ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సరిగ్గా 78 ఏళ్ల క్రితం ఇదే రోజు ..


సరిగ్గా 78 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఆగస్టు 8వ తేదీ)న తెల్లదొరలు దేశాన్ని వీడి వెళ్లిపోవాల్సిందిగా కోరుతూ... #క్విట్ఇండియా నినాదంతో నాటి భారత జాతీయ కాంగ్రెస్ ఓ ఉద్యమాన్ని చేపట్టింది. ఆ చారిత్రక దిన ఫలితమే మనం అనుభవిస్తున్న భారత స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలు. స్వతంత్ర పోరాటం కోసం జాతిపిత మహాత్మాగాంధీ నేతృత్వంలో అనేక ఉద్యమాలు సాగినా.. క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయుల పాలనలో సంచలనం సృష్టించింది. అహింసామార్గంలో సాగిన ఈ ఉద్యమానికి మహాత్మాగాంధి ఇచ్చిన పిలుపుకు మేల్కొన్న జాతి యావత్తు ముందుకు తరలివచ్చింది. దీన్ని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు.

క్రిప్స్ మిషన్ విఫలమైంది, 1942 ఆగస్టు 8 న, బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ డూ ఆర్ డై కి పిలుపునిచ్చాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి "క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ" కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది. 

ఈ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరంభంలో సాత్త్వికంగా కొనసాగిన ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలతో తీవ్రరూపం దాల్చింది. ఆంగ్లేయుల చర్యలను ఏమాత్రం లెక్కచేయక పలు స్వతంత్ర్య సమరయోధులు ఉద్యమాన్ని నిరవధికంగా కొనసాగించడంతో బ్రిటిష్ ఏకాధిపత్యానికి భారత్ తెరదించినట్లైంది. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించడానికి ఒక నెలకు ముందుగానే 1942 జూలై 14వ తేదీ నుంచి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం పూర్తి స్వాతంత్ర్యం లభించాలని తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం ఓ కమిటీని మహాత్మాగాంధీ నియమించారు. గాంధీ ప్రకటించిన ఈ కమిటీని రాజాజీ వంటి ప్రముఖ నేతలు అంగీకరించలేదు. మహమ్మద్ అలీ జిన్నా, భారత్ కమ్యూనిస్టు పార్టీ, హిందూ మహాసభలు కూడా ఈ కమిటీ ఏర్పాటుకు సమ్మతించలేదు. 1942 ఆగస్టు 8 వ తేదీ ముంబైలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించింది. ఇదే రోజు సాయంత్రం ముంబైలోని గోవాలియా ట్యాంక్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మహాత్మాగాంధి, అహింసామార్గంలో ఈ ఉద్యమాన్ని జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


ఆగస్టు 9వ తేదీ ఉదయం ముంబై బహిరంగ సమావేశానికి మూడు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించే నేతలు లేకపోవడంతో, యువ వీరవనిత అరుణా ఆసఫ్ అలీ ఈ కాంగ్రెస్ బహిరంగ సభకు నాయకత్వం వహించారు. ముంబైలో అహింసామార్గంలో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమకారులపై బ్రిటిష్ పోలీసులు లాఠీ ఛార్జీలు ప్రయోగించారు.


ఈ ఉద్యమంలో పాల్గొన్న గాంధి, పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వంటి పలువురు నాయకులను బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి అహమ్మద్ నగర్‌లోని పోర్ట్‌ కారాగారంలో బంధించారు. గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్నీ విచారణనేది లేకుండా జైల్లో వేసింది. బ్రిటిషు వారు నాయకులను అరెస్టు చేసి, వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. లక్షకు పైగా అరెస్టులు జరిగాయి, సామూహిక జరిమానాలు విధించారు, ప్రదర్శనకారులను బహిరంగంగా కొట్టారు. పోలీసులు కాల్పులు జరిపిన సంఘటనల్లో వందలాది మంది పౌరులు మరణించారు. చాలా మంది జాతీయ నాయకులు భూగర్భంలోకి వెళ్లి రహస్య రేడియో స్టేషన్లలో సందేశాలను ప్రసారం చేయడం, కరపత్రాలను పంపిణీ చేయడం, సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం వగైరా చర్యల ద్వారా తమ పోరాటాన్ని కొనసాగించారు. 


దేశంలోని అన్నీ నగరాల్లో ఈ ఉద్యమం ఊపందుకుంది. కార్మికులు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరిపై పోలీసులు లాఠీ ఛార్జీలు, కాల్పులు జరిపడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా క్విట్ ఇండియా పోరాటం రోజురోజుకూ తీవ్రమైందే గానీ.. ఏమాత్రం తగ్గలేదు. ప్రారంభంలో నగర ప్రాంతాల్లో మాత్రమే ఆంరభమైన ఈ ఉద్యమం చిన్నగా గ్రామాలకు సైతం వ్యాపించింది. ఈ ఉద్యమంలో భాగంగా స్వతంత్ర సమరయోధులపై పోలీసులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. దీనితో ఆగ్రహించిన సమరయోధులు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పంటించారు.

ఈ చర్యలతో విద్యుత్, టెలిఫోన్ సేవలకు పూర్తి అంతరాయం కలిగింది. ఈ ఉద్యమంలో యువకులు, విద్యార్థులు కూడా పాల్గొనడంతో పలు చోట్ల తెల్లదొరలపై దాడులు జరిగాయి. తెల్లదొరల కింద పనిచేసే అధికారులు కూడా ఉద్యమకారుల చేతుల్లో చావుదెబ్బలు తిలక తప్పలేదు. దీనితో బ్రిటిష్ ప్రభుత్వం లాఠీ ఛార్జీ, బాంబు దాడులకు తెరదించింది. ఈ పోరాటంలో పాల్గొన్న ఒక లక్షమందిని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. పలు ఉద్యమకారులపై బ్రిటిష్ ప్రభుత్వం కఠినశిక్షలను విధించింది. అయినా ఉద్యమం ఏమాత్రం శాంతించలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజురోజుకి పెరిగిన ఉద్యమం బ్రిటిష్ పాలకుల్లో కొత్త అలజడిని రేకెత్తించింది.

ఈ ఉద్యమాన్ని ఆపేందుకు గాంధీ, నెహ్రూ నాయకులను దక్షిణాఫ్రికాకు తరలించి అక్కడి జైళ్లలో బంధించేందుకు తీర్మానించింది. ఈ వార్తలు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా మార్చాయే గానీ.. ఏమాత్రం తగ్గలేదు. మహాత్మాగాంధీ జైల్లో ఉన్న సమయంలో ఆయన భార్య కస్తూరి గాంధీ మరణించారు. గాంధీ ఆరోగ్యం కూడా క్షీణదశకు చేరుకుంది.

బ్రిటిష్ ప్రభుత్వం నిర్భంధించిన స్వతంత్ర సమరయోధులను విడుదల చేయాలని కోరుతూ గాంధీ చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష విజయవంతమైంది. ఈ విజయమే బ్రిటిష్ ప్రభుత్వానికి చివరికి పరాజయంగా మారింది. 1857 సంవత్సరం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు, 85 సంవత్సరాలకు అనంతరం క్విట్ ఇండియా ఉద్యమాలు బ్రిటిష్ పాలనకు తెరదించాయి. ఐదేళ్ల తదనంతరం అదే ఆగస్టు నెలలో భారత్‌కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చింది.

క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్వర్ణోత్సవానికి గుర్తుగా 1992 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి స్మారక నాణెం జారీ చేసింది. Credit:అరుణాచలం, Telegram User

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి