ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బ్యాంకు ఖాతాల‌ను అలా వ‌దిలేస్తున్నారా?..

బ్యాంకు ఖాతాల‌ను అలా వ‌దిలేస్తున్నారా?  

రెండేళ్ల‌పాటు ఎలాంటి లావాదేవీలు జ‌ర‌గ‌ని ఖాతాల‌ను ప‌నిచేయ‌ని ఖాతాలుగా గుర్తిస్తారు

చాలామంది త‌మ ఆర్థిక విష‌యాల‌ను ఎవ‌రితో పంచుకోవ‌డానికి ఇష్ట‌పడ‌రు. దీంతో వారికి అనుకోకుండా ఏమైనా జ‌రిగినా, బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బు ఉంద‌న్న సంగ‌తి క‌టుంబ స‌భ్యుల‌కు కూడా తెలియ‌దు. మ‌రోవైపు, వేరే ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు పాత బ్యాంకు ఖాతాల‌ను ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తారు. ఇలా మార్చి 31, 2019 వ‌ర‌కు క్లెయిమ్ చేసుకోని బ్యాంకు డిపాజిట్ల నుంచి రూ.25,000 కోట్లు ఆర్‌బీఐ ప్రారంభించిన డిపాజిట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏఎఫ్‌) ఫండ్‌లో జ‌మ‌య్యాయి. ఇలాంటి క్లెయిమ్ చేయ‌ని బ్యాంకు డిపాజిట్ల న‌గ‌దును ఈ ఖాతాలో చేరుస్తారు. దీనిని 2014 లో ఆర్‌బీఐ ప్రారంభించింది.

ఈ ఫండ్‌లో చేరిన మొత్తాన్ని ప్ర‌భుత్వ సెక్యూరిటీలలో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన క‌మిటీ పెట్టుబ‌డి చేస్తుంది. దానిపై వ‌చ్చిన ఆదాయాన్ని డిపాజిట్ల‌కు వ‌డ్డీ చెల్లించేందుకు, పెట్టుబ‌డుల అవ‌గాహ‌న‌, విద్య కోసం ఉప‌యోగిస్తారు. డీఈఏఎఫ్ ఖాతాలో న‌గ‌దు పెరిగేందుకు కార‌ణం క్లెయిమ్ చేసుకొని ఖాతాల డిపాజిట్లు, రాబ‌డి నుంచి వ‌చ్చినదే.

ఆర్‌బీఐ ఎప్ప‌టిక‌ప్పుడు ఈ డిపాజిట్ల‌పై వ‌డ్డీ చెల్లిస్తుంటుంది. ఖాతాదారులు లేదా వార‌సులు ఈ ఖాతాల‌ను ఎప్పుడైన అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు చూపి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే బ్యాంకులు ఇటువంటి క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని నిపుణులు భావిస్తున్నారు.

క్లెయిమ్ చేయ‌ని డ‌బ్బు

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, బ్యాంకు ఖాతాను ప‌దేళ్ల‌కు మించి ఆప‌రేట్ చేయ‌క‌పోతే అందులో ఉన్న డ‌బ్బు డీఈఏఎఫ్ ఖాతాకు చేరుతుంది. రెండేళ్ల వ‌ర‌కు ఆప‌రేట్ చేయ‌ని ఖాతాను ( వ‌డ్డీ, క‌నీస ఛార్జీలు) ప‌నిచేయ‌ని ఖాతాగా ప‌రిగ‌ణిస్తారు. ఇలాంటి వాటిలోకి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంకు చెక్కులు, పే ఆర్డ‌ర్లు, ప‌రిష్కారం కాని నెఫ్ట్ లావాదేవీలు కూడా వ‌స్తాయి. బ్యాంకు ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా వినియోగ‌దారునికి దీని గురించి స‌మాచారం అందిచాల్సి ఉంటుంది. కానీ, బ్యాంకులు వినియోగ‌దారులకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు వినియోగ‌దారులు వారి వివ‌రాల‌ను, మొబైల్ నంబ‌ర్‌ను అప్‌డేట్ చేయ‌క‌పోవ‌డం కూడా కార‌ణంగా చెప్తున్నారు.

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, ప్రతి బ్యాంకు క్లెయిమ్ చేయని ఖాతాల వివరాలను బ్యాంక్ వెబ్‌సైట్‌లో చూపించాల్సిన అవసరం ఉంది. వెబ్‌సైట్‌లోని వివరాలను ప‌రిశీలించిన‌ తరువాత, ఖాతాదారులు సరిగ్గా నింపిన క్లెయిమ్ ఫారమ్, డిపాజిట్ల రశీదులు, కేవైసీ ప‌త్రాల‌తో బ్యాంక్ శాఖను సంప్ర‌దించి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే ఇంత‌కుముందు ఖాతా ఉన్న బ్యాంకుకే వెళ్లి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు బ్యాంకు ఏ శాఖ‌కు వెళ్లినా క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే బ్యాంకు ఖాతా చాలా పాత‌ది అయితే దానికి మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ స‌దుపాయాలు లేక‌పోతే హోమ్ బ్రాంచ్‌కు వెళ్ల‌డ‌మే మంచిది. ఖాతాదారుడి వార‌సులు లేదా నామినీలు డిపాజిట్ల ర‌శీదులు, ఖాతాదారుడి మ‌ర‌ణ దృవీక‌ర‌ణ ప‌త్రం, మీకు సంబంధించిన గుర్తింపు ప‌త్రాల‌ను తీసుకెళ్లాలి. అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాత బ్యాంకు ఖాతాలోని డ‌బ్బును అప్ప‌గిస్తుంది.

బ్యాంక్ వినియోగ‌దారుల‌కు చెల్లింపు చేసిన తరువాత, అది డీఈఏఎఫ్ ఖాతా నుంచి రీఫండ్ పొందడానికి నెల చివరిలో ఆర్‌బీఐకి క్లెయిమ్ చేస్తుంది. వినియోగ‌దారుడు క్లెయిమ్ చేసుకున్న త‌ర్వాత ఖాతా ఆప‌రేటివ్‌గా మారుతుంది. ఒకవేళ చట్టబద్ధమైన వారసుడు లేదా నామినీ క్లెయిమ్ కోరిన‌ట్ల‌యితే, బ్యాంక్ ఖాతా పరిష్కార ప్రక్రియను ప్రారంభిస్తుంది, దీనికి ఎటువంటి ఛార్జీలు వ‌ర్తించ‌వు.

చివ‌ర‌గా

మీ పెట్టుబ‌డుల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. క్లెయిమ్ చేయ‌ని డిపాజిట్లు పెరిగేందుకు ముఖ్య‌ కార‌ణం, ఖాతాదారులు వారి కుటుంబ స‌భ్యుల‌కు, ద‌గ్గ‌రివారికి కూడా పెట్టుబ‌డులు, డిపాజిట్ల గురించి చెప్ప‌క‌పోవ‌డ‌మే అని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. పెట్టుబ‌డుల వివ‌రాల‌కు సంబంధించిన‌ అన్ని రికార్డుల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. క‌నీసం ఇద్ద‌రికైనా పెట్టుబ‌డుల విష‌యాన్ని తెలియ‌జేయాలి. ఒక‌రు కుటుంబ స‌భ్యులు మ‌రొక‌రు మీకు విశ్వాసం ఉన్న‌వారు కూడా ఉండొచ్చు. మీరు లేక‌పోయినా మీకు సంబంధించిన వారికి డ‌బ్బు చేరేలా ఉండాలి.

డ‌బ్బు సంపాదించేందుకు చాలా శ్ర‌మిస్తారు. మ‌రి క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు ఎవ‌రికి చెంద‌కుండా ఉంటే ఏం లాభం? మీరు ఎవ‌రికోసం కూడ‌బెట్టారో వారికి చేరేలా ప్ర‌ణాళిక‌లు ఉండాల‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట