ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శ్రీకృష్ణదేవరాయలకు దేవకీపురానికి గల సంబంధమేమిటో ?


పూర్వకాలంలో జంటగా కవిత్వం చెప్పిన వారిలో నందిమల్లయ్య - ఘంటసింగయ్యలు ప్రముఖులు. ఇద్దరు బంధువులు కూడా. నందిమల్లయ్యకు ఘంటసింగయ్య మేనల్లుడు. 1480 కాలంలో గుంటూరు, నెల్లూరులలో వుండేవారు.


నెల్లూరులోని ఉదయగిరి దుర్గాన్ని గజపతుల సామంతుడైన పూసపాటి బసవరాజు పాలించేవాడు. అతని కొలువులో కవులుగా దూబగుంట నారాయణకవి, దగ్గుపల్లి దుగ్గనలు వుండేవారు.బసవరాజుకు మంత్రిగా  పెసరువాయ గంగన్న వుండేవాడు.ఇతనికే దగ్గుపల్లి దుగ్గన నాసికేతోపాఖ్యానం అంకితమిచ్చాడు. గంగన్నకు కృష్ణమిశ్రుడు (1098 A.D) సంస్కృతంలో వ్రాసిన ప్రభోదచంద్రోదయాన్ని తెలుగులో వ్రాయించుకోవాలనే కోరికవుండేది. ఎవరాపని చేయగలరని విచారిస్తే మల్లయ్య, సింగయ్యలు ఇందుకు కడు సమర్థులని తెలిసింది.అలా  ప్రభోదచంద్రోదయం తెలుగులో వెలసింది.


కొన్ని కారణాల వలన ఈ జంటకవులు దేవకిపురం చేరారు. దీనికే దేవకాపురమని పేరు కూడా. తమిళనాడులోని ఉత్తరు ఆర్కాడులోని అరణి తాలూకాలో ఈ దేవకీపురం వుంది. దేవకీపురాన్ని గురించి ఎందుకు చెప్పాల్సివుందంటే ఇది నరసనాయకుడికి పుట్టిల్లు. నరసనాయకుడి నాయనమ్మ పేరు దేవకిదేవి. ఈమె పేరున దేవకాపురాన్ని నిర్మించడం జరిగింది. నరసనాయకుడేవరంటే శ్రీకృష్ణదేవరాయల తండ్రి.దేవకాపురంలో వున్న బృహదీశ్వరాలయం ఇప్పటికి ప్రసిద్ధి.


నందిమల్లయ్య గంటసింగయ్యలను తుళువ నరసరాజు*(నరసనాయకుడు) పిలిపించాడు.వరాహపురాణాన్ని వ్రాసి తనకు అంకితమివ్వాల్సిందిగా కప్పురవీడెం (తాంబులం) అందించాడు.


వీరు వరహాపురాణం పూర్తిగా ఆంధ్రీకరించలేదు. ఇందులో కథాబలం లేకపోయినా చిత్రవిచిత్ర కవిత్వ ప్రయోగాలు చేసి దానిని శ్రీమంతం** చేశారు.


వీరు రెండక్షరాలతో ఓ కందాన్ని వ్రాశారు. అది..


కాక లికాకలకలకల కోకిలకులలీలక లుల కులుకుకులక లు కే,

కేై కోకు కేలికొలకుల కోకాలీకేలి కులికి కొంక కు కలికీ


ఈ జంటకవులు ఒకే అక్షరంతో అంటే న అక్షరముతో చిత్రకవిత్వాన్ని కందంలో చెప్పారు.


నానననుని ననూన నేనునినుననున్ను నెన్న నీనీననిను

న్నా నౌననొన్ని నానౌ నేనే నను నన్ను నాన నేనను నన్నన్.


ఇంకా పూర్తి పద్యము  ఎటునుండి చదివినా ఒకేలా వుండేలాకూడా  వ్రాశారు.


సారసనయనా ఘనజఘ నారచితరతారకలిక హరసారరసా

సారరసారహకలికర తారత చిరనాఘజనఘ నాయనరసా.


 తుళువ నరసరాజు లేదా నరసనాయకుడి నలుగురు సంతానం. పెద్దవాడు వీరనరసింహరాయలు, రెండోవాడు శ్రీకృష్ణదేవరాయలు మూడు నాలుగవవారు అచ్యుతరాయలు, శ్రీరంగరాయలు. సంతానం పేర్లచివర అందరికి రాయలు అనివుంది కదా! మరి నరసనాయకుడికి రాయలని లేదందుకు ? (పేరు చివరన నాయకుడనేవుంది.) ఎందుకంటే ఇతను రాజుకొడుకూ కాదు,రాజుగానులేడు. కేవలం  మహమండలేశ్వరుడు, సేనాని. ఇలాంటి వారిని నాయకుడని ఆ రోజులలో పిలిచేవారు. అయితే ఇతను సాళువ నరసింహరాయల అనంతరం అతని కొడుకులైన  పసిబాలురైన తిమ్మ భూపాలునికి,రెండో నరసింహరాయల వద్ద రాజప్రతినిధిగా ఉండేవాడు.


1503 లో వీరనరసింహరాయలు,సాళువ రెండో నరసింహరాయలను తొలగించి విజయనగర సింహాసనాన్ని ఆక్రమించి తుళువ వంశపాలనకు కారకుడైనాడు. ఇతని అనంతరం కృష్ణదేవరాయలు, ఇతని తరువాత అచ్యుతరాయలు, ఇతని తరువాత అచ్యుతరాయలు, ఇతని అనంతరం శ్రీరంగరాయల కొడుకైన సదాశివరాయలు రాజ్యానికి వచ్చారు. 1572లో తుళువ వంశానికి చెందిన సదాశివరాయల అనంతరం ఆరవీటి వంశం శ్రీరంగరాయలతో మొదలైంది.


 చాలామంది సీమంతాన్ని శ్రీమంతంగా పలుకుతున్నారు. బాధాకరవిషయమేమిటంటే ప్రముఖ తెలుగు దినపత్రికలో కూడా సీమంతాన్ని శ్రీమంతంగా వ్రాయడం.


చాల్రోజుల కిందట ఇదే పత్రికలో దారిలో సీమజాలి చెట్లు పెరిగి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని వ్రాశారు.

కన్నడలో జాలి అంటే తుమ్మచెట్టు. ఈ కంపచెట్లను కాంగ్రెస్ కంప అనంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రుగారి తొలినాళ్ళలో కరువు కాలంలో W H O సీమనుండి  గోధుమలు దిగుమతైనాయి. గోధుమలలో ఈ కంపవిత్తనాలు దిగుమతైనాయి. ఇక్కడ అవి తామరతంపరగా పెరిగాయి.. తెలగులో ఈ చెట్లను సీమకంపలని, సీమతుమ్మని పిలవడం పరిపాటి. ఇంత వరకు ఈ చెట్లకు సరైన తెలుగుపదం లేదనుకొంటా.

ఈ సీమకంపలే వంటచెరుకుగా గ్రామీణంలో వాడుతున్నారు. కనుక కొద్దిగానైనా ఇతరు చెట్లు బతికిబట్టకడుతున్నాయనుకొవచ్చును.

Credit: జి.బి.విశ్వనాథ. అనంతపురం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి