ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సిరిల్ రాడ్ క్లిఫ్ భారతదేశవిభజన సమయంలో ఆస్థులు,జనాభా,సరిహద్దులు నిర్ణయించడానికి నియమించిన వ్యక్తి.



 జూన్ 3 న ఇంగ్లండ్ పార్లమెంట్ భారతదేశవిభజనకు అమోదం తెలిపింది. దానికి దాదాపు సంవత్సరకాలం అంటే జూన్ 1948 వరకు గడువు విదించింది.దానికి అనుగుణంగా రాడ్ క్లిప్ ను నియమించడం జరిగింది.

ఈ సిరిల్ రాడ్ క్లిఫ్ అనే ఆయన పెద్ద న్యాయకోవిధుడుకూడా కాదు.బ్రిటన్ లో పెద్దపేరున్నవాడూకాదు. అంతకముందు భారత్ కు ఎప్పుడూ రాలేదు.భారతీయ సంస్కృతి ,సాంప్రదాయాలు,భావోద్రేకాల మీద అసలు అవగాహనలేదు.మౌంట్ బాటన్ రాడ్ క్లిప్ పేరు చెప్పగానే ,వెంటనే జిన్నా ఒప్పేసుకోవడం నాటి రాజకీయ విశ్లేషకులకు అనుమానాలొచ్చాయి.అయితే నెహ్రుా లాంటి నాయకులు కొంచెం కూడా అనుమానించలేదు.కానీ లండన్ లో జిన్నా లాయర్ గా వున్నప్పుడు ఈ రాడ్ క్లిఫ్ అతని దగ్గర జూనియర్ గా వుండేవాడని విమర్శలు వచ్చాయి.జిన్నా ఆ ఆరోపణలను ఎప్పుడూ ఖండించలేదు. జూలై-2 న పాక్ గవర్నర్ జనరల్ గా జిన్నా పట్టుబట్టి నియమించుకున్న తరువాత మౌంట్ బాటన్ అధికారం పాక్ పై లేకుండా పోయింది. జిన్నా అక్కడ నుండి చక్రం తిప్పాడు.రాడ్ క్లిఫ్ తో ఉన్న పరిచయంతో తనకు అనుకుాలంగా కొన్ని నిర్ణయాలు తీసుకొనేటట్లు చేసుకున్నాడు. కానీ ఇది తెలియని కాంగ్రీసునాయకులు తూర్పు బెంగాల్ ,చిట్టిగాంగ్ ,పంజాబ్ ,సింధు,వాయవ్యసరిహద్దులలో గణనీయంగా వున్న హిందూ-సిక్కుమతస్థులకు ఏమీకాదని చెప్పసాగారు. వారు కూడా కాంగ్రీసునాయకులను నమ్మి ఉదాసీనంగా వుండసాగారు.

       అయితే లాహోర్ లో హిందూ-సిక్కుమతస్థులు ఎక్కువగా ఉన్నందున అక్కడ ముస్లిం లీగ్ నాయకులందరూ కరాచీకి మకాం మార్చారు.అందువల్ల సిక్కుహిందువులు తాము భారత్ లోనే వుంటామనే నమ్మకం మరింత బలపడింది.అయితే 1948 జూన్ వరకు వున్న విభజన తతంగాన్ని మౌంట్ బాటన్ 1947 ఆగష్టు 15 వరకే కుదించాడు. ఈలోపల విభజన మ్యాప్ ను బయటపెట్టద్దని రాడ్ క్లిఫ్ కు ఆదేశాలిచ్చాడు.ఈవిధంగా జూలై 15 న ఇద్దరు ముస్లిమ్ ,ఇద్దరుహిందూ హైకోర్టు న్యాయమూర్తుల సలహాదారులతో రాడ్ క్లిప్ విభజన భారత్ పటాన్ని తయారుచేసారు. అయితే అతను శాస్త్రీయంగా ఎటువంటి పద్దతులూ అవలంబించలేదు. అలాగే ఏ ఒక్కప్రాంతం సందర్శించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోలేదు.

      1947 ఆగష్టు 17 న మౌంట్ బాటన్ సమక్షంలో రాడ్ క్లిఫ్ తన మ్యాప్ ను ప్రదర్శించాడు. అందులో ఒకేఒక గీతతో ఒక ఇల్లునే సగం పాక్ భూభాగంగా,సగభాగం ఇండియా భూభాగంగా విడగొట్టబడింది.ఆశ్చర్యంగా లాహోర్ పాక్ కు ఇవ్వబడింది. అది తెలిసి తూర్పుపంజాబ్ బగ్గుమంది. 40% సిక్కులు,హిందువులు తమ భూములను కోల్పోయి బిక్షగాళ్ళగా మారిపోయారు.తూర్పు బెంగాల్ ,చిట్టగాంగ్ లోని హిందువులంతా హతాసులైనారు.


అయితే ఇక్కడ ఒక అశాస్త్రీయమైన పద్ధతిని అనుసరించడం జరిగింది. అదేమిటంటే విభజనకు 1931 నాటి జనాభా లెక్కలను తీసుకోమనడం. అయితే 1931 లో మతపరమైన జనాభా లెక్కలను కాంగ్రీసు వ్యతిరేఖించి ప్రజలందరూ జనాభా లెక్కలను బహిష్కరించమని పిలుపు ఇచ్చింది. అందువలన చాలామంది సిక్కులు,హిందువులు జనభాలెక్కలను బహిష్కరించారు.కానీ ముస్లిమ్ లీగ్ నాయకులు భారీగా ముస్లిమ్ జనాభాను నమోదుచేయంచారు. దానితో  పాక్ కు భారీగా పంటభూములు దక్కినవి. తూర్పుపంజాబ్ లో మతఘర్షణలు తలెత్తి హింసాత్మకంగా మారాయి..అపారమైన ప్రాణమాన ఆస్థుల నష్టం జరిగింది. ప్రజలకు సంబంధం లేకుండా రాజకీయనాయకులు ఆడిన నాటకంలో అమాయకప్రజలెందరో అసువులుబాసారు. ఢిల్లీ ఇవ్వనందుకు జిన్నా అలిగి కొన్ని ఒప్పందపత్రాలపై సంతకాలు చేయకుండా వెళ్ళిపోయాడు..మౌంట్ బాటన్ తను చేయాల్సింది చేసేసాడు.భారత్ రెండు దేశాలుగా చీలి అధికారబదిలీ జరిగింది ఈ రోజే.

    

  అయితే భారతీయుల సెంటిమెంట్స్ తెలియని రాడ్ క్లిఫ్ విభజన తర్వాత తలెత్తిన భారీ హింసాకాండను చూసి చలించిపోయాడు.ఇంక జీవితంలో ఇలాంటి విషయాల జోలిగా పోనని ప్రకటించాడు. తనకు ప్రకటించిన 3000 పౌండ్ల పారితోషికాన్ని తీసుకోలేదు. ఇదీ దేశవిభజన కథ. ప్రజలు నాయకులను గుడ్డిగా నమ్మారు. వారు ప్రజలను ఇలా ముంచారు!!! అచ్చం ఆంధ్రప్రదేశ్ విభజన లాగే!!!


రవీంద్ర గారు, సేకరణ.....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి