ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నిజానికి అమ్మ అందంగా లేదని ..


ఇప్పుడు కావాల్సింది కొన్ని అక్షరాలు కాదు 

పిడికెడు ప్రేమను పంచే కొన్ని మాటలు...!!


అవును నిండు పున్నమి వెన్నెల ఎంతో అందంగా కనపడొచ్చు

అంతకంటే అందమైనది అమ్మ మనసు ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నమైనా చేసావా?


నిజానికి అమ్మ అందంగా లేదని 

మా అమ్మ అని చెప్పుకోలేని 

కుమారులు,కుమార్తెలు కూడా నివసించే సమాజం ఇదని మర్చిపోవద్దు


అమ్మ విషయంలో ఆత్మానుసారంగా ప్రేమించాలి

అందాన్ని ప్రాతిపదికగా తీసుకొని కాదు...!!


కన్న పిల్లలు అందంగా లేకపోయినా 

అవిటివాళ్ళయినా ఒకే రకంగా ప్రేమను పంచుతుంది అమ్మ

ఎందుకంటే అమ్మ ప్రేమలో కొలమానాలు ఉండవు

ప్రేమనే పదానికి సరైన నిర్వచనమే అమ్మ...!!


చెప్పడంలో గొప్పతనం చూపించకండి

చేతల్లో గొప్పతనం ప్రదర్శించండి


కూటికి దూరమై

కాటికి దగ్గరవుతున్న

కన్న తల్లులను కసాయి వాళ్ళలా

వృద్ధాశ్రమాలకు అమ్మే పిల్లలెందరో...


అమ్మ మనకు భారమవుతుందా

అమ్మ మనలను ఏం అడుగుతుంది...?

అమ్మ నోరు తెరిచి ఏమీ అడగదు

నువ్వు తనకోసం చిన్న పని చేసినా

అంతకు వెయ్యి రెట్లు ఆనందపడుతుంది అమ్మ...!!


అప్పుడప్పుడూ నీ సంపాదనలోనుండి 

అమ్మకు తను ఆనందపడే కానుకలు కొని ఇవ్వండి

తనకు ఇష్టమైన భోజనంతో కడుపు నింపండి


పాలకోసం మనం ఏడిస్తే తల్లడిల్లిన తల్లిని 

ఇప్పుడు ఆకలి కోసం తల్లడిల్లే పరిస్థితి తీసుకురాకండి...!!


పరితపిస్తూనే ఉంటుంది ఆ పేద హృదయం 

కన్నీళ్ళను తుడిచే పిల్లల హస్తాల కోసం 

మనసు బాధను పంచుకునే సమయం కోసం...


పిచ్చి తల్లి తన గోడు చెప్పుకోవడానికి 

కన్న బిడ్డలు దగ్గర లేకపోవడంతో 

తనలో తానే

తనతో తానే

ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటుంది...!!


మన కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన తల్లి కోసం 

మనం త్యాగం చేయడానికి కొన్ని క్షణాలు ఉండవు

ఎంత దౌర్భాగ్యమో కదా...?


సమయం లేక కొందరు 

సమయం ఉన్నా పట్టించుకోక కొందరు


ఒక్కరోజు అమ్మకి కేటాయించి మాతృదినోత్సవమని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము

అసలు అమ్మ లేకుండా ఈ జీవితం మనకుందా?

అమ్మే లేకపోతే నువ్వు నేను ఈ ధరణిలో శ్వాసించే వాళ్ళమా?


ఈ ఒక్కరోజు ఎందుకంటే కనీసం ఈ ఒక్కరోజైనా అమ్మ ప్రేమను 

అమ్మ విలువను

అమ్మ గొప్పతనాలను

అమ్మ త్యాగాలను మర్చిపోయిన వారందరూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని...


ప్రేమకు ప్రతీక అమ్మంటే

అందుకే అమ్మకు అందరికంటే ఉన్నతమైన స్థానాన్ని కేటాయించింది


"కన్నతల్లి కడుపు నింప చేతగాని వాళ్ళు 

దేవుని హుండీలు నింపే వెర్రివాళ్ళు"


సమస్త దేవతలు అమ్మలోనే ఉన్నప్పుడు 

ఎక్కడెక్కడికో పూజించడం ఎందుకు...?

ఇంట్లో ఉన్న ఆ దేవతను ముందు పూజించు


గుడి చుట్టూ పొర్లు దండాలు పెడుతూ 

ఎన్నో కోరికలు కోరుకుంటారు...

ఎన్నెన్నో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు 


ఎప్పుడైనా ఒక్కసారి

అమ్మ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారా?


ఎవరికివారు ప్రశ్నించుకోండి అంతే...!!


అమ్మ ప్రేమ ఎప్పుడూ ఒక ఎండ్ లెస్ స్టోరీ

ఆది మాత్రమే ఉంటుంది అంతం ఉండదు 

అమ్మ ప్రేమ ఒక జీవనదిలాంటిది 

అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది...


కాలాలు మారుతాయి

అమ్మ ప్రేమ గురించి ఎంతో అందంగా వర్ణించే

కవులు / కవయిత్రులు మారుతూ ఉంటారు 

అమ్మ ప్రేమ మాత్రం శాశ్వతంగా వికసిస్తూనే ఉంటుంది

చరిత్రలో...వర్తమానంలో...భవిష్యత్తులో

చిరస్థాయిగా వెలుగుతూనే ఉంటుంది అమ్మ ప్రేమ...!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి