ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఒకరిస్తే తీసుకునేది జ్ఞానం కాదు - మరి

బుద్ధుడు ఒకసారి అరణ్య మార్గం గుండా వెళుతున్నాడు. మధ్యలో విశ్రాంతి కోసం ఒక దగ్గర ఆగాడు. నీళ్ళు తాగి విశ్రమించి ప్రశాంతమయిన ప్రకృతిని పరిశీలిస్తున్నాడు. అంతలో అరణ్యమంతా కదిలినట్లు పెద్ద సంచలనం. జంతువులన్నీ పరేగిడుతున్నాయి. అంతా గందరగోళంగా ఉంది. 

ఎందుకు ఇంత మార్పుకు పరిగెడుతున్నాయో బుద్ధునికి అంతు పట్టలేదు అంతవరకూ నిశ్శబ్దంగా ఉన్న అరణ్యం అంతలో అలజడి ఎందుకు లోనయిందో? ఎందుకు ఏమి చూసి జంతువులు భయపడు తున్నాయో  ఏమి? ఏమైంది? ఎందుకు ప్రశ్న మొదలైనది .

బుద్దుడు దయ మూర్తీభవించినవాడు కదా! ఆయన్ని చూసి జంతువులు ఆయన తన ముందుగా పరిగెడుతున్న ఒక జింకను ఆపి 'ఏమి? ఏమైంది? పరిగెడుతున్నావు? కొంపలంటుకున్నట్లు ఎందుకు హడావిడి? 

అరణ్యమేమీ ... తగలబడిపోతుందా?' అని అడిగాడు.

ఆజింక "స్వామీ! నన్ను వెళ్ళనీ. వివరంగా చెప్పడానికి నాకు సమయం లేదు ఎదో ప్రళయం రాబోతుంది. ఇది ప్రపంచానికి చివరిరోజు. సమస్త సృష్టి సర్వనాశనం కాబోతుంది' అంది. 

బుద్ధుడు "సరే వెళ్ళు. కానీ ఈ సంగతి నీకెవరు చెప్పారు? - అన్నాడు. జింక "నా ముందు పరిగెడుతున్న జంతువులు చెప్పాయి" అంది. 

బుద్దుడు లేచి ముందుకు పరిగెట్టి చూశాడు. పులులు పరిగెడుతున్నాయి, సింహాలు పరిగెడుతున్నాయి. ఏనుగులు పరిగెడుతున్నాయి. వేటిని అడిగినా ప్రళయం రాబోతోందన్నాయి. ఎవరు చెప్పారంటే ఇంకో జంతు సమూహాన్ని చూపించాయి.

చవరగా ఒక కుందేలు గుంపు కనిపించింది. వాటికి ముందు ఆ గుంపునకు చెందిన నాయకుడు పరిగెడుతున్నాడు. బుద్ధుడు అతికష్టంమీద దాన్ని అపి "విషయమేమిటి?" అని అడిగాడు. ఆ కుందేలు "ప్రళయం రాబోతుంది. *రాబోతుందన్న సూచన నాకు తెలిసింది. అందరికీ చెప్పాను. అందరితో పాటు పరిగెడుతున్నా" అంది.*

బుద్దుడు "ఆ సూచన ఏమిటి? నీకెట్లా తెలిసింది?" అని అడిగాడు. ఆ కుందేలు స్వామి! ఈరోజు నేను మధ్యాహ్నం పూట ఒక చెట్టుకింద పడుకుని ఉంటే పెద్ద శబ్దం వచ్చింది. అప్పటిదాకా చల్లని గాలిలో నిద్రకు జోగుతున్నాను. ఆ శబ్దంతో నాకు మెలకువ వచ్చింది. 

చిన్నప్పుడు మా అమ్మ ఒక విషయం చెప్పింది నా మనసులో నాటుకుపోయింది. ఎప్పుడయితే పెద్ద శబ్దం వినిపిస్తుంది ప్రపంచానికి ప్రళయమొస్తుందని చెప్పింది. అచ్చం మా అమ్మ చెప్పినట్లే ఆ శబ్దం ఉంది. ప్రళయమొచ్చేసిందని పరిగెడుతున్నాను" అంది.

బుద్దుడు ఆ కుందేలును వెంటబెట్టుకుని అది పడుకున్న చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. చెట్లోనించీ ఒక పండు ఎండుటాకుల్లో పడి  ఉండడం చూశాడు. పండును పైకెత్తి మళ్ళీ ఆకుల్లో వదిలాడు దబి మని శబ్దం వచ్చింది. కుందేలు "అవును. ఇట్లాంటి శబ్దం వచ్చింది ..

బుద్ధుడు "ఇదే పండు ఎండుటాకుల్లో పడి శబ్దం  వచ్చింది" అన్నాడు 

పండు పడి శబ్దం చేసింది నువ్వు చూసి ఉంటే భయపడేదానివి కాదు. పెద్ద శబ్దం విని  ప్రళయమనుకున్నావు" అన్నాడు. 

మటల్ని మనవాళ్ళయిన విశ్వసించకూడదు. ఇతరుల మాటల్ని నమ్మి మనుషులు పరిగెడుతుంటారు.

మనకు సంబంధం లేనివి మనల్ని ప్రభావితం చేస్తాయి. మనిషికి సంబంధం లేనివి ఆందోళనకు గురిచేస్తాయి. ఎవరో ఏదో అంటారు. మనం బాధపడతాం. ఎవరో ఏదో అంటారు. 

మనం సంతోషిస్తాం. నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ అర్థం లేనివి. మనదంటూ ఏమీ లేదా? ఇతరుల్తో సంబంధంలేని, మనకు మాత్రమే సంబంధించినది మనలో లేదా? చిన్నప్పటినుంచీ మనుషుల్ని 'తయారు' చేస్తారు.

తయారుచేసిన మనుషులు యంత్రాలు, ఎదుటివాళ్ళు ఎట్లా మలిస్తే అట్లా మారుతారు. మనుషుల్ని సహజంగా పెరగనివ్వాలి. స్వతంత్రంగా పెరగనివ్వాలి. 

కనీ ధర్మాలు, నీతులు, మతాలు అన్నీ బోధించి మనుషుల్ని మరమనుషులుగా తయారుచేస్తారు. జ్ఞానమన్నది సహజం జ్ఞానమన్నది దానంతట అదే ఎదుగుతుంది. ఒకరిస్తే తీసుకునేది జ్ఞానం కాదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట