ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చీమలు నేర్పే పాఠం


 చీమలు నేర్పే  పాఠం

చీమలేగా అని చిన్న చూపు  వద్దు  

నేర్చుకోవాలేగాని పెద్ద పాఠమే నేర్చుకోవచ్చు  


ఎంత ఉత్సాహం వాటి ప్రయాణంలో  

చురుకుగా నడుస్తూ  ఎంత దూరమైన అలసిపోకుండా  

కాస్త దూరమైన కష్టంగా నడుస్తున్న  మనం నేర్చుకోవాలి  నడక  ఎంత హాయి  అని 


ఎంతటి ముందుచూపు  వాటి సేకరణలో  

రేపటికై ముందుగానే  ఆహరం  సేకరిస్తాయి  

మనమేమో ముఖ్యమైన ధాన్యాన్ని మరిచి 

ధనాన్ని దాచేస్తున్నాం  


ఎవరో కొట్టి నేర్పించినట్టుగా  పద్దతిగా  పయనం  

నువ్వు నేను అని తోసుకోకుండా వరుసక్రమంలో 

ఎంతో క్రమశిక్షణతో  నడవడం 

చదువుకున్న మనం జ్ఞానం  ఉన్న మనం 

ఎక్కడా పాటించని క్రమశిక్షణ  

చివరకు ఆలయాలలోను  పలుకుబడితో  

పరుగులు తీస్తాం  


మట్టిలో కలిసిన తీపిని  

మట్టిని వదిలి తీపిని మాత్రమే  సేకరించేస్తుంటే  

చెడు ఏదో మంచి ఏదో గుర్తించని మనం 

చెడువైపు ఒక్కసారి  మంచివైపు  ఒక్కసారి వెళ్ళి

అనుభవం అని నామకరణం  చేస్తున్నాం  చెడు అయితే 

అదృష్టం అని చెప్పేస్తున్నాం  మంచి జరిగితే  

ఆలోచనను పూర్తిగా మానేసి  


ఇంతలో ఏదైనా అడ్డు  తగిలితే  ఆ వాటి దారిలో

కొన్ని దారితప్పి  వెనక్కు 

కొన్ని పక్కకు  జరిగి  వెళ్తాయి  

కొన్ని  అడ్డుపై ఎక్కి  వెళ్తాయి 

కొన్ని ఆ అడ్డును  కొరికి  వెళ్తాయి 

ఇందులోనూ నేర్చుకుని  మనిషి జీవితం ముడిపడిన  విషయం 


సమస్యకు బయపడి పారిపోయేవాళ్లు  కొంతమంది  

సమస్యను పక్కన పెట్టి  వెళ్ళేవాళ్ళు  కొంతమంది 

సమస్యను పరిష్కరించి  వెళ్ళేవాళ్ళు కొంతమంది 

సమస్యపై ధైర్యంగా పోరాడి  వెళ్ళేవాళ్ళు కొంతమంది 


ఇలా ఎన్నో పాఠాలు నేర్పే చీమలు ఓ గురువులే..


Credit: Telegram user Sudhakar

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

శివతత్వం - పాము, అగ్ని, భూతపిశాచాలు

శివశంకరన్ కంచి మఠానికి చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు. ”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అ