ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సృష్టి మంచిదా, చెడ్డదా?. - రమణ మహర్షి

 

రమణ మహర్షి! గురుబోధ లేకుండానే, ఆధ్యాత్మిక సత్యాలను దర్శించిన అన్వేషి. ‘నేను’ అన్న మాట మీద దృష్టిని పెట్టండి చాలు, మాయ తెరలు తొలగిపోతాయని సూచించిన జ్ఞాని. 

తన 16వ ఏట ఆయనకు మరణానుభవం కలిగిన దగ్గర్నుంచీ, రమణుడు సాగించిన ఆధ్యాత్మిక యాత్ర అసాధారణమైనది. వంటలు చేస్తూ భౌతిక ధర్మాలను ఆచరించినా, తల్లికి సైతం గురువుగా నిలిచి సన్యాసానికి కొత్త నిర్వచనాన్ని అందించినా... రమణ పథం చాలా భిన్నమైనది. 

1896 మొదలు, ఐదు దశాబ్దాలకు పైగా రమణులు తిరువణ్ణామలై నగరాన్ని తన కార్యక్షేత్రంగా మలచుకున్నారు. ఆ రమణుని చెంత సేదతీరి తమ ఐహిక దుఃఖాలను, ఆధ్మాత్మిక తృష్ణను తీర్చుకునేందుకు వందలాది జనం నిత్యం అరుణాచలానికి బారులు తీరేవారు. భక్తులు అడిగే ప్రతి ప్రశ్నకూ రమణులు తనదైన శైలిలో జవాబుని అందించేవారు. వాటిలో చాలావరకూ జవాబులు, నిన్ను నువ్వు ముందుగా తెలుసుకో అన్న సూచనతో ముగిసేవి. 

మరికొన్ని సందర్భాలలో రమణులు తనంతట తానుగా ఏదో ఒక విషయం గురించి అభిప్రాయాన్ని వెల్లడించేవారు. ఉదాహరణకు ‘ఈ ప్రపంచము సుఖం కోసం సృష్టించబడిందా? దుఃఖం కోసం సృష్టించబడిందా?’ అని ఓ పుస్తకంలో ఉన్నా ప్రశ్న గురించి రమణులు ఏం చెప్పారో చూడండి...
‘సృష్టి మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. అది ఉన్నట్లే ఉన్నది. మానవుని మనస్సు దానిని తన కోణం నుంచి చూస్తూ తనకు అనుకూలమైనట్లు వ్యాఖ్యానిస్తుంది....

 ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటికీ ఈ సంబంధాలే కారణం. సృష్టి ఒక రావిచెట్టు వంటిది. పక్షులు దాని పండ్లు తినడానికి వస్తూ ఉటాయి. మనుష్యుల దాని నీడలో చల్లదనం కోసం వస్తారు. కొంతమంది ఆ చెట్టకు ఉరిపోసుకుని చచ్చిపోతారు. కానీ ఆ చెట్టు వీటన్నింటితో ఏమీ సంబంధం లేకుండా, ఇవేమీ గుర్తంచకుండా తన పాటికి తాను జీవిస్తూ ఉంటుంది. మానవుడి మనస్సే కష్టాలను సృష్టించుకుని సహాయం కోసం అలమటిస్తూ ఉంటుంది. 

ఒక మనిషికి కష్టాలిచ్చి మరొకడికి సుఖాలీయటానికి భగంతుడికంత పక్షపాతం ఉంటుందా? సృష్టిలో అన్నిటికీ చోటు ఉంటుంది. కానీ ఒక క్షుథార్తుడు ప్రక్కనే రుచికరమైన తిండి ఉండగా దానివైపు చేయిజాపి ఆకలి తీర్చుకోకుండా ఉన్నట్లు, మానవుడు సృష్టిలో ఉండే మంచివాటినీ, ఆరోగ్యకరమైన వాటినీ, సుందరమైనవాటినీ వదలిపెట్టి ఊరకే దుఃఖిస్తూ ఉంటాడు. ఇది ఎవరి తప్పు, భగవంతునిదా, మానవునిదా? కాని మనుష్యుల అదృష్టం కొద్దీ, భగవంతుడు అనంతదయాసాగరుడై మానవుని ఎన్నడూ వదిలిపెట్టడు. ఎల్లప్పుడూ గురువులనూ, శాస్త్రాలనూ ఇచ్చి, కొత్త అవకాశాలను ఇచ్చి, మార్గం చూపించి తన తప్పులను తెలుసుకొనచేసి తుదకు శాశ్వతానందాన్ని ప్రసాదిస్తాడు. 

(గురుచరణ సన్నిధిలో అన్న పుస్తకం నుంచి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట