ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

"మెంటల్ ఏజ్..."

ఏయ్ చిట్టి చిన్నారి అక్కా.... బాగున్నావా .....  నన్ను అందరూ గేలి చేస్తున్నారు .... మెంటల్ ఏజ్ పెరగాలి అంటున్నారు ... ఏమిటే అది ..... 

ఒరేయ్ కన్నా.... శారీరక వయస్సు, మానసిక వయస్సు అని రెండు రకాలు. 

స్కూల్ లేక నీకు కొన్ని పాఠ్యాంశాల మీద అవగాహన లేక తెలీక పోవచ్చు. 

నువ్వు పుట్టిన రోజుకు వేరొక రోజు అడిషన్ చేస్తే వచ్చేది నీ శారీరిక వయస్సు. ఆ పెరుగుదలకు నీ ప్రేమయం లేదు.

కానీ.  మానసిక వయస్సు ...నీ ప్రవర్తన, జీవిత అనుభవాలు, కష్ట నష్టాలు, జీవితంలో తగిలిన  ఎదురు దెబ్బలు ఇత్యాది విషయములతో కూడుకొని .... ఏ రకముగా పుష్పం పిందిగా, కాయగా , ఫలంగా పరిపక్వత చెంది అది ఏ ఉద్దేశ్యంతో ఈ భూభాగం మీద ఉద్భవించ్చిందో ఎరింగి ఇతరులకు తీపి రుచిని ఇచ్చి వారి మనసు ఉల్లాసం కలిగించిన ప్రతీ క్షణం కూడా పెరుగుతూ వుంటుంది ....

 బట్...శారీరిక వయస్సు అంత వాస్ట్ గా కాకుండా .... చాలా స్లో పేస్ లో పెరుగుతుంది. 

అందుకనే నువ్వు అబ్జర్వ్ చేసే వుంటావు..... కొంత మంది వయస్సుకు తగ్గట్లుగా బిహేవ్ చేయట్లేదని విజ్ఞులు అయిన వాళ్ళు పసికడుతూ వుంటారు. 

టీనేజ్ వరకు శారీరిక వయస్సు ప్రోపోర్షనెట్ గా మానసిక వయస్సు పెరగి పుష్పం కాయగా మారే ప్రక్రియ జరగాలి . అంటే ఆ వయస్సులో వచ్చే ఒడిదుడుకులు చాకచక్యంగా దాటుకొని .... మెచూరిటీ పొందాలి .   

ఆ తదుపరి కొంతకాలం ఆ మెంటల్ ఎజే స్టాండర్డ్ చేసుకొని; ఉద్యోగం, ఇతర సంసార బాధ్యతలప్పుడు .... బాలన్స్ గా వుండి.... మంచి,చెడు సంస్కారములు గ్రహించుకుంటూ .... కొద్ది కొద్దిగా ప్యూరిఫై గా ఆ వయస్సు పెరగటానికి దోహదం చేయాలి.... ఈ ప్రక్రియ నీ చేతులోనే వుంది.  నీకు అండగా కుటుంబ సమాజ నైజం , సత్పురుషుల జీవిత పాఠాల శ్రవణ, అనుకరణ దోహదం చేస్తాయి. 

ఒరేయ్ పొట్టి పోకిరి ......అద్భుత విషయం నీకు చెప్పమంటావా .... కొంత మంది చిన్నతనంలోనే వారి ఆలోచనలు చాలా పరిపక్వత కలిగి ....ఇతరులకు సలహాలిచ్చే స్థాయిలో వుంటారు..... వారి జీవితం కడు ఆనందం. ఎన్ని ఒదుదుడుకులు వచ్చినా.... తొనకని నీటి కుండ లాంటి వారు వారలు.  

కానీ ... ఇప్పటి యువతరం కెరీర్ అంటే మంచి ఉద్యోగం, సంపాదన, లగ్జరీ లైఫ్ అనే భావనలో వున్నారు. దానితో పాటు సమాజ ఆమోదయోగ్యమైన కార్యములు ద్వారా .... సత్పురుషుల సభ్య సమాజంలో మెంబర్ షిప్ తీసుకోవటం తప్పని సరి అని తెలేట లేదు.... మరి దానికి ఎలి జిబిలిటీ క్రైటీరియా... మెచ్యూరేడ్ బిహేవియర్ అండ్ హై  మెంటల్ ఏజ్ అని తెలియచెప్పే కోచింగ్ సెంటరే ఈ మన జ్ఞాన కేంద్ర కుటుంబ వేదిక. 

 వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన వారలు, వారి స్వీయ జీవిత అనుభవాలను, అకడమిక్స్ కి జోడించి చెప్పే ప్రయత్నం చేస్తారు.... 

అబ్బా.... నాకు అర్ధమైందే.... నేను కూడా పది మందికి ఈ విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేస్తాను... వినే వారు జీవితాలైన ఆనందమయంగా వుంటే.... మన పిచ్చోడు సూరపరాజు ఈ కష్టానికి కొంత వరకు ఫలితం దక్కితే... నా పుట్టుకకు సార్ధకత వుంటుంది.... 

ఉంటా మరి....Credits: Telegram User సూరపరాజు

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

శివతత్వం - పాము, అగ్ని, భూతపిశాచాలు

శివశంకరన్ కంచి మఠానికి చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు. ”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అ