ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మొదటి మహిళా హౌస్ సర్జన్ - A lady of many first - ముత్తులక్ష్మీరెడ్డి

ఆడపిల్ల అంటే గడపదాటనీయనిరోజులవి. అందులో ఒకదేవదాసి కుటుంబంలో పుడితే ఇక పరిస్థితులు ఎలావుంటాయో ఊహించవచ్చు. అలా దేవదాసీ కుటుంబంలో 30 జూలై 1886 లో పుట్టింది ఆ అమ్మాయి. దేవదాసీగా తన అమ్మ అనుభవిస్తున్న బాధలను కళ్ళారా చూస్తూ పెరిగింది. అందుకే దేవదాసీవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని చిన్నతనంలోనే అనుకుంది...      తను చదువుకుంటానంటే అమ్మ ఒప్పుకోలేదు.కానీ తండ్రి నారాయణస్వామి కూతురును ప్రోత్సహించి పాఠశాలలో చేర్చాడు.మొట్టమొదట "BOYS" స్కూల్ లో జాయిన్ అయిన మొదటి బాలిక ఆమే. 13 సంవత్సరాలకే అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో పదవతరగతిలో ఉత్తీర్ణత సాధించింది..1912లో మద్రాసు మెడికల్ కాలేజ్ నుండి పట్టాపొంది ..కొన్ని నెలలు హౌస్ సర్జన్ గా చేసింది.భారత్ లో "మొదటి మహిళా హౌస్ సర్జన్" ఈమె. ఉన్నత విద్యకై ఇంగ్లండ్ వెళ్ళివచ్చింది. శేఖర్ రెడ్డి అనే డాక్టర్ ను వివాహం చేసుకోవడంతో అప్పటి వరకు "ముత్తులక్ష్మి"గా వున్న ఆమె ముత్తులక్ష్మీరెడ్డిగా పేరుగాంచింది.

      సరోజీనాయుడిగారితో కలిసి అనేక మహిళా ఉద్యమాలలో పాల్గొన్నది.. పేద బాలికలకు,వృద్ధ మహిళలకు "అవ్వైహోం" అనే అనాధశరణాలయంను స్థాపించింది. బాలికల కోసం పాఠశాలలను స్థాపించింది. ముఖ్యంగా దేవదాసీల పిల్లలకోసం స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది.ఆమె సేవలను గుర్తించిన అప్పటి భారతప్రభుత్వం ఆమెను1927 లో శాసనమండలికి నామినేట్ చేసింది. భారతదేశంలో తొలిమహిళా యం.యల్ .ఏ. గా గుర్తింపుపొందింది. 1931 లో స్త్రీధర్మ అనే పేరుతో ఒక మహిళా సంస్థను నెలకొల్పారు. తన చెల్లికి క్యాన్సర్ సోకినప్పుడు బ్రిటన్ లో తనే దగ్గరుండి సేవలుచేసి బతకించుకుంది. కేన్సర్ వల్ల పేదలెవరూ  బాధపకూడదని 1954 లో అడియార్ దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించించారు. ఇదే ప్రఖ్యాత  "అడియార్ క్యాన్సర్ హాస్పటల్ "....

       "A lady of many first" గా పేరుగాంచిన ముత్తులక్ష్మీరెడ్డిగారు స్త్రీలహక్కులకోసం,వారి మీద జరిగే సాంఘికదురాచారాలపై అలుపెరగని పోరాటంచేసారు. సరోజీనీదేవి,దుర్గాబాయ్ దేశముఖ్ ,అనిబీసెంట్ వంటి మహిళా ఉద్దండులతో కలిసి పనిచేసారు. 1956లో భారతప్రభుత్వం "పద్మవిభూషణ్ "తో సత్కరించింది.ఆమె 133 జయంతిని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం ఈరోజును "హాస్పిటల్ డే" గా జరుపాలని అధికారికంగా ప్రకటించింది. తమిళ రాష్ట్రంలో ఒక తెలుగుమహిళకు లభించిన అరుదైన గౌరవం ఇది!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట