ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండిలా

మనమీద మనకు గాఢమైన నమ్మకాన్ని కలిగి ఉండటమే ఆత్మవిశ్వాసం. నేటి యువతలో చాలామందికి తమలో తమకు ఆత్మవిశ్వాసం ఉండకపోవడం మనం గమనిస్తున్నాం. నిజానికి కాళ్లు చేతులు సక్రమంగా ఉండి ఏ పని చేయడానికి ఆసక్తి చూపనివాడే వికలాంగుడు. అంతేకాని శరీరంలో ఒకభాగం పోయినా మిగిలిన భాగాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న వ్యక్తి వికలాంగులు కారు.

 ముఫ్పైమూడేళ్లకే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్‌లో ఉన్నది అంతులేని ఆత్మవిశ్వాసం. జపాన్‌ మీద రెండు బాంబులు పడి బూడిదైన విషయం తెలిసిందే. ఆ బూడిదమీదే ఆదేశం జూలు విదిల్చిన సింహంలా నిద్రలేచి పారిశ్రామిక వ్యవస్థనే సవాలు చేయడానికి కారణం ఆ దేశ యువత ఆత్మవిశ్వాసం.

మరోఅద్భుత కథని చూద్దాం. ఆమెకి చిన్నప్పడు కనీసం తినడానికి తిండిలేదు. ఆమె ఇంటికి తలుపులు లేవు. గాలి కూడా రాదు. కరెంటులేదు. వంట చేసుకోవడానికి గ్యాస్‌ లేదు. తనకు దొరికిన కొంచెం ఆహారాన్ని తిని కొన్నిసార్లుఆకలికి తట్టుకోలేక స్పహ తప్పిపోయేది.అలాంటి ఆమె ఎలాగైనా ఈ ప్రపంచంలో నెంబర్‌వన్‌ సైంటిస్ట్‌గా ఎదగాలనుకుంది. ఫలితంగా అంతులేని ఆత్మవిశ్వాసంతో కృషి చేసి నోబుల్‌ప్రైజ్‌ని సంపాదించినామే మేడం క్యూరి. రేడియం కనిపెట్టి మెడికల్‌ సైన్సు రూపురేఖలనే మార్చివేసింది. చీకటి గదిలో తిండిలేక సృహతప్పిపోయిన ఓబాలిక నేడు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ గొప్ప సైంటిస్ట్‌. ఆత్మవిశ్వాసమే ఆమె సక్సెస్‌కి కారణం. ఎలాగైనా పైకి రావాలన్న తాపత్రయం, తనమీద తనకున్న నమ్మకం చివరికి ఆమె ఆశయం హృదయంలో నిరంతరం నిరంతర తపనలో కరిగి ఆమె కలని నిజం చేసింది. 


మనం ఒక్కపూట గ్యాస్‌ అయిపోతే అబ్బా ఇవ్వాళ నాకెంత కష్టమొచ్చింది అని బాధపడేవారు ఆమె జీవితం నుండి నేర్చుకోవల్సింది ఎంతోఉంది. ఆత్మవిశ్వాసానికి మరోపేరుగా చెప్పదగినవారు అమెరికాని కనిపెట్టిన కొలంబస్‌. తన భార్యవద్దన్నా, ఇంట్లో పడి ఉండమన్నా ప్రపంచంలో ఏదోఒకటి కనిపెట్లాలన్న ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో సుడులు తిరిగే సముద్రంలో ఎన్నో రాత్రులు, పగల్లు అన్వేషించాడు. తన సముద్రయానంలో ఎన్నో నిరాశలు, ఎన్నో ఎదురుదెబ్బలు ఎదురైనా అంతులేని ఆత్మవిశ్వాసంతో అన్వేషణ కొనసాగించాడు. దాని ఫలితంగా అతడి వెంట్రుకలు తెల్లబడ్డాయి. అతడి బట్టలు చినిగి పీలికలైపోవడమే కాక అతడికి కీళ్లవాతం వచ్చింది. అయినా వెనుకంజ వేయకుండా తాను అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు ప్రయత్నం కొనసాగించాడు. చివరికి ఆత్మవిశ్వాసంతో అమెరికాను కనిపెట్టాడు. ఆరోజు తాను కనిపెట్టిన నౌకాయానం ద్వారా అనేక దేశాల ప్రజలు తమ ఎగుమతులు దిగుమతులు కొనసాగించి తమ జీవితాలను సుఖవంతం చేసుకున్నారు.


ఎక్కువ మందిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి కారణం మొదట తమ మీద తమకు నమ్మకం లేకపోవడం.చాలా మంది నాకు బాగాలేదు, నేను ఈ పని చేయలేను, నాకు ఈ ఉద్యోగం అంటే అసహ్యం, నాకు అంత తెలివి తేటలు లేవు, నాకు అదృష్టం లేదు, నేను మొహమాటస్థుడిని నాకు ఆసక్తి లేదు లాంటివి ఎక్కువగా వాడుతుంటారు. ఇలాంటవన్నీ ఆత్మన్యూనతా భావాన్ని సూచించే అంశాలు. వీటినే మీరు నేను చేయగలను, నేను భయపడను, నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఇతరుల విజయానికి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. నాజాబ్‌ అంటే నాకు ఆసక్తి ఎక్కువ. అంటూ పాజిటివ్‌గా ఆలోచనల్ని మార్చుకుంటే మీలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే పాటించాల్సిన అంశాలు:

1.ముందుగా మీ జీవిత గమ్యం ఏమిటో స్పష్టంగా నిర్ధారించుకోవాలి.

2. ఈ లక్ష్యాన్ని నేను తప్పకుండా సాధిస్తాననే నమ్యకాన్ని మీపై మీరు కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు కించపరచుకోవడం మానెయ్యండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆత్మన్యూనతకి లోనుకావొద్దు.

3. అందరిలాగే నాకూ రెండు చేతులు, రెండుకాళ్లు ఉన్నాయి. అవి చాలు నా లక్ష్యాన్ని సాధించడానికి అని మీరు పాజిటివ్‌గా ఆలోచించాలి.

4. మీరు చేసిన తప్పులనే తలుచుకుంటూ కాలం వృధా చేయవద్దు. చేసిన తప్పులనుండి పాఠాలు నేర్చుకొని అవి తిరిగిచేయకూడదు.

5. మీరు ఇంతకుముందు సాధించిన విజయాల జ్ఞాపకాలను భద్రపరచండి.ఆ విజయాల పరంపర నుండి మీరు ఉత్సాహం ద్విగుణీ కృతమవుతుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

6. ముందుగా చిన్న పనులతో మొదలు పెట్టండి. వాటిని క్రమంగా పెంచండి.

7. మీ పాత్రలో లీనమై పోండి. మీలోని వ్యక్తిని బయటపెట్టి ధైర్యంగా పనిచేయండి. ఫలితంగా అంతులేని ఆత్మవిశ్వాసం మీదవుతుంది.

8. ఏ పనినైనా కష్టంగా కాకుండా ఇష్టంగా చేయడం అలవాటు చేసుకుంటే దానివల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి