ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎపుడో నలభై ఎండ్ల క్రిందటి మాట.ఆవునుతిన్న పులికథ.

ఎపుడో నలభై ఎండ్ల క్రిందటి మాట.ఆవునుతిన్న పులికథ.దాదాపు నలభై సంవత్సరాల క్రిందట అనుకొంటా రావుకొండలరావు గారి కథ ఒకటి యువ మాసపత్రికలో ప్రచురితమైంది. కథపేరు గుర్తు లేదుకాని  కథనంమాత్రం చాలా బాగా గుర్తుంది నాకు.


ఇది మనకు తెలిసిన ఆవు పులిలాంటి కథే అయినా ముగింపు మాత్రం పులి సహజధోరణి, ప్రవర్తన ఎలా వుంటుందో రావు కొండలరావుగారు అద్భుతంగా చూపారు. ఇంతకు కథ ఏమిటంటే...

గోవు ఒక్కటి అడవిలో మేతమేసుకొని ఇంటిదగ్గరున్న లేగదూడకు పాలివ్వటానికి ఆ సాయంత్రం వడివడిగా వస్తోంది. దార్లో ఆవును పులి అడ్డగించి బాగా ఆకలిగావుంది, నిన్ను తినేస్తానంది.

పుట్టిన ప్రతిప్రాణి ఎప్పుడో ఒకపుడు గిట్టకమానదు.పరుల ఆకలి తీర్చటానికి నా శరీరం ఉపయోగపడుతుందంటే అంతకంటే నాకింకేమి కావాలి అని ఆ ఆవు అంటూ 

ఓ పులిరాజా నన్ను తిని నీ ఆకలితీర్చుకో, అయితే నాదో చిన్నమనవి ఇంటిదగ్గర ఆకలితో నా దూడ నా కోసం కాచివుంది. త్వరగా వెళ్ళి నా బిడ్డకు పాలిచ్చి, నాలుగు బుద్ధిమాటలు చెప్పి వచ్చేస్తాను అనుమతివ్వు అంటూ ప్రాధేయపడింది.తప్పించుకోటానికి ఇదో ఎత్తు కుదరదు, వెళ్ళటానికి వీల్లేదంటూ గర్జించిందా పులి. దానికా గోమాత పులిరాజా నేను గోమాతను ఆడిన మాట తప్పను ఈ సూర్యచంద్రులు భూమ్యాకాశాలు మీద ఆన, నేను తప్పక తిరిగివస్తా నన్ను వెళ్ళనివ్వు అంటూ దీనంగా ప్రాధేయపడిందా ఆవు.

పులిరాజు ఏ కళనున్నాడో సరేనన్నాడు. ఆవు పరువులెత్తి లేగదూడకు పాలిచ్చి పులికి తాను ఇచ్చిన మాట గురించి చెప్పి నాయనా అమ్మలేని వాడు దూది కంటే దుమ్ముకంటే చులకన. అందుకే దుష్టసహవాసం చేయెద్దు. చెడు అలవాట్లనేర్చుకోవద్దు, బావులగట్ల వెంబడి మేతకు పోవద్దు, ఆడిన మాట తప్పకు అంటూ కన్నీళ్ళతో బోధించింది. ఏం చేయాలో తోచక దూడ చిట్టి హృదయం బాధతో నిట్టూర్చింది. దూడ కళ్ళల్లో కన్నీళ్ళ ధార, ఆవు కంఠంలో గద్గత. ఆవుదూడలు ఏడ్చుకొంటూ పరస్పరం వీడ్కోలు చెప్పుకొన్నాయి.

ఆవు పులి దగ్గరకు వచ్చింది. గోమాత నిజాయితికి, సత్యవాక్పరిపాలనకు పులి ఆశ్చర్యపడింది. ఇలాంటి సచ్ఛీలురాలునా నేను తిని ఆకలి తీర్చుకోనేది అంటూ ఆలోచించి ఆవు మంచి హృదయాన్ని చూచి భోరున ఏడుస్తూ, అమ్మా గోమాత నీలాంటి మంచివారిని ఆడిన మాట తప్పనివారిని నేను తినను నువ్వు స్వేచ్ఛగా వెళ్ళినీ బిడ్డను కలుసుకోవచ్చు అంటూ కాళ్ళమీద పడింది.

అమ్మా గోమాత నిన్ను నాకు ఆహారంగా పంపిన లేగదూడను ఒకసారి చూడాలనుంది.పిలుచుకు రా ఒక్కసారంటూ అడిగింది.

ఆవు దానికేం భాగ్యమంటూ ఇంటికి వెళ్ళి పులి మంచితనం గురించి తెలియచేసి ఒక్కసారి నిన్ను చూడాలని ఆ వ్యాఘ్రం కోరుతోంది వెళదాం రా అంటూ చిట్టిదూడను పులివద్దకు తీసుకువెళ్లింది.

ఆవుదూడను చూడగానే ఆ శార్ధూలం బిగ్గరగా గాండ్రించి పంజావిసిరి  ఆవుదూడను ఒక్క దెబ్బతో చంపేసి దూడను టిఫిన్ గాను, గోమాతను భోజనంగాను తినేసింది.

ఇది నేటిసమాజంలో నీతినిజాయితికి వున్న విలువ.

*నిన్నటి రోజున (28:7: 2020 ) న మహనాటక రచయిత విలక్షణనటుడైన రావు కొండలరావుగారు కనుమూసారు. వారికి స్వర్గప్రాప్తి కలగాలని ప్రార్థిద్ధాం.*
.............................................................................................................

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట