ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇదే జీవన విజయసూత్రం - ఏమిటి ?మనిషి గొప్పవాడు కావాలని నిరంతరం కలలు కంటుంటాడు. ధనాశ కలిగినవాడు కుబేరుణ్ని మించి పోవాలనుకుంటాడు. అధికారదాహం కలవాడు అత్యున్నతస్థాయి కుర్చీని ఆక్రమించుకోవాలనుకుంటాడు. జ్ఞాని పరమజ్ఞానిగా, సాధకుడు సిద్ధుడిగా, శూరుడు యోధుడిగా, వైద్యుడు ధన్వంతరి సమంగా... ఇలా ఉంటాయి ఆశల కలలు. కలలు వేరు, వాస్తవం వేరు.
ధాన్యాన్ని సంచుల్లోనే ఉంచుకుని, పదింతల పంటకోసం కలలు కనడం ఎంతవరకు సబబు? హలాలతో పొలాలు దున్ని భూమాతను నమ్ముకుని తగినంతగా కృషి చెయ్యాల్సి ఉంటుంది. కలలు కృషితో జత కలిసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగి తన ప్రజ్ఞకు పదును పెట్టుకుంటూ, అంకితభావంతో పనిచేసినప్పుడే పదోన్నతులు లభిస్తాయి. తన కళ్లముందు తనకంటే వెనకవాళ్లు అభివృద్ధి సోపానాలు ఎక్కుతుంటే అసూయతో రగిలిపోవడం మన ఆరోగ్యానికే చేటు. అలాగే విద్యార్థులు కూడా. అమూల్యమైన సమయాన్ని ఆటపాటలు, వినోదాలతో వ్యర్థం చేసుకుంటే ఉత్తీర్ణతే కష్టం కావచ్చు. ఇక ఉన్నతశ్రేణికి అవకాశం ఎలా ఉంటుంది? గతించిన కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కిరాదు. సర్వసమర్థుడైన భగవంతుడైనా కాలాన్ని వెనక్కితిప్పడు. కోట్లాది రూపాయలు గుమ్మరించినా గతించిన క్షణాల్ని తిరిగిపొందడం అసాధ్యం. కానీ, చాలామంది ఈ సత్యాన్ని గమనికలోకి తీసుకోరు.

‘నేను చాలా తప్పులు చేశాను. తల్లిదండ్రుల్ని హింసలుపెట్టాను. ఒక్కసారి వారికి మళ్ళీ సేవలు చేసే అవకాశం ఇవ్వు భగవంతుడా’ అని ఎంత మొత్తుకున్నా- పోయినవాళ్లు మళ్ళీ ప్రత్యక్షం కారు.
*సమయం మన చేతుల్లో ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ధనం పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు చెయ్యాలి*. యౌవనంలో ఉండగానే తీర్థయాత్రలు చేయాలి. *బాలుడిగా ఉన్నప్పుడే శ్రద్ధగా విద్యాభ్యాసం చేయాలి. మనసు మనమాట వినే సమయంలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి. మంచిచెడుల విచక్షణ కల్పించే జ్ఞానాన్ని సదా రక్షించుకోవాలి

కుబేరుడు శ్రీనివాసుడికి రుణం ఇచ్చిన కథ ఉంది. అంతటి ధనసంపన్నుడూ ఎవరికీ ఎక్కడా దానధర్మాలు చేసిన కథలు కనిపించవు. అందువల్ల కుబేరుడికి భక్తులుండరు. సిరుల దేవత శ్రీమహాలక్ష్మిని ఎందరో ఆరాధిస్తారు. ఆ తల్లి చల్లనిచూపు పడితే చాలనుకుంటారు. ఎందుకంటే ఆ మహాదేవి అనుగ్రహమే అమోఘదానంతో సమానం.

ప్రపంచంలో కుబేర సమానులెంతమంది ఉన్నా- సత్కార్యాలు, దానధర్మాలు చేయనిదే వాళ్లకు గుర్తింపు ఉండదు. కాబట్టి, తన సంపదను పంచడంతోపాటు, తోటివారిని ఆదుకునే తత్వాన్ని పెంచుకోవాలి! అవధులెరుగని దాత అనిపించుకోదగినవాడు భగవంతుడొక్కడే. ఆయన దాతలకే దాత.ఎదుగుదలను భౌతికంగా, సిరిసంపదలు, అధికారహోదాలకు, విద్యాధిక్యత, జ్ఞానసంపదకు ముడిపెట్టుకున్నంత కాలం మనిషి సత్యానికి దూరంగా ఉంటాడు.

అసలు సత్యమేమిటంటే, మనలోని సంస్కారం ఒక్కో మెట్టు ఎదగాలి. సంపూర్ణ సంస్కారవంతుడికి ఎవరి ఎదుగుదలపట్లా అసూయ, ద్వేషాలు ఉండవు. తులసి మొక్క సర్వలోకపూజిత. అది ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుంది. తాడిచెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. కానీ, తులసి మొక్క పవిత్రత ముందు అది ఎందుకూ కొరగాదు. అభివృద్ధి సోపానాలు ఎక్కడానికి ఆరాటపడటం కంటే మన అర్హతలు పెంచుకునేందుకు కృషిచేయడం చాలాముఖ్యం. ఎవరో మనల్ని మించిపోతున్నారనే దుగ్ధ మన ఎదుగుదలకు ప్రధాన అవరోధం కనుక, ఆ భావాన్ని మనలోకి రానివ్వకూడదు. మనం మనంగానే ఉండాలి. మనకు లభించాల్సినవి లభిస్తూనే ఉంటాయి. పెరగాల్సింది సంస్కారం. మరేవీ కావు. ఇదే జీవన విజయసూత్రం! 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి