ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మనుషుల్లో మనీషి...

 మనుషుల్లో మనీషి....!!

నేను రోజూ మార్నింగ్ వాక్ కి వెళ్తూ అనేకమందిని గమనిస్తూ ఉంటాను...

ఒక 65...70 ఏళ్ల మధ్య వయసున్న ఒకాయన రోజూ తెల్లటి ప్యాంటు తెల్లటి షర్టు వేసుకుని చేతిలో ఒక గుడ్డ సంచీ తో కొంచెం కష్టం గానే నడుస్తూ కనపడతారు...భారీకాయమే...!!


ఆయనే నడవలేనపుడు చేత్తో రోజూ ఆ బరువైన సంచీ ఎందుకో అనిపించేది....


ఒక సారి నేను లేట్ గా వెళ్ళినప్పుడు చూసాను..ఆయన ఖాళీ సంచీని మడతపెట్టి చంకలో పెట్టుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు....


సరే ఒకసారి పొద్దున్నే ఆయన వెనకే వెళ్ళాల్సి వచ్చింది..సరే ఆయన ఏమి చేస్తారో చూద్దామని డిసైడ్ అయిపోయి ఫాలో అయ్యాను....


మాకు పార్కులో ఒక lake వస్తుంది మొదట...అందులో చేపలు విపరీతంగా ఉంటాయి...బాతులు కూడా...
ఆయన తన బరువైన సంచీలోంచి ఒక పాకెట్ తీసి అందులో బ్రెడ్ తీసి చిన్న చిన్న ముక్కలు చేసి lake.లో వేశారు...పెద్ద పెద్ద ముక్కలు చేసి గట్టుమీద ఉన్న కుక్కలకు వేశారు...అలాగే biscuits కూడా...


ఇంకొంచెం దూరం నడిచి పెద్ద పెద్ద చెట్ల దగ్గర ఆగి సంచీ లోంచి ఇంకో పొట్లం తీసి అందులోంచి గుప్పెళ్లతో బియ్యపు పిండి తీసి చెట్ల చుట్టూరా... తొర్రల్లో చల్లాడు...
తర్వాత చీమల పుట్టల దగ్గర ఆగి బియ్యపు రవ్వ చల్లాడు....
గుంపుల గుంపులు గా ఉన్న పావురాళ్ళకి జొన్నలు తీసి జల్లాడు....
తరువాత ఉడతలు ఎక్కువగా తిరిగే ప్లేసులో వేరుశెనగ గింజలు జల్లాడు....
అలాగే చిలకల కోసం అక్కడ ఎత్తైన ప్రదేశం లో కూడా nuts ఏవో వేసాడు....


ప్రతీ చెట్టు మొదట్లో పిండి..రవ్వలు జల్లుకుంటూ పార్క్ అంతా ఆయాస పడుతూ తిరిగి సంచీ ఖాళీ చేసుకుని వెళ్లిపోతున్నారు...


నాకు అర్ధమయ్యింది ఏంటంటే ఆయన నడక కోసం రావట్లేదు....కేవలం క్రిమి కీటకాదులకి...పశు పక్ష్యాదులకి ఆహారం ఇవ్వడానికి మాత్రమే వస్తున్నారు....
అదే ఆయన ధ్యేయం....
నేను నిజంగా ఇలాంటి మనుషులుంటారా అని ఆశ్చర్య పోయాను...తెలియని అనుభూతికి గురి అయ్యాను...
ఇదే రొటీన్ ఆయనది 365 రోజులూ....
ఒకరోజు అక్కడ ఒక ఆమె అడుక్కుంటుంటే ఆయన సంచీలోంచి ఒక బన్ తీసి ఆమెకి ఇచ్చి ముందుకు పోయారు...
నేను చూస్తూనే ఉన్నాను ఆమె అతను వెళ్లిపోగానే ఆ బన్ ని చెట్లలోకి విసిరి కొట్టింది...
పాపం ఆయన కి ఇదేమీ తెలియదు...తనపనిలో తను వెళ్ళిపోయాడు...
నేను ఆ బిచ్చగత్తెను అడిగాను...ఎందుకు అలా పారేశావు... తప్పుకదా...అని...
దానికి ఆమె నాకు అది ఇష్టం ఉండదు అంది...
నాకు చాలా కోపం వచ్చి... ఇష్టం లేకపోతే తీసుకోకమ్మా...ఒకవేళ తీసుకున్నా అలా పడేయకూడదు తినే పదార్థాలు.. కుక్కలకు పెట్టు...నీలాంటి వాళ్ళకి ఇవ్వు..అని చివాట్లు వేసాను...
అప్పటికే ఆయన చాలా దూరం వెళ్లిపోయారు అన్ని జీవాలకీ ఆహారం అందిస్తూ...నేను పరుగున వెళ్లి ఆయన్ని
అందుకుని...
Sir మీ ఫోటో తీసుకోవచ్చా అని అడిగాను...


