ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

తెలివి ఎవడబ్బ సొత్తు?_

  చదువుకొన్న " వాడు మాత్రమే మేధావా? 'చదువుకొనని ' వాడు మేధావి కాదా? దీనికి మీకు ఒక మంచి ఉదాహరణను అందిస్తాను, చదవండి. ఒక వ్యక్తి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, కృషి, పట్టుదలతో కష్టపడి బాగా డబ్బు సంపాదించి, జీవితంలో బాగా సెటిల్ అయ్యాడు. అతను ఒకసారి అర్జెంటు పని బడి సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఒక టైర్ పంచర్ అయ్యింది. టైర్ మార్చడానికి డ్రైవర్ లేడు. అటు పక్కగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు. ఇక తప్పని పరిస్థితిలో తానే ఎలాగోలా స్టెప్ని టైర్ మార్చడానికి తనే స్వయంగా  సిద్ధమయ్యాడు. డిక్కీ లోని టూల్స్, స్టెప్నీ టైర్ బయటకు తీసి, ఎంతో కష్టపడి వీల్ నట్లన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారీ టయర్ నట్ల పైపడి అవన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాయి. సూటు బూటు లో ఉన్న తాను వాటిని తీయలేడు, మరి ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుండగా అటు పక్కగా ఒక వ్యక్తి అక్కడక్కడా చినిగి పోయిన, మురికి బట్టలు వేసుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు. అతడు ఈయన్ని చూసి సార్ మీరు ఎవరు, మీ కారుకు ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ ఇంజనీర్ తాను ఎవరో తన
ఇటీవలి పోస్ట్‌లు

ఒక వీరుని చరిత్రకు సంబంధించిన ఒకపేజీ అర్ధాంతరంగా కనుమరుగైనరోజు

సుభాష్ చంద్రబోస్ ...ఈ పేరు తెలియని భారతీయుడుండడేమో...ఆ పేరు వినబడగానే ఏదో మనసులో ఒక ఆరాధభావన.. ఆయన మతాలకతీతుడు, కులవర్గాలకు అతీతుడు..ఈ దేశంలో జన్మించి విదేశీయుల బానిసత్వం నుండి ఈ దేశానికి విముక్తి కలిగించాలని పోరాటం చేస్తూ కనుమరుగైపోయిన ఒక గొప్ప స్వాతంత్రసమరయోధుడు ఈ నేతాజీ!!!      జనవరి 23,1897లో కటక్ లో ఒక సంపన్నకుటుంబంలో జన్మించిన బోస్ అక్కడే విద్యాభ్యాసం చేశారు.తండ్రి జానకీనాథ్ గొప్పలాయర్ ..మరియ అతివాద భావాలు గల కాంగ్రీస్ నాయకుడు. 1920 లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షలో నాల్గవర్యాంక్ రాగా ఇంగ్లీషులో ఆల్ ఇంగ్లండ్ స్తాయిలో ప్రథముడుగా నిలిచాడు. అయితే 1921 ఏప్రెల్ లో సివిల్ సర్వీస్ కి రిజైన్ చేసి భారతస్వాతంత్రోద్యమంలోనికి ప్రవేశించారు..భారత జాతీయకాంగ్రీసు లో యువజన అధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషించారు.చిత్తరంజన్ దాస్ గారితో కలిసి బెంగాల్ ఉద్యమం నడిపేరు. హిందీలో అతని ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగించేవి.అనతికాలంలో మంచివక్తగా, ఆకర్షణీయమైన నాయకుడిగా ఎదిగేరు. 1937 డిశంబరు 26 న ఎమిలీషెంకల్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు..   అయితే స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్న తీరుపట్ల బోస్ అసంతృప్తిగా వుండేవారు.గాంధ

నిజానికి అమ్మ అందంగా లేదని ..

ఇప్పుడు కావాల్సింది కొన్ని అక్షరాలు కాదు  పిడికెడు ప్రేమను పంచే కొన్ని మాటలు...!! అవును నిండు పున్నమి వెన్నెల ఎంతో అందంగా కనపడొచ్చు అంతకంటే అందమైనది అమ్మ మనసు ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నమైనా చేసావా? నిజానికి అమ్మ అందంగా లేదని  మా అమ్మ అని చెప్పుకోలేని  కుమారులు,కుమార్తెలు కూడా నివసించే సమాజం ఇదని మర్చిపోవద్దు అమ్మ విషయంలో ఆత్మానుసారంగా ప్రేమించాలి అందాన్ని ప్రాతిపదికగా తీసుకొని కాదు...!! కన్న పిల్లలు అందంగా లేకపోయినా  అవిటివాళ్ళయినా ఒకే రకంగా ప్రేమను పంచుతుంది అమ్మ ఎందుకంటే అమ్మ ప్రేమలో కొలమానాలు ఉండవు ప్రేమనే పదానికి సరైన నిర్వచనమే అమ్మ...!! చెప్పడంలో గొప్పతనం చూపించకండి చేతల్లో గొప్పతనం ప్రదర్శించండి కూటికి దూరమై కాటికి దగ్గరవుతున్న కన్న తల్లులను కసాయి వాళ్ళలా వృద్ధాశ్రమాలకు అమ్మే పిల్లలెందరో... అమ్మ మనకు భారమవుతుందా అమ్మ మనలను ఏం అడుగుతుంది...? అమ్మ నోరు తెరిచి ఏమీ అడగదు నువ్వు తనకోసం చిన్న పని చేసినా అంతకు వెయ్యి రెట్లు ఆనందపడుతుంది అమ్మ...!! అప్పుడప్పుడూ నీ సంపాదనలోనుండి  అమ్మకు తను ఆనందపడే కానుకలు కొని ఇవ్వండి తనకు ఇష్టమైన భోజనంతో కడుపు నింపండి పాలకోసం మనం ఏడిస్తే తల్లడిల్లిన తల

సిరిల్ రాడ్ క్లిఫ్ భారతదేశవిభజన సమయంలో ఆస్థులు,జనాభా,సరిహద్దులు నిర్ణయించడానికి నియమించిన వ్యక్తి.

 జూన్ 3 న ఇంగ్లండ్ పార్లమెంట్ భారతదేశవిభజనకు అమోదం తెలిపింది. దానికి దాదాపు సంవత్సరకాలం అంటే జూన్ 1948 వరకు గడువు విదించింది.దానికి అనుగుణంగా రాడ్ క్లిప్ ను నియమించడం జరిగింది. ఈ సిరిల్ రాడ్ క్లిఫ్ అనే ఆయన పెద్ద న్యాయకోవిధుడుకూడా కాదు.బ్రిటన్ లో పెద్దపేరున్నవాడూకాదు. అంతకముందు భారత్ కు ఎప్పుడూ రాలేదు.భారతీయ సంస్కృతి ,సాంప్రదాయాలు,భావోద్రేకాల మీద అసలు అవగాహనలేదు.మౌంట్ బాటన్ రాడ్ క్లిప్ పేరు చెప్పగానే ,వెంటనే జిన్నా ఒప్పేసుకోవడం నాటి రాజకీయ విశ్లేషకులకు అనుమానాలొచ్చాయి.అయితే నెహ్రుా లాంటి నాయకులు కొంచెం కూడా అనుమానించలేదు.కానీ లండన్ లో జిన్నా లాయర్ గా వున్నప్పుడు ఈ రాడ్ క్లిఫ్ అతని దగ్గర జూనియర్ గా వుండేవాడని విమర్శలు వచ్చాయి.జిన్నా ఆ ఆరోపణలను ఎప్పుడూ ఖండించలేదు. జూలై-2 న పాక్ గవర్నర్ జనరల్ గా జిన్నా పట్టుబట్టి నియమించుకున్న తరువాత మౌంట్ బాటన్ అధికారం పాక్ పై లేకుండా పోయింది. జిన్నా అక్కడ నుండి చక్రం తిప్పాడు.రాడ్ క్లిఫ్ తో ఉన్న పరిచయంతో తనకు అనుకుాలంగా కొన్ని నిర్ణయాలు తీసుకొనేటట్లు చేసుకున్నాడు. కానీ ఇది తెలియని కాంగ్రీసునాయకులు తూర్పు బెంగాల్ ,చిట్టిగాంగ్ ,పంజాబ్ ,సింధు,వాయవ్యసరిహద్దు

గంటలు గంటలు స్పీచులు దంచేస్తుంటారు, వాళ్ళ కొసమే ఈ చిన్న స్టోరీ..

  ఒక షూ కంపేనీ ఒక సర్వే నిర్వహించింది తన సర్వే పనిలో భాగంగా ఒక వ్యక్తిని పంపించింది సర్వే పూర్తి చేసిన వ్యక్తి రిపొర్ట్ ఇలా ఇచ్చాడు... సార్ ఇక్కడ ఒక్కరు కూడ షూ వెస్కోడం లేదు ఇక్కడ మన కంపేని మొదలు పెడితే మనకు లాభాలు రావడం పక్కన పెట్టండి మనకి అస్సలు కూడ మిగలదు... కంపెనీ కొన్ని నెలలు ఆగాకా మరొక వ్యక్తిని సర్వే పనుల మీద పంపించింది... రెండవ వ్యక్తి సర్వే పూర్తి చేసి కంపెనీకి,   " అయ్యా.. ఇక్కడ ఒక్కరు కూడా షూస్ వెయ్యడం లేదు.. ఇక్కడ కాని మన బిసినెస్ మొదలు పెడితే  చాలా బాగుంటుంది.. దేనికంటే వాళ్ళకు షూస్ గురించి తెలియదు మనం తెలియజేస్తాం  సో... మనకి లాభాలు ఆకాశాన్ని అంటుతాయి అని తెలియజేసాడు... అలాగే కంపేనీ స్టార్ట్ చేసిన షూ కంపేనీ సక్సేస్ అయింది...  నమ్మకం ఉన్న చోటనే విజయం ఉంటది  అవకాశాన్ని సద్వినియోగం చేస్కొవడం పెద్ద విషయం కాదు. ఆ అవకాశాన్ని క్రియేట్ చేస్కోవడం గోప్పతనం. అవకాశం లేదు,  రావడం లేదు అని ఎవరినో నిందించుకుంటూ మనకి మనం ఆత్మ ద్రోహం చేస్కొవడం కంటే  మనచుట్టూ మనకి సరిపడిన అవకాశాన్ని క్రియేట్ చెస్కుంటే.. అంతా హ్యాపీ యే కదా...?? మనలో ఆశావాద ద్రుక్పదం ఉన్నపుడే అది సాద్యపడుతుంది... డొంట్

మనం సృష్టించిందే మనకంటే గొప్పదైతే కాదు కదా..... ఏమిటి అది ?

  ఒకప్పుడు పిల్లలు ఏడుస్తుంటే  ఆ పిల్లలకు చిన్న కథలు చెప్పి మాటలు చెప్పి ఏడుపు మాన్పించేవారు   మొండి చేస్తున్న పిల్లలకు పక్షులను  వీధిలో  వెళ్లే చిన్న చిన్న జంతువులను  చూపించి ఆ వైఖరిని  మార్చేవారు   అన్నం  తినిపించాలంటే కథలు  నిద్ర పుచ్చాలంటే అమ్మమ్మ  తాతయ్య  కథలు చెప్పేవారు   ఇంకా ఎక్కువ మారాం  చేస్తే నాలుగు పడితే  దారిలోకి  వచ్చేవాళ్ళు   ఇప్పుడేమో పిల్లలకు ఈ సెల్ల్ఫోన్  ని బాగా అలవాటు  చేసారు   ఇప్పుడేమో దేనికైనా ఆ ఫోనే బిడ్డ ఏడిస్తే ఫోన్  అన్నంతినాలంటే ఫోన్  నిద్రపోవాలన్నా ఫోన్  ఎందుకు ఇలా చేస్తారు  అని అడిగితే క్షణాల్లో ఏడుపు ఆపేస్తారండి మారం చేయకుండా  తినేస్తారండి   ఫోన్ చూస్తూ నిద్ర పోతారండి  అని  ఇలా అన్ని మీరే అలవాటు చేసి  పిల్లలు చెడిపోవడానికి  కారణం  ఫోన్ అనిఎంత తేలికగా  చెప్పేస్తారండి  ఆ తప్పు ఫోన్ అలవాటు చేసిన మీది  కాదా ??? టెక్నాలజీ  ఎంత మారిందంటే   మంచిని చూపెడుతుంది  చెడును చూపెడుతుంది   ఎంచుకునే మనలోనే  ఉంది మనం మంచి మార్గంలో  నడుస్తామా లేక చెడిపోతామా అని  పిల్లలకు సాధ్యమైన  అంత వరకు కాదు అసలు ఫోన్ ఇవ్వకండి పిల్లలకు ఫోన్ కొనివ్వడం  ఇప్పటి పెద్దలకు ప్రెస్టేజ్   మానుకోం

శ్రీకృష్ణదేవరాయలకు దేవకీపురానికి గల సంబంధమేమిటో ?

పూర్వకాలంలో జంటగా కవిత్వం చెప్పిన వారిలో నందిమల్లయ్య - ఘంటసింగయ్యలు ప్రముఖులు. ఇద్దరు బంధువులు కూడా. నందిమల్లయ్యకు ఘంటసింగయ్య మేనల్లుడు. 1480 కాలంలో గుంటూరు, నెల్లూరులలో వుండేవారు. నెల్లూరులోని ఉదయగిరి దుర్గాన్ని గజపతుల సామంతుడైన పూసపాటి బసవరాజు పాలించేవాడు. అతని కొలువులో కవులుగా దూబగుంట నారాయణకవి, దగ్గుపల్లి దుగ్గనలు వుండేవారు.బసవరాజుకు మంత్రిగా  పెసరువాయ గంగన్న వుండేవాడు.ఇతనికే దగ్గుపల్లి దుగ్గన నాసికేతోపాఖ్యానం అంకితమిచ్చాడు. గంగన్నకు కృష్ణమిశ్రుడు (1098 A.D) సంస్కృతంలో వ్రాసిన ప్రభోదచంద్రోదయాన్ని తెలుగులో వ్రాయించుకోవాలనే కోరికవుండేది. ఎవరాపని చేయగలరని విచారిస్తే మల్లయ్య, సింగయ్యలు ఇందుకు కడు సమర్థులని తెలిసింది.అలా  ప్రభోదచంద్రోదయం తెలుగులో వెలసింది. కొన్ని కారణాల వలన ఈ జంటకవులు దేవకిపురం చేరారు. దీనికే దేవకాపురమని పేరు కూడా. తమిళనాడులోని ఉత్తరు ఆర్కాడులోని అరణి తాలూకాలో ఈ దేవకీపురం వుంది. దేవకీపురాన్ని గురించి ఎందుకు చెప్పాల్సివుందంటే ఇది నరసనాయకుడికి పుట్టిల్లు. నరసనాయకుడి నాయనమ్మ పేరు దేవకిదేవి. ఈమె పేరున దేవకాపురాన్ని నిర్మించడం జరిగింది. నరసనాయకుడేవరంటే శ్రీకృష్ణదేవరాయల తండ్ర

మెరిసేదంతా బంగారం కాదు ..

తృప్తితో కూడిన సామాన్య జీవితం ఎంతో ఉత్తమం ఎవరైతే దుర్బుద్ధి,  అక్రమ సంబంధం (స్త్రీ వ్యామోహం), అసత్యం, అవినీతి (ధనాశ), అధర్మం, అన్యాయం, మోసం, జూదం, మద్యపానం, ద్వేషం (క్రోధం - హింస) కలిగియుంటారో వారిని పాపకూపంలోకి లాగుతాడు కలిపురుషుడు.  వారిని చూస్తే భోగములతో వైభవంగా ఉన్నట్లనిపిస్తుంది. ఇది సరిగా అర్థంచేసుకోలేక, సామాన్యులు కొంతమంది "మనకి మాత్రమే ఈ పేదరిక బాధలు, కష్టాలు ఎందుకు? " అని చాలా మంది భగవంతుడిని దూషిస్తూ ఉంటారు.  నిజానికి భగవంతుడు పరీక్షించేది వీరిని కాదు, పైన చెప్పిన వారిని.  కలి ప్రభావానికి లోనైనవారు మాత్రం తమ భోగాలు చూసి మురిసిపోతుంటారు కాని ఇది ముందు ముందు జన్మలకి ఎంత ప్రమాదమో గ్రహించలేరు. తద్విరుద్ధంగా, నిత్యం భగవన్నామ స్మరణ, సత్యం, ధర్మాచరణతో, పరోపకారంతో సరళమైన జీవితం గడిపేవారికి ప్రశాంతమైన జీవితంతో పాటు, ముందు ముందు ఉత్తమ జన్మ లభిస్తుంది. ఈ సూత్రం ఎవరికైనా, ఎంతటి వారికైనా, ఆధ్యాత్మిక వ్యాపారం చేసే వారికైనా ఒక్కటే.  ఎక్కడి నుండి వచ్చామో, ఏ రూపాంతరం చెందామో ఎవరికీ తెలియదు.  ఒక్కటి మాత్రం సత్యంగా కంటిముందే సాక్ష్యం.  ఎన్నో జీవరాసులు, చీమలు, వానపాములు, కుక్కలు, పాముల

పడిపోవడం లో గొప్పతనం లేదు. పడిన ప్రతిసారి లేచి నిలబడడం లో ఉంది.

