ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రేపటి తరం మనుషులు - మనుషులుగా ఉండరేమో

బాల్యం ఒక వారం 

నేను చుట్టూ గోడకట్టిన కాలనీలో (గేటెడ్ కమ్యూనిటీ) నివాసం ఉంటున్నాను. చేరి నెల రోజులయ్యింది. బయటకు పోవడానికీ, లోపలికి రావడానికి ఒక్కటే గేటు ఉంది. గేటు మూస్తూ తెరుస్తూ గేటు దగ్గర ఒక కాపలాదారుడు ఉన్నాడు. ఆ గేటు పక్కన ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుకొమ్మ ఒకటి ఇంటి ప్రహరీ గోడ దాటి కాలనీ రోడ్డు మీదికి వచ్చింది. ఆ కొమ్మకు రెండు మామిడి పిందెలు పుట్టాయి. ఆ కొమ్మకింద ఒక ఎర్రటి రబ్బరుబంతి ఉంది.

నేను రోజూ ఆ దారిన పోతూ ఆ బంతిని, మామిడి పిందెలను గమనిస్తూ ఉండేవాడిని. పది రోజులు గడిచాయి. ఆ మామాడి పిందెలు పెద్దవవుతూ ఉన్నాయి. ఆ బంతి కదలకుండా అక్కడే వుంది. రెండు నెలలు గడిచాయి. కాయలు బాగా బరువెక్కి కొమ్మ వంగింది. ఆ బంతి అటూ ఇటూ కదలకుండా అక్కడే ఉంది. నాకు ఆ దృశ్యాన్ని చూసి నప్పుడల్లా అసహజంగానూ, అసహనంగానూ ఉండేది. మరోవైపు ఆశ్చర్యమూ కల్గింది.

ఈ కాలనీలో ఇంత నిజాయితీగా మనుషులున్నారా? బంతిని ఆ కాయల్ని ముట్టుకోనీయకుండా పిల్లల్ని నిజాయితీపరులుగా పెంచుతున్నారా? అసలు ఆ కాలనీలో ఒకరూ,  ఇద్దరూ తప్ప పిల్లలు ఎప్పుడూ సందడిచేస్తూ కనిపించడం లేదు ఎందుకని?

 ఆ ఇంటికి రెండిళ్ల ఇవతల ఒక ఇంటిముందు అరుగు ఉంది. ఆ అరుగు మీద ఎప్పుడూ తెల్లటి బట్టలు ధరించిన ఒక వృద్దుడు కూర్చుని ఉంటాడు. ఎల్లప్పుడూ అతను చేతిలో ఒక పుస్తకం వుంటుంది. ఒక రోజు ఆ వృద్దుడిని పలకరించాను. “ఏమండీ ఈ కాలనీలో దొంగతనాలు జరగవనుకొంటాను” అని అన్నాను.

“అలా.అని. ఎందుకనుకొంటున్నారు?” ఎదురు ప్రశ్నించాడు.

“అదిగో ఆ బంతిని రెండు నెలలుగా ఏ పిల్లవాడు తీయలేదు. ఆ మామిడికాయలను ఎవరూ తుంచలేదు."

“దానికి మీరు సంతోషిస్తున్నారా? ”

“సంతోషించడం లేదు. కాని విచిత్రంగా ఉంది. పిల్లలు కూడా ఒకరూ  ఇద్దరూ తప్ప ఎవరూ కనిపించడంలేదు”.

“మీరు సంతోషించినట్లు చెప్పి ఉంటే నేను బాధపడి ఉండే వాడిని. మీరు వాటిని గమనిస్తూ. ఉండడం, వాటిగురించి ఆలోచిస్తూ ఉండడం మంచి విషయం. అవి రెండూ ఇంతకాలం అక్కడ ఉండడం చాలా విచారించదగ్గ విషయం. పిల్లలు బాల్యాన్ని కోల్పోయారు. ఇది కాలనీ వాసుల నీతి నిజాయితీలకు సంబంధించిన విషయం గాదు. ఇక్కడున్నవాళ్లు ఎక్కువమంది వ్యాపారస్థులు, ప్రభుత్వ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు వీళ్లంతా పిల్లలకు ఏ నీతులు చెబుతారు. వీరి జీవితాలు చూస్తూ పిల్లలు వీరినుండి ఏమి నేర్చుకుంటారు.

పిల్లలు ఉదయం లేస్తూనే ట్యూషన్లకెళ్తారు. ట్యూషన్ల తర్వాత బడికి వెళ్తారు. బడినుండి రాగానే మళ్లీ ట్యూషన్, సెలవు రోజుల్లో జిమ్ములు, స్విమ్మింగ్లు, డ్యాన్సు క్లాసులు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే టీవీ, సెల్ ఫోన్లు ఉన్నాయి గదా! వారికంటూ స్వంత ఆలోచనలు ఇష్టాయిష్టాలు ఎక్కడున్నాయి? మీకు తెలుసా ఒకప్పుడు పిల్లలు నడవడానికి ముందు మోకాళ్లతో దోగాడేవాళ్ల, మోకాళ్లదగ్గర చర్మం నల్లగా గట్టిపడి ఉండేది. ఇప్పుడు దోగాడనీయడం లేదు. నేరుగా నడిపించడమే. కిందపడనీయడం లేదు. పడి లేచి నడవడంలో వున్న అనుభూతిని పొందనీయడం లేదు. అసలు పిల్లల్ని పదేళ్ల వరకు వాళ్లు తినే ఆహారాన్ని కూడా వాళ్ల చేతుల్తో తిననీయడం లేదు. వాళ్లకంటూ స్వంత ఆటలు స్వంత అభిప్రాయాలు ఏమీ లేవు.

ఊరినుంచి నేనొచ్చి మూడు నెలలయింది. మనవళ్లతో మనవ రాళ్లతో ఆడుకోవాలని ఉండదా? కొడుక్కి ఒక కూతురూ ఒక కొడుకు. ఐదేళ్లలోపు పిల్లలు. కార్లో ఎక్కడం కాన్వెంట్లకు వెళ్లడం - సాయంకాలం కార్లో నుండి దిగడం బాత్ రూంకో బెడ్ రూంకో వెళ్లడం. ఏదైనా తీరికవుంటే టీవీ ముందు కూర్చోవడం - నాతో మాట్లాడానికి టైం ఎక్కడుంది. ఇక నాకు పుస్తకాలే స్నేహితు లయ్యారు. 


ఇలా ఎందుకు జరుగుతున్నదో ఇప్పుడిప్పుడే నాకు అర్ధమవుతూ ఉంది. నీ రబ్బరు బంతిని మామిడికాయల్ని వాళ్లు చూసికూడా ఉండరు. బయట ప్రపంచ మీద పిల్లలకున్న ఆసక్తిని ఇష్టాన్ని చంపేసారు. “ఆ బిడ్డల్ని చూస్తే నాకు ఏడుపు వస్తున్నది” అంటూ - కన్నీళ్లు పెట్టుకొన్నాడు.

“ఇంతకూ మీరేమి చేస్తుంటారు” అడిగాను.

 “నేనొక పెద్ద రైతుని. డిగ్రీవరకు చదువుకొని వ్యవసాయంలోకి దిగాను. బాగా డబ్బు సంపాదించాను. నా కొడుకుని బాగా చదివించాలని కాన్వెంట్లో ఇంగ్లీషు మీడియంలో చదివించాను. 

నను అజ్ఞానంతో చేసిన పని, వాడికి అలవాటుగా మారిపోయింది, ఒకతరం వారి అజ్ఞానం ఆశబోతు తనం ఎన్ని తరాల్ని నాశనం చేస్తుందో? 

ఏమైతేనేమి పిల్లల బాల్యాన్ని దొంగలించాం” బాధగా అన్నాడు. నాకు ఆయన మాటల్లో ఈనాటి పిల్లల గురించి మరింత స్పష్టత నిచ్చింది. 

రేపటి తరం మనుషులు-మనుషులుగా ఉండరేమోనని భయం వేసింది.


Credits: Telegram User

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి