ఒక్కసారి గొంతు సవరించుకొని తీక్షణంగా రంగారావువైపు తిరిగి, తీర్పు చదివుతూ ఈ కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన ఆధారాలు, సాక్ష్యులిచ్చిన వాజ్ఞ్మూలాలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు అన్ని రంగారావును దోషిగానే నిరూపిస్తున్నాయంటూ ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని కోర్టుహలంతా ఒక్కసారిగా పరిశీలించాడు. అందరి కళ్ళలో ఒకటే ఉత్కంఠ, కుటుంబసభ్యులలో భయం ఎలాంటి తీర్పు వినాల్సివుంటుందోనని...

జడ్జి చిన్నగా ఓసారి నవ్వి పోలీసులు ఎన్ని బలమైన సాక్ష్యాధారాలు చూపినా, సాక్షుల సాక్ష్యాలు ఎంత బలంగా వున్నా PP గారి వాదనా పటిమ ఎంత బాగున్నా ఈ హత్య రంగారావు చేయలేదని నేను విశ్వసిస్తున్నా,
కారణమేమిటంటే.... 

ఈ కథ పూర్వాపరాలు నాలాగా చదివిన వారెవరైనా ముగింపు నివ్వవచ్చు, లేదా మీరైనా ఊహించి ముగింపు పలకొచ్చు.
నాచే ఈ కథకు ముగింపు మాత్రం రేపే, అంతవరకు ఉత్కంఠతో ఆగాల్సిందే.


Credits: జి.బి.విశ్వనాథ.9

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట