ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఫకీర్ ... మహారాజు ...


 ఒక ఫకీర్ చాలా కాలం పాటు ఒక  మహారాజు ఆస్థానంలో ఉండిపోయాడు.  

మహారాజు ఆ ఫకీర్ పట్ల ఎంతో  ప్రేమాభిమానాలు చూపేవాడు. ఎంతలా అంటే మహారాజు తనతో సమానంగా   ఫకీరుకి త న గదిలోనే అతనికి వసతి ఏర్పాటు చేసాడు.                            ఫకీర్ హస్తం లేకుండా మహారాజు ఏ కార్యం తలపెట్టేవాడు కాదు. ఎంత చిన్న విషయమైనా ఇద్దరూ కలిసే చేసేవారు. 

 ఒకరోజు ఇద్దరూ వేటకు వెళ్ళారు.  వేటలో ఇద్దరూ దారి తప్పిపోయారు. తీవ్రమైన ఆకలి దప్పికలతో ఒక చెట్టు నీడకు చేరుకున్నారు. ఆ చెట్టు మీద  ఒకే ఒక పండు ఉన్నది. మహారాజు  వెంటనే గుర్రంపైకెక్కి ఆ పండును   తెంపి, ఆరు ముక్కలుగా కోసి అలవాటు ప్రకారం మొదటిముక్కని ఫకీరుకి అందించాడు.                         ఫకీరు  ఆ ముక్క తిన్నవెంటనే -" ఆహా! ఎంత మధురంగా  ఉంది. నా   జీవితంలో ఇంత రుచికరమైన పండుని తినలేదు,ఇంకో  ముక్క కావాలని "అడిగాడు.

ఆ విధంగా ఐదు  తిన్నాడు.

ఎప్పుడైతే మిగిలిన చివరి ముక్కను కూడా అడిగాడో, వెంటనే మహారాజు ఇలా అన్నాడు." నీ వాటాకు మించి ఇచ్చాను, నేను కూడా ఆకలితోనే ఉన్నాను కదా! నాకు నీ మీద ప్రేమ ఉంది కానీ నీకు నా మీదఏ మాత్రం ప్రేమ లేదు." అని ఆ చివరి ముక్కను తనే తీసుకుని నోటిలో పెట్టుకున్న వెంటనే ఊసినాడు.

ఆ వెంటనే -" నీవు పిచ్చోడివి, ఇంత పుల్లగా ఉన్నముక్కలెలా తిన్నావ్?"

అని అడిగాడు.

అప్పుడు ఫకీరు-" ఏ చేతులతోనైతే ఎన్నెన్ని మధుర ఫలాలు తినెందుకు లభించాయో,అలాంటి చేతి నుంచి వచ్చిన ఒక పుల్లటి ఫలం గురించి ఫిర్యాదు ఎలా చేయగలను? అందుకే నీకు రుచి తెలియకూడదనే అన్ని ముక్కలను తీసుకుంటూనే ఉన్నాను !"

స్నేహితులారా... ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సందేహానికి తావుండదు.

రండి... మనం ఇలాంటి బంధాలనే  నిర్మించుకుందాం! కొంత మా నుండి నేర్చుకోండి, కొంత మాకు నేర్పండి!

"అదృష్టం"కు ఉన్న సహజ అలవాటు "తప్పనిసరిగా పడిపోవడం(పడగొట్టడం)." పడిపోయినప్పుడు అన్నింటినీ పోగొడుతుంది. 

అందుకే నీ స్థాయి గొప్పగా ఉన్నప్పుడు అహంకారంతో ఉండకు! 

కాలం కలసి రానప్పుడు స్థిమితంగా ఉండు!!


Pic Credits: https://jojokids.in/

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట