ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎంతవస్తే అంతే పెట్టండిచాలు.... ఉత్తి అన్నమైనా ఫరవాలేదు .. నిన్నటి నుండి ఏమీ తినలేదు...


హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు.....

భోజనానికి ఎంత తీసుకుంటారు......

యజమాని చెప్పాడు...

చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, 

అవి లేకుండా అయితే 20 రూపాయలు....

ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి, ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు....

నా చేతిలో ఈవే ఉన్నాయి..

వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు....ఉత్తి అన్నమైనా ఫరవాలేదు...

కాస్త ఆకలి తీరితే చాలు.

నిన్నటి నుండి ఏమీ తినలేదు...

ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది....

హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.

నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను.... ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్నవ్యక్తి అడిగాడు....

మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...?,

ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు...

నా గత జీవితం గుర్తుకువచ్చి కన్నీళ్ళు వచ్చాయి.... నాకు ముగ్గురు పిల్లలు  ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి.....

ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి.... నేను కూడపెట్టిన ప్రతీ పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చుపెట్టాను. దానికోసం నేను నాయవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను... పిల్లలకోసం

అన్నింటికి నా వెన్నుముకై నిలచిన నా భార్య నన్ను ఒంటరివాడినిచేసి ముందే వెళ్లి పోయింది....ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటినుండి నా కొడుకులు, కొడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు.వాళ్లకు నేను భారమవ్వడం మొదలైనాను.

ఎంత ఒదిగి ఉంటున్నా , నన్ను వాళ్ళు అంత దూరంపెట్టనారంభించారు....

నేను వృద్దుణ్ణి కదా....? కనీసం 

నా వయస్సు కైనా గౌరవమివ్వచ్చుకదా....? అదీ ..లేదు...

వాళ్లందరు భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్లే వాడిని, అయినా అప్పుడు కూడా తిట్లూ, చీత్కారాలు తప్పేవి కావు, భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది, మనవలుకూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో...

ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పొయి బ్రతకవచ్చుకదా, అని...

పగలనక, రాత్రనక, చెమటోడ్చి కష్టపడి, కంటినిండా నిద్ర పోకుండా, కడుపునిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒకొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు...., ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు...

కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించాననే నెపం తో దొంగ అనే ముద్ర వేశారు... కొడుకు కోప్పడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు, అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అదికూడా జరగవచ్చు. తండ్రి పై చేయి చేసుకున్న  కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని, బయటకు వచ్చాను.నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి....?

ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు..

తనవద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు....

యజమాని  వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు....

ఎప్పుడైనా మీరు ఇక్కడకు రావచ్చు...

మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది..

ఐతే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడపెట్టి చెప్పాడు....

చాలా సంతోషం, మీ ఉపకారానికి....


ఏమి అనుకోకండి... ఆత్మాభిమానం, నన్ను విడవటంలేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యంతెలియని బాటసారిలా... వెళ్ళిపోయాడు.


ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు.


అందుకే అంటారు ప్రతీ పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండు టాకు అవుతుందని .......


పండుటాకులాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒకరోజు వస్తుందని ఎవరు చింతించడం లేదు..???


మార్పు మననుండే ప్రారంభం కానీయండి. నేడు యవ్వనుడు నాడు వృద్ధుడు..ప్రతి ఒక్కరికి ఒకరోజు అనేది ఉంటుంది కదా... అదే జీవిత సత్యం..


ఈ రోజు..మీ.... తరువాత.. నువ్వే . తథ్యం..జాగ్రత్త.  ఆస్తులు ఇవ్వాళ ఉంటాయి రేపు పోతాయి..ముందే  వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి.. ఇకనైనా మారండి.. పుడుతూ ఏమి తేలేదు... పోయేటప్పుడు ఏమి తీసులెల్లలేము..ఉన్నంతలోనేఅందరము కలసిమెలసి ఉందాం...వారిని గౌరవంగా చూసుకొందాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి