ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బ్లడ్ గ్రూపులను కనిపెట్టి మానవాళికి ఎంతో మేలుచేసిన శాస్త్రవేత్త - కార్ల్ లాండ్ స్టీనర్

మానవ రక్తంలో ప్రధానంగా ఉండే A B, O అనే మూడు ప్రధాన గ్రూపులను గుర్తించి వైద్యశాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించిన శాస్త్రవేత్తగా కార్ల్ లాండ్ స్టీనర్ సుప్రసిద్ధుడు. ఆస్ట్రియాలోని వియన్నాలో 1868 జూన్ 14న జన్మించారు కార్ల్. ఇవాళ రక్త మార్పిడి ద్వారా ఎన్నో ప్రాణాలు నిలుస్తున్నాయంటే అది ఆయన చలవే. అందుకే 1930లో వైద్యశాస్త్రంలో ఆయన నోబెల్ పురస్కారాన్ని పొందారు. ఈయనది O గ్రూప్1891లో వియన్నా యూనివర్సిటీ నుంచి ఎం.డి. పట్టా పొందిన ఆయన ఐరోపాలో పలువురు పేరుపొందిన శాస్త్రవేత్తల దగ్గర ఆర్గానిక్ కెమిస్ట్రీని అధ్యయనం చేశారు. తిరిగి వియన్నా యూనివర్సిటీకి వచ్చి తనకెంతో ఇష్టమైన ఇమ్యునాలజీ రంగంలో పరిశోధనలు చేసి, 1901లో మానవ AB O బ్లడ్ గ్రూప్ వ్యవస్థ గురించి ప్రచురించారు. ఆ కాలానికే ఇద్దరు వ్యక్తుల రక్తాన్ని మిశ్రమం చేస్తే రియాక్షన్ వస్తుందనే విషయం తెలిసినా, దానికి కారణమేంటనే విషయం తెలీదు. భిన్న వ్యక్తులకు చెందిన రక్తం కలిసినప్పుడు ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే కొన్ని యాంటీజెన్స్ వల్ల రియాక్షన్స్ వస్తాయని వెల్లడించిన కార్ల్, ఆ యాంటీజెన్ను A, B, C (తర్వాత దీన్ని O గా మార్చారు)గా గుర్తించారు. ఆ తర్వాతి ఏడాదే మరో బ్లడ్ గ్రూపును గుర్తించారు. అదే AB,  A బ్లడ్ గ్రూప్ వ్యక్తికి B బ్లడ్ ను ఎక్కిస్తే, అతని నిరోధక వ్యవస్థ B యాంటీజెన్ను గుర్తించదనీ, ఫలితంగా అవి ఇన్ఫెక్షన్కు గురిచేసి, ప్రమాదకరంగా పరిణమిస్తాయనీ కార్ల్ కనిపెట్టారు. దాంతో ఒక బ్లడ్ గ్రూప్ కు చెందిన వ్యక్తికి అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తేనే ప్రయోజనం ఉంటుందని ఆయన తేల్చారు. 

అప్పట్నుంచే రక్త మార్పిడి ప్రక్రియ మొదలై వైద్యశాస్త్ర రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేసింది. మానవ బ్లడ్ గ్రూప్లపై అధ్యయనంతో సరిపెట్టలేదు కార్ల్. సైన్సు ఇతరత్రా కూడా కీలక సేవలందించారు. రుమేనియా శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ లెవడిటితో కలిసి పోలియో వ్యాధికి కారణమైన సూక్ష్మజీవిని ఆయన కనిపెట్టారు. అలా పోలియో వాక్సిన్ వృద్ధికి ఆయన పునాది వేశారు. అంతేనా ! సిఫిలిస్ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవుల్ని గుర్తించడంలోనూ ఆయన తోడ్పాటునందించారు. తన పరిశోధనల సారాంశాన్ని ఆయన 'ద స్పెసిఫిసిటీ ఆఫ్ సెరొలాజికల్ రియాక్షన్స్' (1986) పేరుతో ప్రచురించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 1943 జూన్ 26న ఆయన మృతి చెందారు.

Credits: శర్మ గారు, మనం పత్రిక సౌజన్యంతో...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట