ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వూహానులొ పుట్టింది - ఊరంతా పాకింది


రచన:గడ్డం.శంకర్
ఎస్. తెలుగు
జి.ప.ఉ.పా ఆకునూర్
సైదాపూర్,కరీంనగర్

స్వగ్రామం;శ్రీరాములపల్లి
మం:కమలాపూర్
జిల్లా:వరంగల్ అర్బన్

*కరోనా-*

వూహానులొ పుట్టింది
ఊరంతా పాకింది
లక్షలాది ప్రాణాలను
కసిబూనీ తీసింది 01

ఆరడుగల దూరము
పాటిస్తే ఫలితము
నిర్లక్ష్యము చేసినచో
కోవిడుకు చిక్కుతము 02

మాస్కు మరిచిపోవద్దు
ముక్కుమూతి ముట్టొద్దు
నిరతము జనులంతా
కరముకడుగుటాపద్దు 03

గుంపులుగ తిరగవద్దు
ఫంక్షన్లకు పోవద్దు
ప్రభుత్వ నియమాలను
పెడచెవిన పెట్టవద్దు 04

పరిశుభ్రత పాటిస్తే
నియమాలనాచరిస్తే
అంటుకోదు కరోనా
నిరంతరం కాపుగాస్తె 05

మనవాళ్ళని కలవాళ్ళని
చూడద్దూ కలవాలని
అవకాశముకై వేచెను
కోవిడు నిను చేరాలని 06

బలవర్ధక ఆహారం
స్వస్థతకీ శ్రీకారం
మరవకుంట తింటనే
కలలన్నీ సాకారం 07

ఆధునికత పేరిట
ఆరోగ్యము కటకట
విశృంఖల చర్యలే
కోవిడుకు మూలమట 08

మందులేని రోగము
అంటుకుంటె ఆగము
ఎదుర్కొనుటకు రోగాన్ని
కావలెనోయ్ ధైర్యము 09

కులం లేదు మతంలేదు
చిన్న పెద్ద తేడలేదు
అందరిని సమానంగా
అంటుకొనుట ఆపలేదు 10

ఒకరినొకరు చూడకుండ
ఓదార్పును ఇవ్వకుండ
ఇంటినబంధించుచుండె
కోవిడిపుడు కదలకుండ11

విజ్ఞానం యెంతవున్న
విధిరాతను ఆపదన్న
చేసినట్టి తప్పులకు
శిక్షపడక తప్పదన్న 12

కనీవినీ యెరుగనిది
జీవితాన మరువనిది
పగబట్టి ప్రాణాలను
తీయకుంట వొదలనది 13

ఆర్థిక వ్యవస్థనలను
చేసేను పరేషాను
కోలుకోని దెబ్బతీసె
కోవీడు పాడుగాను 14

ఉద్యోగమూడిపోయె
బతుకేమొ భారమాయె
పరిశ్రమలు మూతబడి
ఉపాధిపుడు కరువాయె 15

పట్నాన్నీ విడిచినారు
పల్లెబాట పట్టినారు
కూలినాలి చేసుకుంటు
కుటుంబాన్ని సాదినారు 16

చదువులన్ని ఆగిపాయె
చురుకుదనం తగ్గిపాయె
సెల్లుఫోను పట్టుకొని
సొల్లంతా చెప్పుడాయె 17

కరములెపుడు కలపవద్దు
నమస్కారం మరవద్దు
ఏమైతదిలే అని
దాటవద్దూ నీ హద్దు 18

పల్లెదారి పట్టింది
దంష్ట్రికలను చాచింది
అంతట నేనంటూ
ఉగ్రరూపం దాల్చింది 19

ఊపిరాడనీయకుండ
జ్వరమన్నది తగ్గకుండ
ఉక్కిరిబిక్కిరి జేయు
అంటుకుంటె వదలకుండ 20

ఆయుర్వేద పద్దతులు
పాటించెను నేడుజనులు
గతమెంతో ఘనమని
తెలుసుకున్న మేధావులు 21

కొత్తవ్యాధి వచ్చింది
కొరివి దయ్యమయ్యింది
కోట్లాది జనులందరి
ఒంటిలోకి చేరింది 22

ప్రయాణాలు చేయవద్దు
ప్రమాదంలో పడవద్దు
కరోనా ప్రళయంలో
చిక్కి శల్యం కావద్దు 23

వ్యాయమం చెయ్యిలి
మద్యాన్నీ మానాలి
ధూమపానమొదిలేసి
శుభ్రంగా ఉండాలి 24

వేడినీరు తాగాలి
ఫలములెన్నో తినాలి
ఆకుకూర వంటలతో
ఆరోగ్యంగుండాలి 25


వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

శివతత్వం - పాము, అగ్ని, భూతపిశాచాలు

శివశంకరన్ కంచి మఠానికి చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు. ”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అ