సృష్టి లో ఏ తప్పు లేదు. ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది.   మనం ఎక్కడకు వెళ్లినా మనతో పాటు మన హృదయం తీసుకొని వెళ్ళాలి.   ప్రతి రోజు మనం తృప్తిగా నిద్రించాలంటే ప్రతి ఉదయం ఒక చక్కటి సంకల్పంతో మేలుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి.   మనం గొప్ప పనులు చేయలేక పోవచ్చు. కానీ గొప్ప ప్రేమతో చేసిన పని చిన్నదైనా అది గొప్ప పనే అవుతుంది.  ఒక వ్యక్తి మనకు కోపం తెప్పించ గలిగాడంటే ,అతడు మనమీద విజయం సాధించినట్లే.  ఒదిగి ఉండడం తెలిసిన వారికే , ఆధిపత్యం ఎలా చేయాలో తెలుస్తుంది.   పిల్లలు మన మాట వినడం లేదు అంటే వారు మనల్ని ఎప్పుడూ గమనిస్తూ వుంటారు అన్న విషయం గురించి ఆలోచించండి..!! ఎన్ని పనులన్నా మీకోసం మీరు సమయం ఇస్తేనే శాశ్వత ఆనందం, ఆరోగ్యం..!!

ధోని....ధోని...ధోని....ధోని.. ధోని. ధ్వని..మూగ బోయింది

ధోని ..ధ్వని ...ఆగి  పోయింది అది ఈ రోజు మాట కాని నిన్నటి  మాట ప్లే గ్రౌండ్ అంతా ఒకటే  ధ్వని ధోని....ధోని...ధోని....ధోని.. 360డిగ్రీలు  ఆడగల   ధోని 350 వద్ద ఆగి పోయింది ధ్వని మహేంద్రుని మాయ జాలం తో ఒక్కసారి దేశమంతా నువ్వెరపోయింది ధోని మాయా జాలంతో ప్రత్యర్థి వికేట్ల మీది బెయిల్స్  ఎగిరి పోయాయి ప్రత్యర్థి విసిరిన బంతి ధోని బ్యాట్ జోరుకు పిడుగులు కురిపిస్తూ గ్రౌండ్ దాటి పోయింది దిక్కులు చూడడమే వారి వంతయ్యింది కాని నేడు పులి అస్త్ర సన్యాసం చేసింది బ్యాటు పట్ట నని గ్లౌజు తొడగ నని ప్రతిజ్ఞ  చేసింది పులి అస్త్ర సన్యాసం చేసినా పులి వంశం చావబోదు మరెన్నో పులి పిల్లలు సిద్ధముగా ఉన్నాయి ఇక  హాయిగా ఆడొచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి కాని పులి వంశం చావ లేదు ధోని  మౌఖిక  ఉపదేశాలకై ఎదురు చూస్తూ ఉన్నాయి క్రికెట్ గ్రౌండ్  మూగ బోయింది 360 డిగ్రీ లు ఆట ఆడే ధోని 350 వద్దే ఆట  ఆగిపోయింది ధోని  ధ్వని  మూగబోయింది.

వెన్నుపోటుకు తలలువంచి .. బానిస బ్రతుకులు భరించి ..

 ఆత్మీయంగా ఆదరించి వెన్నుపోటుకు తలలువంచి బానిస బ్రతుకులు భరించి సహనపు హద్దులు నశించి ఆవేశంతో ఆగ్రహించి ఆలోచనతో ఆచరించి ఒక్కొక్కరుగా ప్రారంభించి కలసికట్టుగా కొనసాగించి విశ్రమింపు విస్మరించి కడదాకా పయనించి స్వాతంత్రాన్ని సంపాదించి స్వేచ్ఛా దీపాన్ని వెలిగించి దారి చూపిన ధీరులకు అర్పిద్దాం నివాళులు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించి

ఈ దేశం నాకు ఏమిచ్చింది?.....

  'ఈ దేశం నాకు ఏమిచ్చింది?' అన్న ప్రశ్నకు బదులుగా 'నువ్వు దేశానికి ఏమిచ్చావని ఆలోచించాలి' అనే సలహాను మనం ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం. ఆ ప్రశ్న- నిరాశకు చిహ్నం! 'ఈ దేశం నాకు ఏమీ ఇవ్వలేదు' అనే అపోహ ఆ ప్రశ్నలోంచి స్పష్టంగా ధ్వనిస్తోంది. ఈ దేశం ఎన్నెన్ని ఇచ్చిందో చెబితేనే ఆ సందేహం తీరుతుంది. ఆ అసంతృప్తి కనుమరుగవుతుంది. అంతేగాని, ఎదురు ప్రశ్నతో నోరు మూయిస్తే అపోహ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. మానవులుగా జన్మించవలసి వస్తే దేవతలు ఎంపిక చేసుకొనే ప్రదేశం-భారతదేశం. వివేకవంతులైన విదేశీ సాధకుల జ్ఞాన పిపాసకు చల్లని చలివేంద్రం ఈ దేశం. భారతదేశం ప్రపంచానికి భగవద్గీతను ప్రసాదించింది. అసాధారణమైన స్ఫూర్తిని అందించింది. కాళిదాస వ్యాస వాల్మీకాది మహామహా కవులకు ఈ దేశం జన్మనిచ్చింది. భారత భాగవత రామాయణాది మహా కావ్యాలను సృజించింది. ఏ రంగాన్ని అధ్యయనం చేసినా- ఆ రంగానికే ఆణిముత్యాలనదగిన ప్రతిభామూర్తుల కారణజన్ములను లోకానికి కానుక చేసింది. సాక్షాత్తు అవతారమూర్తులకే ఈ దేశం అమ్మఒడిగా నిలిచింది. తాను తరించింది, లోకాన్ని తరింపజేసింది. 'భారతదేశం ఎంతో ప్రత్యేకమైనది. భగవదనుగ్రహం సాధించిన కొద్ది దేశ

నఖ, వాయుజ,చర్మాణి, లోహ, శారీరజస్తథా....అంటే

నఖ, వాయుజ,చర్మాణి, లోహ, శారీరజస్తథా.... శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అంటే సంగీతానికి పిల్లలు, జంతువులు, పాములు మొదలైనవి  మైమరచి దానికి  వశం కావడం జరుగుతుంది. చక్కని సంగీతం అలజడిగా వున్న మనసుకు ప్రశాంతతనిస్తుంది. కమ్మటి సంగీతం మనసును శరీరాన్ని పులకింప చేస్తాయి. ఇలాంటి సంగీతం సృష్టించాటనికి ఎలాంటి వాద్యాలు అవరసరమో చూద్దాం.  వాద్యములు నాలుగు రకాలు అవి (1) తతములు = తీగసాయంతో వాయించగల వాద్యములు.ఉదా॥ వీణ. (2) సుషిరములు = వాయువును ఊదడం ద్వారా సంగీతాన్ని పలికించడం.ఉదాll నాదస్వరం, వేణువు. (3) అవనద్ధములు అనగా చర్మంచే నిర్మించడం జరిగినవి.తప్పెట, డోలు, మొ॥నవి. (4) కంచు, రాగి ఇనుము మొదలైన లోహంలచే తయారు చేయబడిన వాయిద్య పరికరములను ఘనములంటారు.ఉదా॥ తాళములు, గంట. వీటిలో గోరులసాయంతో సంగీతాన్ని సృష్టించడం జరిగితే వాటిని నఖజములంటారు. వాయువు ద్వారా సంగీతం సృష్టించడం జరిగితే వాటిని వాయుజమంటారు. చర్మమునుండి సంగీత శబ్దాలు వెలువడితే వాటిని చర్మజమంటారు. తాళం, గంట మొదలైనవాటిచే సంగీతం రావడం జరిగితే వాటిని లోహజమంటారు. తతవాయిద్యాలలో వీణ ముఖ్యమైనది. వీణలలో  నకులి, చిత్ర, విపంచి, మత్తకోకిల, ఆలాపిన

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి

మనం ఎలాటి అద్దాల లొం ఛి చూస్తే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది

  ఒక యువ జంట ఒక కొత్త ప్రదేశంలో నివాసం ఉంటున్నారు ఆ భార్యా భర్తలు ఇద్దరు ఉదయమే అల్పాహారం తింటూం డగా పొరుగున  ఉన్న ఆమె ఉతికి దండెం మీద ఆరవేసిన బట్టలు కనిపిం చాయి. భార్య ఆ బట్టలు చూసి “అవి శుభ్రం గా లేవు కొంచెం మంచి సబ్బుతో ఉతికితే బాగుండేది ఆమెకు బట్టలు బాగా ఉతకడం రాదు ” అని విమర్శిం చిం ది.  ప్రతి రోజు పొరుగింటా విడ ఆరవేసిన బట్టలు చూసి ఇలాగే మాటలాడేది ఒక నెల తరువాత పొరుగిం టా విడ ఉతికి ఆరవేసిన బట్టలు శుభ్రం గా అందం గా కనిపిం చడం చూసి ఆమె ఆశ్చర్య పొయిం ది   భర్తని చూసి  చూడు ఆమె బట్టలు బాగా ఉతకడం నేర్చుకుంది ఎవరు నేర్పారో ఆమెకు నాకు చాల ఆశ్చర్యం గా ఉం ది అని పలికిం ది.  అప్పుడు భర్త ఈరోజు ఉదయం పెందలకడనే లేచి కిటికీలు శుభ్రం చేసాను  .నీకు బట్టలు శుభ్రం గా కనిపిం చడానికి కారణం అది అని చెప్పాడు శుభ్రమైన కిటికీ లోంచి బట్టలు శుభ్రం గా కనిపిం చినట్లే మనం  ఇతరులను  ఏదృష్టి తో చూస్తామో వాళ్ళు మనకదే  విధం గా కనిపిస్తా రు. నీతి:- ఇతరుల విషయం లో నీకు తోచినట్లుగా ఎప్పుడూ ఒక నిర్ణయానికి  రాకూడదు మనం ఎలాటి అద్దాల లొం ఛి  చూస్తే ప్రపంచం మనకు అలాగే కనిపిస్తుంది మనం మాటలాడే మాటల్లో మన ఆలోచనలు ప్రతి బిం

అనగా అనగా గొప్ప తాపీ మేస్త్రీ ఒకడు ...

అనగా అనగా గొప్ప తాపీ మేస్త్రీ ఒకడు ఉండేవాడు. అతని నైపుణ్యం అద్భుతం! అతని పనితనం అసామాన్యం; అనితర సాధ్యం! ముప్ఫై సంవత్సరాలుగా అతను ఒక కాంట్రాక్టరు క్రింద పని చేస్తూ వచ్చాడు. ఆ కాంట్రాక్టరుకు కూడా మేస్త్రీ అంటే చాలా గౌరవం అభిమానం- అందువల్లనే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. చివరికి ఒక రోజున మేస్త్రీ కాంట్రాక్టరుతో చెప్పేశాడు- "అయ్యా! ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పనేదో అయిపోగానే, నేను ఇక రిటైరు అయిపోతాను. బాగా పెద్దవాడిని అయిపోయాను, కొంచెం బలహీనంగా కూడా అవుతున్నట్లుంది. ఇప్పుడిక పనిని చాలించాలి. మిగిలిన కొద్దిపాటి జీవితాన్ని విశ్రాంతిగా గడుపుదామని ఉన్నది. ఈ సంగతిని కొంచెం ముందుగానే తెలియజేస్తున్నాను మీకు- ఏమంటే పనిలో కష్టం కలగకూడదు గద, అందుకని" అన్నాడు. కాంట్రాక్టర్ సన్నగా నవ్వాడు. సరేనన్నట్లు తల ఊపాడు. చేస్తున్న పనేదో ముగింపుకు వచ్చింది. పని ఆరోజుతో అయిపోతుందనగా కాంట్రాక్టరు మేస్త్రీని పిలిచి- "ఈ పని అయిపోగానే రిటైరు అయిపోతానన్నావు. నేను అందుకు ఒప్పుకున్నాను కూడాను. ఇదంతా నాకు గుర్తులేక కాదు- కానీ నాదొక చిన్న అభ్యర్థన- కాదనకు. నాకోసం మరొక్క చక్కని ఇల్లు- ఒక్కటంటే

గ్రేట్ బ్యాలెన్సింగ్ యాక్టర్స్! ...

  మనిషి అనుకుంటే  సాధిచలేనిది ఏదిలేదు అది పొట్టకూటి కోసమైనా  అంతరిక్షయానం కోసమైనా చేతులతో విన్యాసాలు  కాళ్లతో పరిన్యాసాలు కంటితో చూసే మనసుతో నియంత్రించే అదే జీవితం అదే జీవన విధానం  మనిషికి  అ కోస ఈ కొస  చావుపుట్టుకలు  మధ్యలో నడిచేది  సున్నితపుత్రాసు ముల్లు బ్యాలన్స్ చేయగలిగేది  నూటికి ఒకరో ఇద్దరో మిగిలిన వారంతా  నట చక్రవర్తులే  గ్రేట్ బ్యాలెన్సింగ్ యాక్టర్స్! -కోవూరి

ఫకీర్ ... మహారాజు ...

 ఒక ఫకీర్ చాలా కాలం పాటు ఒక  మహారాజు ఆస్థానంలో ఉండిపోయాడు.   మహారాజు ఆ ఫకీర్ పట్ల ఎంతో  ప్రేమాభిమానాలు చూపేవాడు. ఎంతలా అంటే మహారాజు తనతో సమానంగా   ఫకీరుకి త న గదిలోనే అతనికి వసతి ఏర్పాటు చేసాడు.                            ఫకీర్ హస్తం లేకుండా మహారాజు ఏ కార్యం తలపెట్టేవాడు కాదు. ఎంత చిన్న విషయమైనా ఇద్దరూ కలిసే చేసేవారు.   ఒకరోజు ఇద్దరూ వేటకు వెళ్ళారు.  వేటలో ఇద్దరూ దారి తప్పిపోయారు. తీవ్రమైన ఆకలి దప్పికలతో ఒక చెట్టు నీడకు చేరుకున్నారు. ఆ చెట్టు మీద  ఒకే ఒక పండు ఉన్నది. మహారాజు  వెంటనే గుర్రంపైకెక్కి ఆ పండును   తెంపి, ఆరు ముక్కలుగా కోసి అలవాటు ప్రకారం మొదటిముక్కని ఫకీరుకి అందించాడు.                         ఫకీరు  ఆ ముక్క తిన్నవెంటనే -" ఆహా! ఎంత మధురంగా  ఉంది. నా   జీవితంలో ఇంత రుచికరమైన పండుని తినలేదు,ఇంకో  ముక్క కావాలని "అడిగాడు. ఆ విధంగా ఐదు  తిన్నాడు. ఎప్పుడైతే మిగిలిన చివరి ముక్కను కూడా అడిగాడో, వెంటనే మహారాజు ఇలా అన్నాడు." నీ వాటాకు మించి ఇచ్చాను, నేను కూడా ఆకలితోనే ఉన్నాను కదా! నాకు నీ మీద ప్రేమ ఉంది కానీ నీకు నా మీదఏ మాత్రం ప్రేమ లేదు." అని ఆ చివరి ముక్కను తనే త

అనాథశరణాలయానికి విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున...

  ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు. వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను. లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు. గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని. నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను సత్యమూర్తి నీ. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని. అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు

కళ్ళు లేవు .. కానీ రాముని ఉనికిని కాపాడాడు..

రామ్‌లాలాకు అనుకూలంగా వేద పురాణం ఉల్లేఖనంతో సుప్రీంకోర్టులో వాంగ్మూలం ఇచ్చిన రామభద్రాచార్య వీరే ..! శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా వాదిగా హాజరయ్యారు. వారే తులసిపిత్ వ్యవస్థాపకులు, ధర్మచక్రవర్తి, పద్మవిభూషణ్, జగద్గురు రామభద్రాచార్య ...!  వివాదాస్పద సమయంలో శ్రీరామ్ జన్మభూమికి అనుకూలంగా ఆయన ద్వారా ఆధారాలు ఇవ్వబడ్డాయి.  న్యాయమూర్తి కుర్చీపై కూర్చున్న వ్యక్తి ముస్లిం ... అతను వెళ్ళిన వెంటనే, జడ్జిగారు ఒక క్లిష్టమైన ముడి వేసే ప్రశ్న అడిగాడు, “మీరు ప్రతిదానిలో వేదాల నుండి రుజువులు చూపిస్తారు కదా ...? కాబట్టి అయోధ్యలో ఆ ప్రదేశంలో శ్రీరామ్ జన్మించాడని వేదాల నుండి నిరూపించగలరా?”  జగద్గురు రామభద్రాచార్య గారు (తన ప్రజ్ఞా చక్షువు చే) ఒక్క క్షణం కూడా సమ్యమనం కోల్పోకుండా, "నేను మీకు ఇవ్వగలను సార్" అని చెప్పాడు. మరియు అతను ఋగ్వేదం యొక్కమూలం నుండి ఉల్లేఖించడం ప్రారంభించాడు. దీనిలో సరయు నది ప్రదేశం నుండి రామజన్మ భూమికి దిశ మరియు దూరం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితమైన వివరాలు ఇచ్చి, శ్రీరామ జన్మభూమి పరిస్థితి వివరించబడింది. కోర్టు ఆ మూల గ్రంథాన్ని కోరింది ... మరియు అందులో జగద్గురు జీ పేర్కొన్న నంబర్ తెరి

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఒకరు అడిగారు మీరు వర్కింగ్ ఉమేనా, లేదా హౌస్ వైఫా?..

(ఆమెను ) ఒకరు అడిగారు మీరు వర్కింగ్ ఉమేనా, లేదా హౌస్ వైఫా? అని..... హా ...... నేను కేవలం హౌస్ వైఫే కాని 24గంటలు వర్క్ చేసే హౌస్ వైఫే నేను ఒక అమ్మ నేను ఒక భార్య నేను ఒక కుమార్తె నేను ఒక కోడలు నేను ఒక అలరాం గడియారం నేను ఒక వంటామె నేను ఒక అంట్లుతోమె పనిమనిషి ని  నేను ఒక టీచర్ నేను ఒక అకౌంటెంట్ నేను ఒక గుమాస్తా నేను ఒక వడ్దించే వేటర్ నేను ఒక ఆయా నేను ఒక నర్సు నేను ఒక గార్డనర్ నేను ఒక గూర్ఖ నేను ఒక కౌన్సిలర్ నేను నా భర్తకి శయనభాగస్వామి అయినా చూడండి నాకు సి. యల్. లేదు, ఈ. యల్ లేదు సండెలేదు, పండుగ , అంతేకాదు నాకు జీతంలేదు. కాని ఎందుకో అందరూ అడుగుతారు ఇంట్లో కూర్చొని ఎం చేస్తావని? ఫలానా ఆవిడ ఇలా పనిచేస్తుంది, ఫలానా ఆవిడా అక్కడ ఉద్యోగం చేస్తుంది, ఫలానా ఆవిడ వ్యాపారం చేస్తుంది అని. మీరు కాళీగా ఉండే బదులు అలా పని చేయొచ్చు కదా అని. దయచేసి ఒకరిని మరొకరితో పోల్చకండి.  అందరి ఆడవారి పరిస్థితులు ఒకేలా ఉండవు. వాషింగ్ మెషిన్,మిక్సీలు వచ్చాక కూడా ఇంకేమి పని ఉంటుంది అంటారేమో ....! మీ ఇంటి ఇల్లాలిని ఒక్క నెల రోజులు పుట్టింటింకి పంపించి అదే వస్తువులతో మీ ఇల్లాలి పని ఒక్కసారి మీరు చేసి చూడండి. మీ వంటగది చెప్త

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

వెలుగు ఉన్నచోట నీడ వుంటుంది ... మంచి ఉన్నచోట చెడు కూడా ఉంటుంది...

  సజ్జనులున్న సభలలో  దుర్జనులు కూడా ఉంటారు  తామరపువ్వు లున్న చోట  నాచు కూడా ఉంటుంది... గులాబీపువ్వులున్న మొక్కలో   ముళ్ళు కూడా ఉంటాయి కోయిలలున్న చెట్టుపై కాకులు కూడా ఉంటాయి... ధర్మరాజు ఉన్నచోటే ధుర్యోధనుడున్నాడు కృష్ణుడున్నప్పుడే కంసుడున్నాడు రాముడు ఉన్న కాలంలోనే  రావణుడు కూడా ఉన్నాడు... పగలు ఉంది అంటే రాత్రి కూడా ఉంటుంది వెలుగులున్న పగటికాలంలో సత్కారాలు చెయ్యాలి చీకట్లున్న రాత్రివేళ  ఆదమరచి నిద్రించాలి... మంచిని పెంచుకుంటూ పోవాలి చెడును త్రుంచుకుంటూ ఉండాలి అప్పుడే బ్రతుకులలో అందాలు నిండుతాయి ఆనందాలు పండుతాయి జ్ఞానమున్నచోట అంతా పన్నీరే జ్ఞానం లోపిస్తే బ్రతుకంతా కన్నీరే...

"మెంటల్ ఏజ్..."

ఏయ్ చిట్టి చిన్నారి అక్కా.... బాగున్నావా .....  నన్ను అందరూ గేలి చేస్తున్నారు .... మెంటల్ ఏజ్ పెరగాలి అంటున్నారు ... ఏమిటే అది .....  ఒరేయ్ కన్నా.... శారీరక వయస్సు, మానసిక వయస్సు అని రెండు రకాలు.  స్కూల్ లేక నీకు కొన్ని పాఠ్యాంశాల మీద అవగాహన లేక తెలీక పోవచ్చు.  నువ్వు పుట్టిన రోజుకు వేరొక రోజు అడిషన్ చేస్తే వచ్చేది నీ శారీరిక వయస్సు. ఆ పెరుగుదలకు నీ ప్రేమయం లేదు. కానీ.  మానసిక వయస్సు ...నీ ప్రవర్తన, జీవిత అనుభవాలు, కష్ట నష్టాలు, జీవితంలో తగిలిన  ఎదురు దెబ్బలు ఇత్యాది విషయములతో కూడుకొని .... ఏ రకముగా పుష్పం పిందిగా, కాయగా , ఫలంగా పరిపక్వత చెంది అది ఏ ఉద్దేశ్యంతో ఈ భూభాగం మీద ఉద్భవించ్చిందో ఎరింగి ఇతరులకు తీపి రుచిని ఇచ్చి వారి మనసు ఉల్లాసం కలిగించిన ప్రతీ క్షణం కూడా పెరుగుతూ వుంటుంది ....  బట్...శారీరిక వయస్సు అంత వాస్ట్ గా కాకుండా .... చాలా స్లో పేస్ లో పెరుగుతుంది.  అందుకనే నువ్వు అబ్జర్వ్ చేసే వుంటావు..... కొంత మంది వయస్సుకు తగ్గట్లుగా బిహేవ్ చేయట్లేదని విజ్ఞులు అయిన వాళ్ళు పసికడుతూ వుంటారు.  టీనేజ్ వరకు శారీరిక వయస్సు ప్రోపోర్షనెట్ గా మానసిక వయస్సు పెరగి పుష్పం కాయగా మారే ప్రక్రియ జ

పరాయి స్త్రీ పై వ్యామోహం ఎంగిలిఆకులో భోజనము ఒక్కటే ...

ఒకసారి ఒక రాజుగారు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు. ఆ ఇoటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అన్నము వడ్డిస్తూ వుంది. ఆమె చాల అందగత్తె, ఆవిడ అందము చూసి రాజుగార్కి ఆశ్చర్యము కలిగింది, ఆమె అందానికి వివశుడై మోహంలో పడిపోయాడు. నా రాజ్యములో ఇoత అందమైన స్త్రీని ఇదివరకు చూడలేదే అని అనుకున్నాడు. ఆమె భర్త భోజనo చేసి తన పనికై బయటికి వెళ్ళాడు.  భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడా రాజు ఇoటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తెరిచి చూడగా ఆయన వేషధారణను బట్టి ఎవరో రాజవంశానికి చెందిన వ్యక్తి అనుకున్నది. ఎవరు మీరు అని ప్రశ్నించింది. రాజుగారు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును, నీవు చాలా అందంగా వున్నావు, నీ అందం నన్ను కట్టిపడవేస్తోంది. నిన్ను నా భార్యగ చేసుకోవాలి  అనుకుంటున్నాను, నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహారాణిని చేస్తాను, నీవు చూడని సంపద చూడగలవు, అడుగులకు మడుగులోత్తే పనివారు, కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యతనాది అన్నాడు. ఆమె గుణవంతురాలు  మరియు మంచి సంస్కారము  కలది. ఆవిడ రాజుగారితో ఇలా అన్నది. రాజా! తప్పకుండా మీ కోరిక తీరుస్తాను, ముందు మీర

మనసు కృపను పొందలేక పోతే ... వామ్మో

జీవితం బహు చిత్రమైనది. ఒడుదొడుకులు, ఆరాటం, పోరాటం మనిషి మనసును మధించి అశాంతికి గురిచేస్తాయి. గెలుపు, ఓటములు, కష్టసుఖాలు ఉంటాయి. మనసును సమాధానపరచుకొని ముందుకు సాగాలి. సాధారణంగా ఆటల్లో నెగ్గినవారిని, పాటల్లో గెలిచినవారిని విజేతలంటారు. కంటికి కనిపించకుండా మనల్ని ఆడిస్తుంది మనసు. దాని ఆట కట్టించగలిగితేనే మనిషి విజయం సాధించినట్లు! మనసును అదుపులో పెట్టడం అంత సులభం కాదు. దానికి తగిన సాధన చెయ్యాలి. మనసును జయించడానికి ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. మనసును మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. అంతేకాని, దాని చేతుల్లో కీలుబొమ్మ కారాదు. అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చని గీతాచార్యులు వెల్లడించారు. ‘దేవుడి కృపను పొందవచ్చు. గురువు కృపను, సాధుజనుల కృపను పొందవచ్చు. కాని మనసు కృపను పొందలేక నాశనమవుతాడు’ అని సామెత ఉంది. ‘వెయ్యిసార్లు వెయ్యిమందిని యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించినవాడే పరాక్రమవంతుడు’ అంటుంది ధమ్మపద. మనసును స్వాధీనం చేసుకోవడం ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన పని. స్వాధీనం తప్పిన మనసు మనిషి వ్యక్తిత్వం సమగ్రంగా వికసించకుండా అడ్డుపడుతుంది. మనోనిగ్రహం లేని వ్యక్తి విపరీ

సరిగ్గా 78 ఏళ్ల క్రితం ఇదే రోజు ..

సరిగ్గా 78 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఆగస్టు 8వ తేదీ)న తెల్లదొరలు దేశాన్ని వీడి వెళ్లిపోవాల్సిందిగా కోరుతూ... #క్విట్ఇండియా నినాదంతో నాటి భారత జాతీయ కాంగ్రెస్ ఓ ఉద్యమాన్ని చేపట్టింది. ఆ చారిత్రక దిన ఫలితమే మనం అనుభవిస్తున్న భారత స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలు. స్వతంత్ర పోరాటం కోసం జాతిపిత మహాత్మాగాంధీ నేతృత్వంలో అనేక ఉద్యమాలు సాగినా.. క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయుల పాలనలో సంచలనం సృష్టించింది. అహింసామార్గంలో సాగిన ఈ ఉద్యమానికి మహాత్మాగాంధి ఇచ్చిన పిలుపుకు మేల్కొన్న జాతి యావత్తు ముందుకు తరలివచ్చింది. దీన్ని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. క్రిప్స్ మిషన్ విఫలమైంది, 1942 ఆగస్టు 8 న, బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ డూ ఆర్ డై కి పిలుపునిచ్చాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి "క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ" కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది.  ఈ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరంభంలో సాత్త్వికంగా కొనసాగిన ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలతో తీవ్రరూపం దాల్చింది. ఆంగ్లేయుల చర్యలను ఏమాత్రం లెక్