ఎందుకమ్మా అని ఆశ్చర్యంగా అడిగారు...ఆయన తెలుగు ఆయన కాదు ...హిందీ మాతృభాష...
నేను నాకు వచ్చీ రాని హిందీలో నా భావాన్ని ఆయనకి కమ్యూనికేట్ చేయగలిగాను...


" మీ సేవ నేను రోజూ చూస్తున్నాను సర్...మీరు ఒక అద్భుతం..." అని అంటుండగానే...
ఆయన అన్నారు...అమ్మా ఇది నా గొప్పతనం కాదు...దేవుడు నాచేత ఇలా చేయిస్తున్నాడు... సంకల్పం ఆయనది...


నా కన్నా ఎక్కువగా దాన ధర్మాలు చేసే వాళ్ళున్నారు లోకంలో...ఎందరో మహానుభావులు ఉన్నారు...
మా నాన్నగారు చెప్పేరమ్మా...నీ సంపాదనలో 60% నువ్వు ఖర్చు పెట్టుకో...మిగిలిన 40% దానం చెయ్యి అని....అదే నేను follow అవుతాను...


నేను మా నాన్నగారిని అడిగాను...ఒకవేళ నాదగ్గర రెండు బ్రెడ్ slices ఉండి... నేను నా బిడ్డా తినాల్సి వస్తే ఏమి చెయ్యాలి అని...
ఆయన అన్నారు...అందులో 60%తిని మిగిలింది ఎవరికైనా పెట్టు అని...
నేను అదే ఫాలో అవుతున్నాను....ఈ బుల్లి బుల్లి చీమలకి...పురుగులకి...మిగిలిన జీవులకి ఆహారం ఎలా అమ్మా...వాటికి దేవుడు నా ద్వారా అందిస్తున్నాడు...నేను నిమిత్తమాత్రుడిని
అని చెప్పి ముందుకు వెళ్లిపోయారు తన పనిలో గబగబా....


మన మధ్య గుర్తింపు లేకుండా ఎంతో మంచిపనులు చేసే గొప్ప వ్యక్తులు ఎంత నిరాడంబరంగా జీవించేస్తున్నారో కదా...
వాళ్ళు ఏదీ ఆశించడం లేదు...
5 రూపాయలు దానం చేసి 100 మందికి చెప్పే వాళ్ళున్నారు...
దానం చేస్తూ ఫోటోలు తీయించుకుని publicity చేయించుకునే వాళ్ళున్నారు...
రోడ్ మీద అర్ధరాత్రి ఒక van లో దుప్పట్లు వేసుకుని road సైడ్ పడుకున్న వాళ్ళమీద దుప్పట్లు కప్పుకుంటూ calm గా వెళ్లిపోయేవాళ్ళున్నారు...


ఒకాయన వేడి వేడి గా pongal వండించి పెద్ద can లో పెట్టుకుని park బయట గేటు దగ్గర కూర్చుని అక్కడ
ఉన్న బీదా బిక్కీ అందరికి ఆకులో పొంగల్ వడ్డించి పచ్చడి వేసి ఇవ్వడం కూడా నేను చూసాను...
సాటి మనుషులకు సేవ ఒక ఎత్తు...


కానీ ఈ మూగ జీవాలకి ఆహారం అందించడం ఒక ఎత్తు...
నేను ఆయనతో మాట్లాడటం ఒక మరిచిపోలేని అనుభవం....
ఇలాంటి వాళ్ళకి నమస్కరించడం తప్ప ఏమి చేయగలం...??
ఆయన తో ఫోటో నాకు ఒక పెద్ద సెలెబ్రిటీ తో ఫోటో తీయించుకున్నంత విలువైనది...


ఒక మిత్రుడు పంపించింది మీకు పంపుతున్నాను.

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

శివతత్వం - పాము, అగ్ని, భూతపిశాచాలు

శివశంకరన్ కంచి మఠానికి చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు. ”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అ