ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అనగా అనగా గొప్ప తాపీ మేస్త్రీ ఒకడు ...


అనగా అనగా గొప్ప తాపీ మేస్త్రీ ఒకడు ఉండేవాడు. అతని నైపుణ్యం అద్భుతం! అతని పనితనం అసామాన్యం; అనితర సాధ్యం! ముప్ఫై సంవత్సరాలుగా అతను ఒక కాంట్రాక్టరు క్రింద పని చేస్తూ వచ్చాడు. ఆ కాంట్రాక్టరుకు కూడా మేస్త్రీ అంటే చాలా గౌరవం అభిమానం- అందువల్లనే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. చివరికి ఒక రోజున మేస్త్రీ కాంట్రాక్టరుతో చెప్పేశాడు- "అయ్యా! ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పనేదో అయిపోగానే, నేను ఇక రిటైరు అయిపోతాను. బాగా పెద్దవాడిని అయిపోయాను, కొంచెం బలహీనంగా కూడా అవుతున్నట్లుంది. ఇప్పుడిక పనిని చాలించాలి. మిగిలిన కొద్దిపాటి జీవితాన్ని విశ్రాంతిగా గడుపుదామని ఉన్నది. ఈ సంగతిని కొంచెం ముందుగానే తెలియజేస్తున్నాను మీకు- ఏమంటే పనిలో కష్టం కలగకూడదు గద, అందుకని" అన్నాడు. కాంట్రాక్టర్ సన్నగా నవ్వాడు. సరేనన్నట్లు తల ఊపాడు.

చేస్తున్న పనేదో ముగింపుకు వచ్చింది. పని ఆరోజుతో అయిపోతుందనగా కాంట్రాక్టరు మేస్త్రీని పిలిచి- "ఈ పని అయిపోగానే రిటైరు అయిపోతానన్నావు. నేను అందుకు ఒప్పుకున్నాను కూడాను. ఇదంతా నాకు గుర్తులేక కాదు- కానీ నాదొక చిన్న అభ్యర్థన- కాదనకు. నాకోసం మరొక్క చక్కని ఇల్లు- ఒక్కటంటే ఒక్కటి- కట్టి ఇచ్చి వెళ్ళు. ఆ తర్వాత నేను ఇక నిన్ను ఆపను. మరొక్క ఇల్లు- అంతే- ఏమంటావు?" అన్నాడు.

మేస్త్రీకి ఈ మార్పు అస్సలు నచ్చలేదు. అయినా ఏం చేస్తాడు, చాలా కాలంపాటు పని చేసి ఉన్నాడు- కాదనటానికి లేదు- అందుకని అయిష్టంగానే ఒప్పుకున్నాడు.

ఒప్పుకున్నాడన్నమాటే గాని, నిజంగా కొత్త ఇంటి పని మొదలయ్యేసరికి, మేస్త్రీకి ఆ పని పెద్ద బరువులాగా తోచింది. ఏమాత్రం ఇష్టం కాలేదు. పనిలో అస్సలు మనసు నిలవలేదు. 

దాంతో ఆ పని అరకొర వేగంతో, దాని ఇష్టం వచ్చినట్లు అది సాగింది. నిర్మాణపు క్వాలిటీకూడా బాగా రాలేదు. మేస్త్రీ ఆ మార్పును గమనించాడు- అయినా సర్దుకు పోయాడు. "ఏంచేస్తాం, ఇంతే!" అనుకున్నాడు. మధ్య మధ్యలో కాంట్రాక్టరు వచ్చి సలహాలూ, సూచనలూ ఇస్తూనే వచ్చాడు. అయినా మేస్త్రీ వాటిని అన్నిటినీ పెడచెవిన పెట్టాడు. "ఎలాగో ఒకలాగా అయిపోనీ, పని గడిస్తే చాలు" అనుకున్నాడు. 

కొత్త ఇంట్లో పని పూర్తయ్యే సమయానికి కాంట్రాక్టరు వచ్చి చివరి ఇన్స్పెక్షను చేశాడు. నిర్మాణపు పనితనం బాగాలేదు: చాలా లోపాలు కనబడ్డాయి. ఆయనేమీ ఆశ్చర్యపోలేదు- ముందునుండీ చూస్తూనే ఉన్నాడు గద! నిట్టూర్చాడు. ఆపైన మెల్లగా జేబులోంచి తాళాల గుత్తి తీసి, మేస్త్రీ చేతికి ఇస్తూ అన్నాడు- "మిత్రమా! ఇదిగో, ఈ ఇల్లు ఇక నీదే. ఇంటి తాళాలివిగో- అందుకో. మన స్నేహానికి గుర్తుగా నేను నీకు ఇవ్వదలచిన బహుమతి ఇది" అని. మేస్త్రీ నిర్ఘాంతపోయాడు. "ఎంత ఘోరం జరిగిపోయింది! ఈ సంగతి ముందుగానే తెలిసిఉంటే ఎంత బాగుండేది?! తను ఆ ఇంటి నిర్మాణంలో జీవం పోసి ఉండేవాడే! ఇప్పుడు ఇక చేయగలిగింది ఏమీ లేదు. లోపభూయిష్టమైన ఈ ఇంట్లో తన శేష జీవితాన్ని గడపాల్సిందే; తన తప్పుల్ని తను ప్రతిరోజూ చూస్తూ, ప్రతిరోజూ సిగ్గుపడుతూ గడపాలి! అయ్యో! ముందుగానే తెలిసి ఉంటే ఎంత బాగుండేదో! ఇప్పుడేమీ చెయ్యలేమే!" అని కుమిలిపోయాడు.

మన ఈ శరీరాల్ని నిర్మించుకునే మేస్త్రీలం మనమే. మనదే ఈ ఇల్లు. ఇందులో ఉండాల్సిందీ మనమే. మనం మన యీ శరీరాన్ని ప్రేమ, ఆప్యాయతలతో శ్రద్ధగా నిర్మించుకుంటే, అది మనకు అనుకూలంగాను, వసతిగాను ఉంటుంది. బాగా పని చేస్తుంది. అట్లా కాక, మనం దాని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, అది పాడౌతుంది- అప్పుడు ఇక మనం బాధగా, పశ్చాత్తాపంతో బ్రతకాల్సిందే.

మన ఆరోగ్యం నిజంగా మన చేతుల్లోనే ఉంది.

ఆరోగ్యమే మహాభాగ్యము.భగవంతుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని మనకు Immunityని పెంచే 

ఆహారపు అలవాట్లతో కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. అదే మన ధర్మం.అదే మన బాధ్యత.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి