చదువుకొన్న " వాడు మాత్రమే మేధావా? 'చదువుకొనని ' వాడు మేధావి కాదా? దీనికి మీకు ఒక మంచి ఉదాహరణను అందిస్తాను, చదవండి. ఒక వ్యక్తి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, కృషి, పట్టుదలతో కష్టపడి బాగా డబ్బు సంపాదించి, జీవితంలో బాగా సెటిల్ అయ్యాడు. అతను ఒకసారి అర్జెంటు పని బడి సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఒక టైర్ పంచర్ అయ్యింది. టైర్ మార్చడానికి డ్రైవర్ లేడు. అటు పక్కగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు. ఇక తప్పని పరిస్థితిలో తానే ఎలాగోలా స్టెప్ని టైర్ మార్చడానికి తనే స్వయంగా సిద్ధమయ్యాడు. డిక్కీ లోని టూల్స్, స్టెప్నీ టైర్ బయటకు తీసి, ఎంతో కష్టపడి వీల్ నట్లన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారీ టయర్ నట్ల పైపడి అవన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాయి. సూటు బూటు లో ఉన్న తాను వాటిని తీయలేడు, మరి ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుండగా అటు పక్కగా ఒక వ్యక్తి అక్కడక్కడా చినిగి పోయిన, మురికి బట్టలు వేసుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు. అతడు ఈయన్ని చూసి సార్ మీరు ఎవరు, మీ కారుకు ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ ఇంజనీర్ తాను ఎవరో తన
ఎందరో మానహానుభావులు అక్కడక్కడ అంటే ఎక్కడ పడితే అక్కడ వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి వాటిలో ... తెలుగు లో రాసిన వదిలేసినా వాటిని ఒకచోట చేసే ప్రయత్నం .. 😜😜