ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆక్సిజన్‌ పెట్టారా? లేదా?

పెట్టామని మీరంటే.. లేదని బాధితుడు వీడియో తీసి పంపారు చెస్ట్‌ ఆస్పత్రిలో రోగి రవికుమార్‌ మృతిపై హైకోర్టు ఆగ్రహం వైద్య నివేదికలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం


 హైదరాబాద్‌: ‘‘కరోనాతో బాధపడుతున్న రోగి రవికుమార్‌కు ఆక్సిజన్‌ పెట్టామని చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ చెబుతున్నారు. తనకు ఆక్సిజన్‌ మాస్కు తొలగించారని, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. మళ్లీ పెట్టాలని కోరినా పట్టించుకోలేదని రవికుమార్‌ వీడియో తీసి పంపారు. ఇందులో ఏది నిజం. ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో తెలుసుకునేందుకు పోలీసు దర్యాప్తునకు ఆదేశించాలా?’’అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే రవికుమార్‌ మృతి చెందారంటూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు బొల్గం యశ్‌పాల్‌గౌడ్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.

రవికుమార్‌ గుండె సంబంధవ్యాధితో చనిపోయారని, వైద్యం అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. రవికుమార్‌కు సంబంధించిన వైద్య నివేదికలు సమర్పించారా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా లేదని సమాధానమిచ్చారు. కొంత సమయం ఇస్తే రికార్డులు సమర్పిస్తామని చెప్పగా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం లేదని తామెలా భావించాలి? నిబంధనల మేరకు కరోనా రోగికి అందించాల్సిన అన్ని చికిత్సలు చేశామంటున్నారు.

మరి వైద్యనివేదికలు మా పరిశీలనకు ఎందుకు ఇవ్వడం లేదు ?’’అని ధర్మాసనం ప్రశ్నించింది. అదే ఆస్పత్రిలో మరో రోగి కూడా వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయారని, అతడు కూడా చనిపోయే ముందు వీడియో తీసి పంపారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రియాంకా చౌదరి నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం..రవికుమార్‌కు సంబంధించిన వైద్య నివేదికలను సమర్పించాలని చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశిస్తూ...విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

శివతత్వం - పాము, అగ్ని, భూతపిశాచాలు

శివశంకరన్ కంచి మఠానికి చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు. ”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అ