ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఐకియ ఫర్నీచర్ స్టోర్ ఎలా మొదలైంది..? - పట్టుదల కు నిర్వచనం



17 యేళ్ల యువకుడు 1943 లో స్వీడన్ లో స్థాపించిన సంస్థ IKEA. నాకు తెలిసి ఇలాంటి పేరే ప్రపంచం లో లేదు. మొదటి రెండు అక్షరాలు అతని పేరు (ఇంగ్వర్ క్రాంపార్డ్), మూడవ అక్షరం అతను పెరిగిన వ్యవసాయ క్షేత్రం లో మొదటిది, నాల్గవ అక్షరం అతను పుట్టిన ఊరు లోని మొదటి అక్షరం. అన్నీ కలిపి "IKEA" గా పేరు పెట్టాడు.

బాగా బతికి చెడిన కుటుంభం. మూడు పూటలు తినటానికి అన్నం లేక...5 వ తరగతి చదివేటప్పుడే అగ్గి పెట్టెలు అమ్మేవాడు ఇంగ్వర్. మామూలుగా ఒక అగ్గిపెట్టె కొంటే 25 పైసలు. ఇంగ్వర్ 200 అగ్గిపెట్టెలని బల్క్ లో 10 పైసలు లెక్కన కొని తమ ఊర్లోని వారికి 15 పైసల లెక్కన అమ్మేవాడు. ప్రతి అగ్గిపెట్టె అమ్మకం మీద ఒక పైసా లాభం వచ్చేది. చౌక గా వస్తున్నై అని అందరూ ఇంగ్వర్ దగ్గరే కొనేవారు. చుట్టు ప్రక్కల ఊర్ల నుంచి కూడా జనాలు వచ్చి చిన్న మొత్తం లో కొనేవారు. 

6-10 తరగతి చదివే రోజుల్లో ఫ్రాన్స్ నుంచి 500 పెన్నులు, పెన్సిల్స్ బల్క్ లో కొని చాలా చౌక గా స్వీడన్ లో అమ్మేవాడు. 10 వ తరగతి పాస్ అయినందుకు తండ్రి 1000 రూపాయలు ఇచ్చి కొత్త ప్యాంట్, షర్ట్ లేదా సూట్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే దానితో "IKEA సంస్థ" ని స్థాపించాడు ఆ 17 యేళ్ల యువకుడు. అతను కాలేజీ చదువులు చదవలేదు, యూనివర్శిటీ మొఖం చూడలేదు.

ఆ తర్వాత స్వీడన్ లోనే కాకుండా, నార్వే, ఫిన్ ల్యాండ్ మిగతా ఐరోపా దేశాలు, ఖండాల్లో కూడా ఐకియ స్థాపించాడు. కాలక్రమం లో దక్షిణ అమెరికా తప్ప మిగతా ప్రపంచం అంతా ఐకియ స్టోర్స్ వెలిశాయి. 

ఇంగ్వర్ క్రాంపార్డ్ ప్రపంచం లోని టాప్ 10 సంపన్నులలో ఒకడు. కానీ, బస్ లల్లో నే ప్రయాణిస్తాడు. పాత వోల్వో కార్ లోనే తిరుగుతాడు. తను కూడా ప్రతి రోజూ మార్కెట్ కి పోయి కూరగాయలు కొంటాడు. యూరప్ లోని విమానాలు అన్నింటినీ కొనగలడు. కానీ, విమానం లో సాధారణ టికెట్ కొని ప్రయాణిస్తాడు. ఇలా ఎందుకు అని ఎవరైనా అడిగితే డబ్బు ఉంది కదా అని విచ్చల విడి గా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది, ఇంకా అలాంటి పనులు నాకు ఆనందం వేయవు. మా తాత పెట్టిన ఒక కంపనీ అప్పుల్లో ఉండి తాతయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా.. మా కస్టమర్స్ ఎలా బ్రతుకుతున్నారో నేను అలానే బ్రతుకుతాను అంటాడు ఇంగ్వర్ క్రాంపార్డ్. 

తన ఫర్నీచర్ స్టోర్ లో లభ్యమయ్యేది అంతా కలప నుంచే కాబట్టి, తన వ్యాపారం వలన ఎన్విరాన్ మెంట్ కి తాను కీడు చేస్తున్నాడు అనిపించి 25 వేల ఎకరాలు కొని ఒక అడవినే పెంచాడు ఇంగ్వర్ క్రాంపార్డ్.

IKEA ఫర్నీచర్ స్టోర్ లో ప్రతి కొన్ని సెకండ్ల కి ఒక బుక్ షెల్ఫ్ అమ్ముడుపోతుంది. IKEA లో అత్యంత ఎక్కువు గా అమ్ముడు పోయేవి పుస్తకాలు పెట్టుకునే బుక్ షెల్ఫ్ లు. 

బిలియనీర్ అయ్యాక కూడా సామాన్య జీవితం గడిపే పేదవాడు అని అతడ్ని ప్రపంచం అంతా అంటుంది. కానీ, సంపద లోనే కాదు, వ్యక్తిత్వం లో కూడా ప్రపంచం లో బిలియనీర్ అంటాను నేను. 

గడిచిన 2 వేల సంవత్సరాలలో అత్యంత ఉన్నతమైన వ్యాపార వేత్త ఎవరు అని అడిగితే నేను మాత్రం IKEA ని స్థాపించిన "ఇంగ్వర్ క్రాంపార్డ్" అని చెప్తాను. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి