ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అనగనగా ఒక రోజు ఒక వేట గాడి ...

అనగనగా ఒక రోజు ఒక వేట గాడి చేతికి ఒక చిన్న పక్షి(పిచ్చుక) దొరికింది . అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది.

"అయ్యా నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను వేటాడి ఉంటావు, నా లాంటి అల్ప ప్రాణిని చంపటం వల్ల నీకేమి ఉపయోగం?

నీ పిడికిలి పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగూ తీరదు. దయచేసి నాకు ప్రాణ బిక్ష పెట్టి నన్ను వదిలి వేయి.

అందుకు ప్రతి ఫలంగా నేను నీకు అమూల్యమయిన మూడు నీతి సూక్తులు చెప్తాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నీవు సంతోషం గా సుఖంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి."

అది విన్న వేటగాడు క్షణం అలోచించి, నిజమే ఈ పిచ్చుకని చంపటం వల్ల ఉపయోగము లేదు అనుకుని, "సరే వదిలివేస్తాను ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు" అన్నాడు.

అప్పుడు ఆ పిచ్చుక, "అయ్యా కానీ నాది ఒక షరతు, నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను, రెండవది నీ ఇంటి పైకప్పు పై కూచుని చెప్తాను, ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూచుని చెప్తాను అంది." వేటగాడు సరే అని ఒప్పుకుంటాడు.

పిచ్చుక వేటగాడి చేతిలో కూచుని మొదటి నీతి సూక్తి ఇలా చెప్తుంది ...

1) ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి(తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు.

అని చెప్పి, వేటగాడి చేతి లో నుండి ఎగిరి వెళ్లి ఇంటి పైకప్పు పై కూచుంటుంది.

అక్కడ నుండి ఫక్కున నవ్వి అంటుంది "ఓరి మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకున్నావు, నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువయిన వజ్రం ఉంది, అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలివేసావు ."

అది విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలచుకుని ఏడవటం మొదలుపెడతాడు.

అయ్యో అంత విలువయిన బరువయిన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడిని నేను అని గట్టి గట్టిగా ఏడవటం మొదలుపెడతాడు.

అప్పడు పిచ్చుక అంది, ఓరీ నీవు నిజంగానే మూర్ఖుడివి, నేను ఇంతకు ముందే నీకు చెప్పాను

"ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే, ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి(తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు."

నీ పిడికిలి అంత కూడా లేని నేను, నా కడుపులో బరువయిన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా, రెండవ నీతి సూక్తి ఏమిటంటే

2) ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి అలోచించి చింతించకూడదు బాధ పడకూడదు. అని చెప్పి ఎగిరి వెళ్లి చెట్టు కొమ్మ పై కూచుంది.

వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు. "లేదు, నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేసావు."

పిచ్చుక వేటగాడిని చూస్తూ అలా కూచుని ఉంది.

కాసేపటికి వేటగాడు తేరుకుని సరే, "ఎప్పుడూ ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి అలోచించి చింతించకూడదు బాధ పడకూడదు" అని గుర్తు చేసుకుని, సరే ఇప్పుడు మూడవ సూక్తి ఏమిటో చెప్పు అంటాడు.

అప్పుడు పిచ్చుక, ఎలాగూ నే చెప్పిన మొదటి రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు, మూడవది చెప్పటం వల్ల ప్రయోజనం లేదు.

3) నీ మాటలు వినని, అర్థం చేసుకోని వారిపై ఎన్నడూ నీ శక్తినీ, విజ్ఞానాన్ని, సమయాన్ని వృథా చేసుకోవద్దు.

అని మూడవ సూక్తి చెప్పి ఎగిరి వెళ్ళిపోతుంది.

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

శివతత్వం - పాము, అగ్ని, భూతపిశాచాలు

శివశంకరన్ కంచి మఠానికి చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు. ”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అ