ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ

నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి.

1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. 
ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.

2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.

3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. 
నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని.

 

ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో 

 1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో. నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా !

2. ఏ ఒకరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండి తీరవలసినది ఏదీ లేదని మరచిపోకు. ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.

3. జీవితం చిన్నది. ఒక రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.

 4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన. కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది, కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనించు.
ప్రేమ సౌందర్యాన్ని , అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో 

5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు. దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో. 

7. నువ్వు నీ మాట నిలబెట్టుకో, ఇతరులనుంచి ఇది ఆశించకు. నువ్వు అందరితో మంచిగా ఉండు, అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పవు. 

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము. 

9. అది ఎంతకాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!

. నాన్న ...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి