సజ్జనులున్న సభలలో
దుర్జనులు కూడా ఉంటారు
తామరపువ్వు లున్న చోట
నాచు కూడా ఉంటుంది...
గులాబీపువ్వులున్న మొక్కలో
ముళ్ళు కూడా ఉంటాయి
కోయిలలున్న చెట్టుపై
కాకులు కూడా ఉంటాయి...
ధర్మరాజు ఉన్నచోటే ధుర్యోధనుడున్నాడు
కృష్ణుడున్నప్పుడే కంసుడున్నాడు
రాముడు ఉన్న కాలంలోనే
రావణుడు కూడా ఉన్నాడు...
పగలు ఉంది అంటే
రాత్రి కూడా ఉంటుంది
వెలుగులున్న పగటికాలంలో
సత్కారాలు చెయ్యాలి
చీకట్లున్న రాత్రివేళ
ఆదమరచి నిద్రించాలి...
మంచిని పెంచుకుంటూ పోవాలి
చెడును త్రుంచుకుంటూ ఉండాలి
అప్పుడే బ్రతుకులలో అందాలు నిండుతాయి
ఆనందాలు పండుతాయి
జ్ఞానమున్నచోట అంతా పన్నీరే
జ్ఞానం లోపిస్తే బ్రతుకంతా కన్నీరే...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి