యమున పరవళ్లు తొక్కుతోంది
ఒక కొత్తయుగానికి స్వాగతం
పలకటానికన్నట్టు
ప్రచండ గాలులు వీస్తున్నాయి
జరగబోయే అద్భుతానికి హెచ్చరిక అన్నట్టు
మెరుపులు మెరుస్తున్నాయి
వేయి ఏనుగుల ఘీంకార శబ్దంతో
జగతి భయపడేటట్టు
యదువంశ కిశోరుని చూడగానే
ఉప్పొంగే అలలు సన్నని త్రోవ మిగిల్చే
భవిష్యత్తు దర్శనం కొరకు
అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడు
తల్లి స్పర్శ కు నోచుకోలేదు సరి కదా!
సరిఅయిన పాన్పు లేదు
భీకర గరజ్జనల నడుమ
ఆదిశేషుడు తన పడగతో తోడు నీడై నిలిచి
భవిష్యత్తు సంగ్రామానికి తన వంతు
తోడ్పాటు నందిస్తున్నాడు
ఎంత కష్టం వచ్చింది యదువంశ విజేతకు
చిరునవ్వు చెరగనీయలేదు
రెండు కాళ్లు ఒక దరి చెరనీయలేదు
ఒక మహాసంగ్రామానికి
నాందీవచనం ఇప్పుడే మొదలైంది!
కృష్ణాష్టమి శుభాకాంక్షలు
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి