ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రేమలో పడ్డారా ! ఈ లక్షణాలున్నాయేమో చూచుకోండి.

యవ్వనదశలో ప్రేమలో పడ్డాం, గాఢంగా ప్రేమించుకొంటున్నాం. 

ప్రేమే జీవితం

ప్రేమే శాశ్వితం

ఒకరిని విడిచి మరొకరు ఉండలేం.

మాకు కులంతో పనిలేదు, మతంతో పనిలేదు. కనిపెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పినఅమ్మనాన్నలు వద్దు,అభిమానించే అన్నదమ్ములు వద్దు,మంచిని చెప్పే సావాసగాళ్ళు వద్దు, మమ్మల్ని ఎవరు విడదీయలేరని భావిస్తున్నామని అంటారా !

మీ ఇష్టం.


ఇలావుంటే మీది ప్రేమకాదు, ఆకర్షణే.

ఈ ఆకర్షణ తప్పకుండా పెండ్లికి దారితీస్తే ఇందులో success rate ఎంత ?

ఎంతోతెలుసా కేవలం 18% మాత్రమే. 

ఆకర్షణ తగ్గిపోగానే వాస్తవవిషయాలు తెలియగానే, కుటుంబ పరిస్థితులు అవగతంకాగానే 

కట్టుకొన్నవారి మనస్తత్వం తెలియగానే కాళ్ళకింద భూమి కంపిస్తుంది.

ఏం చేయలేం. కట్టుకొన్నవారిని వదలలేరు. అలాగని రాజీపడలేరు. జరిగినదానికి వగచివగచి,అంగలారుస్తూ, మనశ్శాంతిలేక బతుకుబండి ఈడ్చాలి.

పిల్లోజల్లో పుడితే అదో జంజాటం.


ఇంక ఎక్కువగా వద్దుకాని మీ ప్రేమను మీ అమ్మనాన్నలు అంగీకరిస్తేనే పెండ్లి చేసుకోండి, లేకుంటే వద్దేవద్దు. కొందరు లవ్ పేరుతో వలపన్ని తమ మతంలోకి మార్చుకొంటున్నారు. ఇలాంటి ప్రేమవ్యవహారాలలో జాగ్రత్త అవసరం.


ప్రేమలో కాదుకాదు ఆకర్షణలో పడితే మీ పరిస్థితి ఎలా వుంటుందో పెద్దలు ఇలా సెలవిచ్చారు. వీటినే దశవిధ మన్మథావస్థలని అన్నారు.


(1) చూచుట... ఎప్పుడు వారిని చూడాలని అనుకోవడం.

(2) మనస్సంగమం... మనసులో ఊహించుకోవడం. పెండ్లి చేసుకొన్నట్టు, సంసారం సాగిస్తున్నట్టు.కొందరు మానసిక వ్యభిచారం కూడా చేస్తారు.

(3) తలంపు... తిన్నా, పడుకొన్నా, పనిలోవున్నా వారి తలపులే మనసులో వుంటాయి.

(4) జాగరం... ఎవేవే ఊహలతో నిద్రరాకపోవడం

(5) కృశించుట... తినకుండా, నిద్రపోకుండా, అలసటతో నశించడం

(6) అన్యవస్తు విముఖత... నాకు జీవితంలో ఏ భోగభాగ్యాలు వద్దు.కార్లు వద్దు, ఇండ్లువద్దు.నాకు ప్రేముంటే చాలు అనుకోవడం.

(7) సిగ్గులేమి... సిగ్గులజ్జ వదిలేసి ప్రేమపేరుతో సిస్సిగ్గుగా తిరగటం. ఎవరు ఎమనుకొంటే నాకేం ఎక్కడబడితే అక్కడ తిరుగుతారు కుడా.

(8) ఉన్మాదం... ప్రేమపేరుతో పిచ్చోడిలా తిరగడం, ఉన్మాదిగా మారి అందరిని ఎదిరించడం, తిట్టడం, కొట్టడం చేస్తారు.సైకోగా మారటం.

(9) మూర్ఛ... ప్రేమకు పరాకాష్ఠ తెలివిలేకుండా ప్రవర్తించడం.జ్ఞానం కోల్పోవడం.కొండకచో తెలివి తప్పిపడిపోవడం కూడా జరుగుతుంది.

(10) చావు... పెద్దలు ఒప్పుకోలేదని చచ్చిపోవడం.చావడం అవసరమా ? అమ్మనాన్నలు ఇచ్చిన నిండు నూరేళ్ళ జీవితాన్ని చాలించడం భావ్యమా ?


పై లక్షణాలలో కొన్ని కొందరికి రావచ్చు. లేదా అన్ని రావచ్చు.CREDITS: జి.బి.విశ్వనాథ.. అనంతపురం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు.  తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు. ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు. నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిట